Side Effects of Eating Rusk with Tea: చాయ్ అనేది ఒక ఎమోషన్. ఉదయం లేచింది మొదలు సాయంత్రం వరకు కప్పు టీ పడకపోతే చాలా మందికి రోజూ గడవదు. అయితే.. టీ తాగేటప్పుడు ఒట్టిగా తాగకుండా బిస్కెట్లు లేదా రస్క్‌లను అందులో ముంచుకుని తినడం మనలో చాలా మందికి ఉన్న అలవాటు. రస్క్ చాలా లైట్‌గా ఉంటుందని, అది హెల్తీ స్నాక్ అని చాలా మంది భ్రమపడతారు. కానీ.. వాస్తవానికి టీలో ముంచిన రస్క్‌లను క్రమం తప్పకుండా తినడం వల్ల మీ శరీరానికి జరిగే నష్టం అంతా ఇంతా కాదు. ఈ కాంబినేషన్ వల్ల వచ్చే సమస్యలేంటో ఏంటో ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం.
టీ-రస్క్ కాంబినేషన్.. తెలియని 5 ప్రధాన నష్టాలు:
చాలా మంది రస్క్‌లను బేక్ చేసిన రోటీ లాంటివని అనుకుంటారు. కానీ మార్కెట్లో దొరికే రస్క్‌ల వెనక ఒక పెద్ద ‘అన్‌హెల్తీ’ ప్రాసెస్ దాగి ఉంది.
1. మైదా, గ్లూటెన్ ముప్పు:
రస్క్‌లను తయారు చేయడానికి గోధుమ పిండిని వాడతామని కొన్ని బ్రాండ్లు చెప్తున్నప్పటికీ.. అత్యధిక శాతం రస్క్‌లలో వాడేది రిఫైన్డ్ ఫ్లోర్ అంటే మైదా.
ఏమవుతుంది?: మైదాలో పీచుపదార్థం అస్సలు ఉండదు. దీనివల్ల ఇది ప్రేగులకు అంటుకుపోయి మలబద్ధకం సమస్యను పెంచుతుంది. జీర్ణవ్యవస్థను పూర్తిగా స్లో చేస్తుంది.
2. విపరీతమైన చక్కెర, క్యాలరీలు :
రస్క్ తినడానికి కొద్దిగా స్వీట్‌గా, టేస్టీగా ఉండటానికి అందులో భారీ మొత్తంలో చక్కెరను కలుపుతారు.
ఏమవుతుంది?: మీరు ఇప్పటికే చక్కెర ఎక్కువగా ఉన్న టీ తాగుతూ, అందులో మళ్లీ ఈ రస్క్‌లను ముంచి తింటే మీ శరీరంలోకి ఒకేసారి క్యాలరీలు కుప్పలుగా చేరుతాయి. ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను అకస్మాత్తుగా పెంచుతుంది. ఫలితంగా డయాబెటిస్ (మధుమేహం) వచ్చే రిస్క్ విపరీతంగా పెరుగుతుంది.
3. పామాయిల్ , చెడు కొలెస్ట్రాల్ :
రస్క్‌లు ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి , కరకరలాడటానికి వాటి తయారీలో చీప్ క్వాలిటీ వంట నూనెలను (ముఖ్యంగా పామాయిల్), ట్రాన్స్ ఫ్యాట్స్‌ను వాడతారు.
ఏమవుతుంది?: ఇవి శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను పెంచుతాయి. ఇది గుండె ధమనులలో కొవ్వు పేరుకుపోయేలా చేసి, భవిష్యత్తులో హార్ట్ ఎటాక్, అధిక రక్తపోటు వంటి తీవ్రమైన గుండె జబ్బులకు దారితీస్తుంది.
4. కడుపులో గ్యాస్, అసిడిటీ :
చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో టీ, రస్క్ తింటారు. ఇది మీ కడుపులో యాసిడ్స్ ఇంబ్యాలెన్స్‌కు కారణమవుతుంది.
ఏమవుతుంది?: టీలోని కెఫిన్ మరియు రస్క్‌లోని మైదా, ఈస్ట్ కలిసి కడుపులో పులిసిపోతాయి. దీనివల్ల ఉదయాన్నే విపరీతమైన గ్యాస్, కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట వంటి అజీర్తి సమస్యలు తలెత్తుతాయి.
5. పాత బ్రెడ్‌తోనే రస్క్‌ల తయారీ!
చాలా కంపెనీలలో మిగిలిపోయిన, ఎక్స్‌పైరీ డేట్‌కు దగ్గరగా ఉన్న పాత బ్రెడ్‌లను సేకరించి, వాటిని మళ్లీ రీ-బేక్ (రెండోసారి బేక్) చేసి రస్క్‌లుగా మారుస్తారు. ఇలా చేయడం వల్ల అందులో ఉండే కొద్దిపాటి పోషకాలు కూడా పూర్తిగా నశించిపోతాయి. ఇది కేవలం మన పొట్టను నింపుతుందే తప్ప శరీరానికి ఎలాంటి పోషకాలను ఇవ్వదు.
రస్క్‌లకు బదులుగా టీతో ఏం తినొచ్చు?
చాయ్‌తో ఏదో ఒకటి నమలడం అలవాటైన వారు రస్క్‌లకు బదులుగా ఈ క్రింది హెల్తీ ఆప్షన్స్ ట్రై చేయవచ్చు.
వేయించిన శనగలు లేదా మఖానా : వీటిలో ఫైబర్, ప్రొటీన్ ఎక్కువగా ఉంటాయి. టీతో తింటే చాలా హెల్తీ.
ఓట్స్ లేదా రాగి బిస్కెట్లు: మైదా లేని హోమ్‌మేడ్ రాగి లేదా ఓట్స్ కుకీస్ బెస్ట్ ఛాయిస్.
నట్స్: బాదం, జీడిపప్పు లేదా వాల్‌నట్స్‌ను చాయ్‌తో పాటు ఒకటి లేదా రెండు తీసుకోవచ్చు.