BigTV English

Tips for Unmarried Men: ఇవన్నీ చూశాక కూడా పెళ్లి చేసుకోవాలని ఉందా? ఈ టిప్స్ తో మీ ప్రాణాలు సేఫ్!

Tips for Unmarried Men: ఇవన్నీ చూశాక కూడా పెళ్లి చేసుకోవాలని ఉందా? ఈ టిప్స్ తో మీ ప్రాణాలు సేఫ్!

మేఘాలయలోని షిల్లాంగ్ లో జరిగిన హనీమూన్ మర్డర్ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భర్త రఘువంశీని హనీమూన్ కు తీసుకెళ్లి బాయ్ ఫ్రెండ్ తో పాటు కిరాయి హంతకులతో దారుణంగా హత్య చేయించింది సోనమ్ అనే యువతి. ఇష్టం లేని పెళ్లి చేశారనే కోపంతో కట్టుకున్న వాడినే కిరాతకంగా అంతమొందించింది. అంతకు ముందు ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ కు చెందిన మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్ పుత్ ను ప్రేమించి పెళ్లిడిన భార్య ముస్కాన్ ప్రియుడి సాయంతో దారుణంగా హత్య చేసింది. ముక్కలు ముక్కలుగా నరికి డ్రమ్ములోవేసి కాంక్రీట్ తో సీలు చేసింది. వీళ్లేకాదు, ఇలా చెప్పుకుంటూ పోతే భర్తలు భార్యల చేతిలో దారుణ హత్యలకు గురైన ఘటనలకు సంబంధించి లిస్టు చాంతాడంత ఉంది. ఈ నేపథ్యంలో యువకులు పెళ్లికి ముందు కొన్ని జాగ్రతలు తీసుకోవడం వల్ల జీవితాన్ని హ్యాపీగా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇంతకీ అవేంటంటే..


⦿ చేసుకోబోయే అమ్మాయి గురించి పూర్తిగా తెలుసుకోండి!  

పెళ్లి చేసుకునే ముందే భార్య భర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. పెళ్లికి ముందే ఆర్థిక విషయాలు, కుటుంబ, కెరీర్ ప్లానింగ్స్ గురించి తెలుసుకోండి. పెళ్లికి ముందే జీవిత భాగస్వామి గురించి తెలుసుకునేందుకు వారి కుటుంబ, స్నేహితులను కలవాలి. అన్ని విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. పెళ్లి విషయంలో తొందరపాటు ఉండకూడదు. తొందరపాటు కారణంగానే చాలా సమస్యలు తలెత్తుతున్నాయి. కాబట్టి, ముందుగానే అన్ని విషయాల గురించి వివరంగా తెలుసుకోవడం మంచిది. అలా తెలుసుకోవడం వల్ల మున్ముందు ఎలాంటి సమస్యలు ఉండవు.


⦿ ఒకరి గురించి మరొకరు మాట్లాడుకోండి!

పెళ్లికి ముందు ఒకరినొకరు కలవండి. చక్కగా మాట్లాడుకోండి. ఒకవేళ పెళ్లి తర్వాత ఏవైనా సమస్యలు వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అంచనాకు రండి. కొన్ని విషయాల్లో ప్రైవసీకి కట్టుబడి ఉన్నా, అనుమానాలకు తావిచ్చేలా ఉండకుండా చూసుకోండి. మనసులో కల్మషం లేకుండా మాట్లాడే మాటలు, పరస్పర గౌరవానికి ఇబ్బంది లేకుండా ఉండే వ్యహరించే తీరు పెళ్లి తర్వాత ఇబ్బందులు రాకుండా చేస్తాయి.

⦿ కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి!  

నమ్మకం ఒక్కటే కాదు, ఒత్తిడి, విభేదాలను మీ జీవిత భాగస్వామి ఎలా హ్యాండిల్ చేస్తారో గమనించండి.  ఒక వేళ ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే ఎలా ముందుకు సాగాలో తెలుసుకోండి. ఒకవేళ సాధ్యం కాకపోతే స్నేహితులు లేదంటే సన్నిహితుల సలహాలు తీసుకోండి. జీవిత భాగస్వామికి సంబంధించిన నెగెటివ్ విషయాలు ముందుగానే తెలియడం వల్ల వివాహానికి ముందే పరిష్కరించుకోవడం మంచిది.

⦿ మంచి నెట్ వర్క్ ను మెయింటెయిన్ చేయండి!

మీరు మీ జీవిత భాగస్వామితో పాటు వారి స్నేహితులు, కుటుంబం, మార్గదర్శకులతో మాట్లాడటం మంచిది. వారి ద్వారా మంచి చెడులు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎదైనా అనుకోని సమస్య ఎదురైతే వారి ద్వారా ఆ సమస్యకు పరిష్కారం కనుగొనే అవకాశం ఉంటుంది. వారితో మంచి సంబంధాలు మెయింటెయిన్ చేయడం వల్ల మోరల్ సపోర్టు ఉంటుంది.

⦿ ఆర్థిక, వ్యక్తిగత భద్రతను కాపాడుకోండి!

చాలా వరకు ఆర్థిక వివాదాలు వివాహబంధాన్ని దెబ్బతీస్తాయి. అందుకే పెళ్లికి ముందే బడ్జెట్, పొదుపు, ఖర్చు గురించి అంచనాకు రండి. ఒకవేళ విడిపోయిన సందర్భంలో ఆస్తి విభజన గురించి స్పష్టం చేయడానికి న్యాయవాదిని సంప్రదించండి.  సంబంధం ప్రారంభంలోనే పాస్‌ వర్డ్‌ లు, పిన్‌ లను పంచుకోవడంలో జాగ్రత్తగా ఉండండి. ఇలా చేయడం వల్ల కొన్నిసార్లు ఆర్థిక వివాదాలకు కారణం అయ్యే అవకాశం ఉంటుంది.

⦿ అనుమానం విషయంలో అప్రమత్తంగా ఉండండి!

వివాహ బంధం దెబ్బ తినడానికి మరో కారణం  అనుమానం. కచ్చితంగా నిజం అనుకున్నప్పడే మీ జీవిత భాగస్వామిని అనుమానించండి. ముందుజాగ్రత్తగా, మీ ప్రయాణ ప్రణాళికలను ముఖ్యంగా  హనీమూన్‌ లాంటి విషయాలను స్నేహితులు,  కుటుంబ సభ్యులతో పంచుకోవడం మంచిది.

⦿ సహాయం ఎలా పొందాలో తెలుసుకోండి!

ఒకవేళ మీ జీవిత భాగస్వామి నుంచి గృహహింస ఎదురైనట్లే అత్యవసర సర్వీసులకు కాల్ చేసి, చెప్పండి. మీరు బెదిరింపులకు గురవుతున్నట్లు భావిస్తే సంఘటనలను ఫోన్ లో రికార్డు చేయండి. విశ్వసనీయ వ్యక్తులకు దానిని పంపించండి. పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటే పోలీసులను సంప్రదించండి.

⦿ మీ నిర్ణయాలను గౌరవించుకోండి!  

సమాజంలో జరుగుతున్న సంఘటనలు మీలో భయాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. కానీ, అలాంటి ఘటనలు నూటికి ఒకటో రెండో ఉంటాయి. మీరు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలంటే, ప్రేమ, గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోండి. వివాహం అనేది నమ్మకం, గౌరవం మీద ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి!

Read Also: ఈ లక్షణాలు ఉన్న వ్యక్తి జీవితంలో ఏదో ఒక సమయంలో కచ్చితంగా కోటీశ్వరుడు అవుతాడు

Related News

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Big Stories

×