E-Paper
Advertisement

Health Tips: కొత్త చెప్పులు కరుస్తున్నాయా?.. ఈ సింపుల్ చిట్కాలతో ఆ సమస్యను తరిమి కొట్టండి!

Health Tips: కొత్త చెప్పులు కరుస్తున్నాయా?.. ఈ సింపుల్ చిట్కాలతో ఆ సమస్యను తరిమి కొట్టండి!
Advertisement

Health Tips: కొన్నిసార్లు ఎంతో ముచ్చటపడి కొనుక్కున్న కొత్త చెప్పులు లేదా షూస్ వేసుకున్న కాసేపటికే కరుస్తుంటాయి. దీంతో కాళ్లపై బొబ్బలు ఏర్పడి, తెగ మంట పెడుతుంటాయి. ఇలా కొత్త చెప్పులు కాళ్లను కరుస్తుంటే నొప్పిగానే కాదు.. నడవడానికి కూడా అసౌకర్యంగానే ఉంటుంది. అందుకే కొత్త చెప్పులు కరవకుండా ఉండాలంటే ఈ సింపుల్ చిట్కాలను పాటించేయండి మరి.

సింపుల్ టిప్స్.. చిటికెలో పరిష్కారం:

* కొత్తగా కొనుక్కున్న చెప్పుల్ని వెంటనే వేసుకుంటే కొన్నిసార్లు కరుస్తాయి. దీంతో వేళ్లు, మడమల దగ్గర బొబ్బలు వస్తుంటాయి. ఇలా కాకుండా ఉండాలంటే.. అక్కడ డియోడరెంట్‌ స్టిక్‌తో రుద్దితే లూబ్రికెంట్‌లా పనిచేస్తుంది. దీని కోసం గ్లిజరిన్‌ కూడా వాడొచ్చు. ఇవి గాయాలు కాకుండా రక్షణ కల్పిస్తాయి.

Advertisement

* శాండిల్స్‌ లేదా షూలను కొత్తగా వేసుకునేటప్పుడు పాదాలకు డియోడరెంట్‌ లేదా హెయిర్‌ సీరమ్‌ పూయండి. ఇవి పాదాలు, పాదరక్షలకు మధ్య రాపిడిని తగ్గిస్తాయి. దాంతో బొబ్బలు, గాయాలు అవ్వకుండా ఉంటాయి. లేదంటే.. ఇంట్లో పెట్రోలియం జెల్లీ ఉంటే.. దానిని పాదాలపై మందంగా పట్టించినా ఫలితం ఉంటుంది.

* కొత్త షూలను ధరించేటప్పుడు మెత్తటి సాక్సులను వేసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. పైకి కనిపిస్తాయన్న బెంగ ఉంటే.. వాటిల్లోనూ ఇప్పుడు మడమల వరకే కప్పుతూ బోలెడు రకాలు అందుబాటులో ఉన్నాయి. అలాంటి సాక్సులను ప్రయత్నిస్తే సరిపోతుంది.

Advertisement

*  మీరు ధరిస్తున్న శాండిల్స్‌కు పాదాల యొక్క చర్మం ఒరుసుకుంటుంటే.. ఆ ప్రదేశంలో బ్యాండెయిడ్‌ లేదా సర్జికల్‌ టేప్‌ వేయండి. వీటిలోనూ ట్రాన్‌స్పరెంట్‌ రకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిని వేసుకుంటే.. గాయాలు, బొబ్బలు కనిపించవు.

* అలాగే కొత్త షూస్‌లో బేబీ పౌడర్‌ని బాగా చల్లి ఆపై వేసుకున్నా బొబ్బల భయం ఉండదు. లేదంటే..  ఇంట్లో ఉన్న హెయిర్‌ డ్రైయర్‌ని మొదట హీట్‌ మోడ్‌లో పెట్టండి. ఈ తర్వాత చెప్పులను వేసుకొని, హెయిర్ డ్రైయర్‌తో షూ వెనక, ముందు కొంతసేపు వేడిగాలి తగిలేలా చేసినా కొంచెం వదులవుతాయి. దీంతో చెప్పులు కరిచే సమస్య ఉండదు.

Related News

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్ని ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

Big Stories

Advertisement
×