BigTV English

MAD Square: లడ్డుగాడి పెళ్లికి.. స్టార్ మా ఆహ్వానం.. శుభలేఖలో వడ్డే నవీన్ ఎందుకు భయ్యా?

MAD Square: లడ్డుగాడి పెళ్లికి.. స్టార్ మా ఆహ్వానం.. శుభలేఖలో వడ్డే నవీన్ ఎందుకు భయ్యా?

MAD Square: టాలీవుడ్ యంగ్ హీరోలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న నార్నె నితిన్‌, సంగీత్‌ శోభన్‌, రామ్ నితిన్ వంటి వారు ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం “మ్యాడ్”(MAD). ఈ సినిమా 2003 వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైనటువంటి అన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మ్యాడ్ స్క్వేర్(MAD Square). సూర్యదేవర నాగ వంశీ నిర్మాణంలో, కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నార్నె నితిన్‌, సంగీత్‌ శోభన్‌, రామ్ నితిన్, ప్రియాంక జువాల్కర్ వంటి వారు ప్రధాన పాత్రలలో నటించి సందడి చేశారు. ఇక ఈ సినిమా ఈ ఏడాది మార్చ్ 29వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.


టెలివిజన్ ప్రీమియర్…

ఇలా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంది. అద్భుతమైన కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఇలా థియేటర్లోనూ మంచి సక్సెస్ అందుకున్న ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమయ్యి అక్కడ కూడా మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇకపోతే త్వరలోనే ఈ చిత్రం టెలివిజన్ ప్రీమియర్ కాబోతోంది. ఈ సినిమా స్టార్ మాలో ప్రసారం కాబోతుందని తెలుస్తుంది. తాజాగా స్టార్ మా ఈ సినిమా ప్రీమియర్ గురించి అధికారకంగా తెలియజేసింది.


లడ్డు గాడి పెళ్లికి లొల్లి లొల్లి…

ఇక ఈ విషయాన్ని స్టార్ మా తెలియచేస్తూ “లడ్డు గాడి పెళ్లికి లొల్లి లొల్లి చేయటానికి రెడీగా ఉండండి అంటూ లడ్డు గాడి పెండ్లి పిలుపు అంటూ ఒక ఆహ్వాన పత్రిక రూపంలో ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ గురించి అన్ని విషయాలను వెల్లడించారు. ఇందులో భాగంగా గణేష్ వెడ్స్ పూజ పెళ్లికి రావాలని పెళ్లి సమయం అంటూ సినిమా ప్రీమియర్ తేదీ సమయాన్ని తెలియజేశారు జూన్ 15వ తేదీ ఆదివారం సాయంత్రం 6:30 ని.లకు , వేదిక మీ స్వగృహం నందు అంటూ ఈ సినిమా ప్రసార సమయాన్ని తెలియజేశారు. ఈ సినిమాని మీరు కుటుంబ సమేతంగా చూసి, కడుపుబ్బా నవ్వుకొని, కట్నాలను కామెంట్స్ లో చదివించాలని కోరుకుంటున్నాము. ఆహ్వానించువారు మాడ్ స్క్వేర్ టీమ్ అంటూ చాలా భిన్నంగా ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ గురించి తెలియజేశారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ ఫోటో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.

ఇక ఈ కార్డులో వడ్డే నవీన్(Vadde Naveen) ఫోటో కూడా ఉండటంతో మధ్యలో వడ్డే నవీన్ ఎందుకు వచ్చాడు భయ్యా? అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఫస్ట్ పార్ట్ లో మాత్రం లడ్డు ఫేవరెట్ హీరో వడ్డే నవీన్ అని చెబుతాడు అలాగే తన వాట్సాప్ డీపీ కూడా వడ్డే నవీన్ ఫోటో పెట్టుకొని ఉన్న నేపథ్యంలో ఇక్కడ కూడా వడ్డే నవీన్ ఫోటో వేయటం విశేషం. ఇక ఫస్ట్ పార్ట్ లో లడ్డు అమ్మాయిలు తనకు పడట్లేదని, కాంటాక్ట్ లిస్ట్ నుంచి అమ్మాయిలతో మాట్లాడమంటే కాంటాక్ట్ లిస్ట్ ఓపెన్ చేసి చూడగా అందరూ బ్లాక్ పెట్టారని చెబుతారు. నేను వాళ్లతో వల్గర్ గా మాట్లాడలేదు…”హాయ్! హలో! బ్లాక్ అని మెసేజ్ చేశాను అంటూ తన అద్భుతమైన కామెడీ డైలాగులతో ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×