Heart Attack: ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలమంది గుండెపోటుతో మరణిస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరి మైండ్‌లో.. శీతాకాలంలోనే ఎందుకు గుండెపోటు కేసులు పెరుగుతాయి? అనే సందేశం ఉంటుంది. అయితే ఈ హార్ట్ ఎటాక్‌లు అనేవి యాదృచ్ఛికంగా జరిగేవి కాదు. దీనికి ప్రధాన కారణాలు ఉన్నాయని చెబుతున్నారు వైద్య నిపుణులు.
గుండె ఆరోగ్యం విషయంలో అజాగ్రత్తగా ఉంటే.. సమయం, సందర్భం లేకుండా గుండె ఢమాల్ అవ్వడం ఖాయం అంటున్నారు. అయితే గుండెపోటుకు అధిక కొలెస్ట్రాల్ ఒక్కటే కారణం కాదు.. మరిన్ని కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ క్రమంలో హార్ట్ ఎటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్‌కు రావడానికి కారణాలేమిటి? చలికాలంలో గుండెను ఎలా కాపాడుకోవాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read: జాగ్రత్త సుమీ.. ఆ సమస్యలు ఉన్నవాళ్లు చెరుకు రసం అస్సలు తాగొద్దట!
రోజురోజుకు పెరుగుతున్న చల్లటి వాతావరణంలో గుండె నాళాలు సంకోచించి, ఉష్ణాన్ని కాపాడుకుంటాయి. దీంతో రక్తపోటు పెరిగి గుండె మీద ఎక్కువ ఒత్తిడి పడుతుంది. తర్వాత రక్తం మందంగా మారి రక్తనాళాల్లో మూసుకుపోయి ప్రమాదం ఏర్పడుతుంది. అలాగే శీతాకాలంలో శారీరక శ్రమ కూడా తగ్గుతుంది. ఇంట్లోనే ఉంటూ.. ఉప్పు ఎక్కువగా ఉండే భారీ ఆహారాలను తీసుకుంటుంటాం. దీంతో అధిక బరువు, రక్తపోటు, చక్కెర స్థాయులు పెరగడం, శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లు కూడా ఎక్కువగా వస్తుంటాయి. ఇవన్నీ గుండె మీద ఒత్తిడిని పెంచి, ముఖ్యంగా అధిక రక్తపోటు, చక్కెర వ్యాధి ఉన్నవాళ్లకు హార్ట్ ఎటాక్స్ వస్తుంటాయి.
శీతాకాలంలో గుండెను కాపాడుకోవాలంటే.. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం. దీని కోసం చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం, సాయంత్రం పూట, ఉదయం పూట చల్లటి గాలిలో ఎక్కువ సేపు ఉండకుండా.. ఇంట్లోనే చురుగ్గా ఉండేలా చూసుకోవాలి. అలాగే మీ శరీరంలోని రక్తపోటు, చక్కెర స్థాయులను తరచుగా పరీక్షల ద్వారా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఛాతిలో నొప్పి, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలు ఎదురైతే.. ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి.
Also Read: సొరకాయ రసంతో నాజూకైన నడుము సొంతం.. ఈ విధానంలో తాగారంటే పొట్ట వెన్నెలా కరిగిపోవాల్సిందే!