E-Paper
Advertisement

MS Dhoni-Kohli: కోహ్లీకి ధోని ఆశీర్వాదం…నిద్ర‌పోయిన సెక్యూరిటీ, గ్రౌండ్ లోకి ఆగంత‌కుడు

MS Dhoni-Kohli: కోహ్లీకి ధోని ఆశీర్వాదం…నిద్ర‌పోయిన సెక్యూరిటీ, గ్రౌండ్ లోకి ఆగంత‌కుడు
Advertisement

MS Dhoni-Kohli:  టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య ఇవాళ తొలి వన్డే జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వన్డే మ్యాచ్ లో టీమిండియా అద్భుతంగా రాణించి, విజయం దిశగా దూసుకు వెళ్తోంది. టాస్ ఓడిపోయిన టీమ్ ఇండియా మొదట బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిర్ణీత 50 ఓవర్లు ఆడిన టీమిండియా 8 టికెట్లు నష్టపోయి 349 పరుగులు సాధించింది. ఇక ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా ఇప్పటికి ఐదు వికెట్లు నష్టపోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్ లో దాదాపు టీమిండియా గెలిచే అవకాశాలే కనిపిస్తున్నాయి.

Also Read: IND VS SA ODI Series: ద‌క్షిణాఫ్రికా-టీమిండియా 3 వ‌న్డేల సిరీస్..టైమింగ్స్‌, షెడ్యూల్, ఉచితంగా ఎలా చూడాలంటే

విరాట్ కోహ్లీ సెంచరీ.. కాళ్లపై పడిపోయిన అభిమాని

Advertisement

జార్ఖండ్ లోకి JSCA ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్ దక్షిణాఫ్రికా వర్సెస్ టీమిండియా మధ్య మొదటి వన్డే జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ దుమ్ము లేపారు. విరాట్ కోహ్లీ అర్థ సెంచరీ నమోదు చేసుకోగా విరాట్ కోహ్లీ తన 52వ సెంచరీ నమోదు చేసి దుమ్ము లేపాడు. ఈ మ్యాచ్ లో 120 బంతుల్లో 135 పరుగులు సాధించాడు విరాట్ కోహ్లీ. ఇందులో ఏడు సిక్సర్లు అలాగే 11 బౌండరీలు ఉన్నాయి.

ఈ సెంచరీ నమోదు కాగానే తన వన్డే క్రికెట్ లో 52 శతకాలు పూర్తి చేసుకున్నాడు విరాట్ కోహ్లీ. దీంతో సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. సచిన్ టెండూల్కర్ ఇప్పటి వరకు 51 సెంచరీలు వన్డేల్లో నమోదు చేశాడు. విరాట్ కోహ్లీ మాత్రం ఒక సెంచరీ ఎక్కువగా నమోదు చేసి సచిన్ రికార్డు బద్దలు కొట్టాడు. ఇక ఈ మ్యాచ్ లో సెంచరీ చేసిన నేపథ్యంలో గ్రౌండ్ లోకి ఓ అభిమాని దూసుకు వచ్చాడు. విరాట్ కోహ్లీ కాళ్ల పైన పడిపోయాడు ఆ అభిమాని. దీంతో సెక్యూరిటీ వెంటనే అతన్ని తీసుకువెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో అలాగే ఫోటోలు వైరల్ గా మారాయి.

ధోని ఆశీర్వాదం తీసుకున్న విరాట్ కోహ్లీ

Advertisement

దక్షిణాఫ్రికా జట్టుపై అదిరిపోయే సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ మహేంద్రసింగ్ ధోని ఆశీర్వాదం తీసుకున్నాడు. అయితే నేరుగా ధోని ఆ ఆశీర్వాదం ఇవ్వలేదు కానీ, అతని ఫోటో ద్వారా ఆశీర్వాదం తీసుకున్నాడు విరాట్ కోహ్లీ. అది ఎలాగా అంటే, రాంచీ స్టేడియం ధోని సొంతూరులో ఉంది. దీంతో స్టేడియంలోని ఒక ఎండ్ కు ధోని పేరు పెట్టారు. అయితే కోహ్లీ సెంచరీ చేయగానే, మహేంద్ర సింగ్ ధోని ఫోటోలు స్టేడియంలోని ఎల్ఈడీ ల పై ప్రదర్శించారు. అదే సమయంలో కెమెరామెన్ చాలా తెలివిగా విరాట్ కోహ్లీ తో పాటు ధోని కనిపించేలా వీడియోలు తీశాడు. దీంతో ధోని ఆశీర్వాదం కోహ్లీ తీసుకున్నట్లు పోస్టులు పెడుతున్నారు.

Also Read: WPL 2026 auction: WPL మెగా వేలంలో హీలీ Un sold.. దీప్తికి రూ.3.2 కోట్లు.. కడప బిడ్డకు భారీ ధర.. పూర్తి డీటెయిల్స్ ఇవే

 

 

Related News

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

Big Stories

Advertisement
×