E-Paper
Advertisement

Hair Regrowth Tips: జుట్టు పలచబడిందా? ఈ టిప్స్ పాటిస్తే.. 3 వారాల్లోనే కొత్త జుట్టు

Hair Regrowth Tips: జుట్టు పలచబడిందా? ఈ టిప్స్ పాటిస్తే.. 3 వారాల్లోనే  కొత్త జుట్టు
Advertisement

Hair Regrowth Tips: ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితం, కాలుష్యం , ఒత్తిడి కారణంగా జుట్టు రాలడం అనేది అందరినీ వేధిస్తున్న ప్రధాన సమస్య. మీరు కూడా జుట్టు కోసం ఖరీదైన షాంపూలు, కెమికల్ ట్రీట్‌మెంట్లు వాడి విసిగిపోయారా? అయితే ప్రకృతి మనకు అందించిన అద్భుతమైన ఔషధాలతో కేవలం 3 వారాల్లోనే మీ జుట్టును మళ్ళీ పెరిగేలా చేసుకోవచ్చు. సరైన పోషకాహారం, సహజమైన నూనెలు, లైఫ్ స్టైల్ మార్పుల ద్వారా జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి.. ఒత్తైన జుట్టును ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

సహజ సిద్ధంగా జుట్టును పెంచుకోవడం ఎలా?
జుట్టు రాలడం అనేది కేవలం సౌందర్యానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు. అది మన ఆత్మ విశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తుంది. కానీ.. సరైన పద్ధతులు పాటిస్తే.. మన శరీరం తనను తాను నయం చేసుకునే శక్తిని కలిగి ఉంటుంది. 3 వారాల్లో మార్పు చూడాలంటే మీరు పాటించాల్సిన ముఖ్యమైన చిట్కాలు..

Advertisement

1. స్కాల్ప్ మసాజ్ – రక్త ప్రసరణే ముఖ్యం:
జుట్టు పెరగడానికి తల భాగంలో రక్త ప్రసరణ మెరుగ్గా ఉండాలి. కొబ్బరి నూనె, బాదం నూనె లేదా ఆముదాన్ని గోరు వెచ్చగా చేసి వారానికి మూడు సార్లు కనీసం 10 నిమిషాల పాటు మసాజ్ చేయండి. ఇది జుట్టు కుదుళ్లను నిద్ర లేపి కొత్త జుట్టు మొలిచేలా చేస్తుంది.

2. ఉల్లిపాయ రసం:

Advertisement

ప్రకృతి ప్రసాదించిన వరం. శాస్త్రీయంగా నిరూపితమైన పద్ధతుల్లో.. ఉల్లిపాయ జ్యూస్.. అగ్రస్థానంలో ఉంటుంది. ఇందులో ఉండే సల్ఫర్ జుట్టు ఎదుగుదలకు అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది.
ఎలా వాడాలి? ఉల్లిపాయ రసాన్ని తీసి దూదితో తలకు పట్టించి.. 30 నిమిషాల తర్వాత తేలిక పాటి షాంపూతో.. వాష్ చేయండి. మొదటి వారం నుంచే మార్పును గమనిస్తారు.

3. కలబంద: కలబంద జుట్టుకు సహజమైన కండీషనర్‌గా పనిచేస్తుంది. ఇది తలలో.. ఉండే పీహెచ్ స్థాయిని సమతుల్యం చేస్తుంది. మాడుపై పేరుకుపోయిన అదనపు సెబమ్‌ను తొలగించి.. రంధ్రాలు తెరుచుకునేలా చేస్తుంది. తద్వారా కొత్త జుట్టు రావడానికి మార్గం సుగమం అవుతుంది.

4. ఆహారంలో మార్పులు : లోపలి నుంచి పోషణ జుట్టు పెరుగుదల కేవలం బయట పూసే.. నూనెల మీద మాత్రమే ఆధారపడి ఉండదు. మీరు తీసుకునే ఆహారంలో ఈ కింది పోషకాలు ఉండాలి.
ప్రోటీన్: జుట్టు ‘కెరాటిన్’ అనే ప్రోటీన్‌తో తయారవుతుంది. గుడ్లు, పప్పు ధాన్యాలు అధికంగా తీసుకోండి.
బయోటిన్ & ఒమేగా-3: చేపలు, వాల్‌నట్స్, బాదం పప్పులు జుట్టుకు మంచి మెరుపును ఇస్తాయి.
ఐరన్: పాలకూర వంటి ఆకుకూరలు రక్త హీనతను తగ్గించి జుట్టు రాలడాన్ని నిరోధిస్తాయి.

5. ఒత్తిడిని తగ్గించుకోవడం: అధిక ఒత్తిడి వల్ల జుట్టు ‘టెలోజెన్ ఎఫ్లువియమ్’ అనే స్థితికి చేరుకుంటుంది. దీని వల్ల జుట్టు విపరీతంగా రాలుతుంది. ప్రతి రోజూ 15 నిమిషాల యోగా లేదా ధ్యానం చేయడం వల్ల హార్మోన్ల సమతుల్యత ఏర్పడి జుట్టు రాలడం తగ్గుతుంది.

3 వారాల ప్లాన్ (The 3-Week Challenge):
వరం 1: కెమికల్ షాంపూలను పక్కన పెట్టండి. కుంకుడుకాయలు లేదా మైల్డ్ షాంపూ వాడటం ప్రారంభించండి. ప్రతి రోజూ 10 నిమిషాల ఇన్వర్షన్ మెథడ్ (తల కిందకు పెట్టి మసాజ్ చేయడం) పాటించండి.
వారం 2: వారానికి రెండు సార్లు ఉల్లిపాయ రసం లేదా మెంతుల పేస్ట్ వాడండి. తగినంత నీరు (కనీసం 3-4 లీటర్లు) తాగండి.
వారం 3: ఈ సమయానికి జుట్టు రాలడం 80% తగ్గుతుంది. చిన్న చిన్న వెంట్రుకలు మొలవడం మీరు గమనించవచ్చు. ఇదే క్రమాన్ని కొనసాగించండి.

Related News

ఆటిజం ఉన్న పిల్లలకు ఏకాగ్రత మెరుగుపరిచే టెక్నిక్.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర ఫలితాలు

ఆన్‌లైన్‌లో యువతితో ప్రేమ.. ప్రియురాలిని కలవడానికి 1900 కిమీ ప్రయాణం.. ఏఐ దెబ్బకు మైండ్ బ్లాక్

ఘాటు ఘాటుగా మష్రూమ్ పెప్పర్ ఫ్రై.. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే టేస్ట్ అద్భుతం!

వంట రాని వాళ్లు కూడా నిమిషాల్లో చేసేయగల సూపర్ టేస్టీ పన్నీర్ భుర్జీ రెసిపీ!

థీమ్ పార్కుకు వెళుతున్నారా? జాగ్రత్త రోలర్ కోస్టర్ రైడ్స్‌తో మెదడుకు ప్రమాదం

పిల్లలు వద్దనుకోవడం స్వార్థమా? సమాజం చేసే విమర్శలకు సమాధానమిదే

భార్యా, తల్లా.. ఇద్దరి మధ్య నలిగిపోకుండా భర్త ఏం చేయాలి?

పిల్లల ఆరోగ్యంతో చెలగాటం వద్దు.. బేబీ ఫుడ్‌లో చక్కెరపై FSSAI కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×