E-Paper
Advertisement

Saunf Water: సోంపు వాటర్ శరీరంలో వేడిని తగ్గిస్తుందా ? ఈ విషయాలు తెలుసుకోండి

Saunf Water: సోంపు వాటర్ శరీరంలో వేడిని తగ్గిస్తుందా ? ఈ విషయాలు తెలుసుకోండి
Advertisement

Saunf Water: మారుతున్న వాతావరణం, అధిక ఉష్ణోగ్రతలు, మసాలా ఆహారాల వల్ల చాలా మంది ‘శరీర వేడి’ సమస్యతో బాధ పడుతుంటారు. దీని వల్ల కడుపులో మంట, నోటి పూత, మొటిమలు, నీరసం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ సమస్యకు వంటింట్లో.. దొరికే సోంపు గింజలు ఒక అద్భుతమైన సహజ పరిష్కారం. సోంపు గింజలలో చలువ చేసే.. గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కేవలం జీర్ణ క్రియను మెరుగు పరచడమే కాకుండా.. శరీర ఉష్ణోగ్రతను తగ్గించి మనల్ని రోజంతా తాజాగా ఉంచుతాయి. సోంపు నీటిని ఎలా తయారు చేసుకోవాలో.. దాని వల్ల కలిగే ఇతర ప్రయోజనాలేమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

శరీర వేడిని తగ్గించే సోంపు నీరు:
సోంపు గింజలు ఆయుర్వేదంలో కూడా విశిష్ట స్థానాన్ని కలిగి ఉన్నాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, కూలింగ్ ప్రాపర్టీస్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

Advertisement

సోంపు నీటిని ఎలా తయారు చేయాలి ?
సోంపు నీటిని రెండు రకాలుగా తయారు చేసుకోవచ్చు.

1. ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ సోంపు గింజలను వేసి రాత్రంతా నానబెట్టండి.

Advertisement

2. మరుసటి రోజు ఉదయం ఆ నీటిని వడకట్టి, పరగడుపున తాగండి. ఇది శరీర వేడిని తగ్గించడానికి.. అత్యంత ప్రభావవంతమైన పద్ధతి.

మరిగించిన నీరు :

ఒక గ్లాసు నీటిని మరిగించి.. అందులో ఒక టీస్పూన్ సోంపు వేయండి.

ఐదు నిమిషాల పాటు తక్కువ మంటపై.. మరిగించిన తర్వాత, చల్లారనివ్వండి.

ఈ నీరు గోరు వెచ్చగా ఉన్నప్పుడు లేదా పూర్తిగా చల్లారిన తర్వాత తాగవచ్చు.

శరీర వేడిని తగ్గించడంలో సోంపు పాత్ర:
సోంపు గింజలకు సహజంగానే ‘శీతలకరణి’ గుణాలు ఉన్నాయి. ఇవి రక్తంలోని వేడిని తగ్గించి, శరీరంలోని అంతర్గత అవయవాలకు.. ఉపశమనాన్ని ఇస్తాయి. ఎండలో తిరిగే వారు లేదా వేడి ఎక్కువగా చేసే.. ప్రకృతి ఉన్న వారు క్రమం తప్పకుండా సోంపు నీరు తాగడం వల్ల వడదెబ్బ తగలకుండా కాపాడుకోవచ్చు.

సోంపు నీటి వల్ల కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు:
జీర్ణక్రియ మెరుగు పడుతుంది: భోజనం తర్వాత సోంపు నీరు తాగడం వల్ల గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం తగ్గుతాయి. ఇది జీర్ణ వ్యవస్థలోని కండరాలను సడలించి, ఆహారం సులువుగా అరిగేలా చేస్తుంది.

బరువు తగ్గడానికి సహాయ పడుతుంది: సోంపు నీరు మెటబాలిజంను వేగవంతం చేస్తుంది. ఇది ఆకలిని నియంత్రించి, శరీరంలోని అనవసరపు కొవ్వును కరిగించడంలో సహాయ పడుతుంది.

రక్త శుద్ధి: సోంపులో ఉండే నూనెలు, ఫైబర్ రక్తంలోని విషతుల్యాలను బయటకు పంపి, రక్తాన్ని శుద్ధి చేస్తాయి.

చర్మ సౌందర్యం: శరీర వేడి వల్ల వచ్చే మొటిమలు, మచ్చలను తగ్గించడంలో.. సోంపు నీరు కీలక పాత్ర పోషిస్తుంది. ఇది చర్మానికి సహజమైన మెరుపును ఇస్తుంది.

నోటి దుర్వాసన నివారణ: సోంపులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నోటిలోని బ్యాక్టీరియాను చంపి, చెడు వాసనను పోగొడతాయి.

గమనించాల్సిన విషయాలు:
సోంపు నీరు ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ.. అతిగా తీసుకోకూడదు. రోజుకు 1 నుంచి 2 గ్లాసులు సరిపోతుంది.

గర్భిణీలు లేదా ప్రత్యేక అనారోగ్య సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకున్న తర్వాతే.. దీనిని క్రమం తప్పకుండా వాడాలి.

రుచి కోసం ఇందులో పంచదారకు బదులుగా మిశ్రి (పటిక బెల్లం) కలుపుకుంటే.. చలువ చేసే గుణం ఇంకా పెరుగుతుంది.

Related News

వయసు మీరుతున్నా ప్రేమలో మాత్రం ఫ్రెష్‌ ఫీలింగ్.. ఈ తేదీల్లో పుట్టినవారు గ్యారంటీ లవర్స్

రోజూ పకోడీలు తిని బోర్ కొడుతోందా? పచ్చి బొప్పాయితో క్రిస్పీ కట్లెట్స్ ట్రై చేయండి

కృష్ణాష్టమికి మీ పాపను రాధమ్మగా ముస్తాబు చేయాలా? ఫొటోషూట్ అందంగా చేయడానికి టిప్స్

మహిళల్లో ఎముకల బలహీనత సమస్య.. మెనోపాజ్‌కు ముందే బలమైన ఎముకల కోసం ఏం చేయాలి?

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

Big Stories

Advertisement
×