E-Paper
Advertisement

పుచ్చకాయ అతిగా తింటున్నారా? ఈ 5 ప్రమాదాలు పొంచి ఉన్నాయి జాగ్రత్త!

పుచ్చకాయ అతిగా తింటున్నారా? ఈ 5 ప్రమాదాలు పొంచి ఉన్నాయి జాగ్రత్త!
Advertisement

Watermelon Side effects: వేసవి కాలం వచ్చిందంటే చాలు అందరికీ గుర్తొచ్చే మొదటి పండు పుచ్చకాయ. శరీరానికి చల్లదనాన్ని ఇవ్వడమే కాకుండా.. దాహాన్ని తీర్చి హైడ్రేటెడ్‌గా ఉంచడంలో ఇది అద్భుతంగా పని చేస్తుంది. పుచ్చకాయలో విటమిన్లు, మినరల్స్ , యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అయితే.. ఆరోగ్యానికి మేలు చేస్తుంది కదా అని అతిగా తింటే మాత్రం లేనిపోని చిక్కులు తప్పవు. “అతి సర్వత్ర వర్జయేత్” అన్నట్లుగా.. పుచ్చకాయను పరిమితికి మించి తీసుకోవడం వల్ల కలిగే 5 ప్రధాన సైడ్ ఎఫెక్ట్స్, ఆరోగ్య సమస్యల గురించి వివరంగా తెలుసుకుందాం.

పుచ్చకాయలో దాదాపు 92% నీరు ఉంటుంది. అయినప్పటికీ.. దీనిలోని కొన్ని సహజ గుణాలు అతిగా తిన్నప్పుడు ప్రతికూల ప్రభావాలను చూపిస్తాయి. అవేంటంటే..

Advertisement

1. జీర్ణ సమస్యలు:
పుచ్చకాయలో ‘లైకోపీన్’అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది గుండెకు మేలు చేసినప్పటికీ.. అధిక మొత్తంలో శరీరంలోకి చేరితే జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీని వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, విరేచనాలు, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తుతాయి.ముఖ్యంగా రాత్రి పూట పుచ్చకాయ తింటే జీర్ణం కావడం కష్టమవుతుంది.

2.రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం:
పుచ్చకాయలో సహజ చక్కెరలు ఉంటాయి. అంతే కాకుండా దీని గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) సుమారు 72 ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండటం వల్ల, ఇది రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను వేగంగా పెంచుతుంది.డయాబెటీస్ ఉన్నవారు పుచ్చకాయను అతిగా తింటే షుగర్ లెవల్స్ అదుపు తప్పే ప్రమాదం ఉంది. కాబట్టి డయాబెటిస్ బాధితులు పరిమితంగానే తీసుకోవాలి.

Advertisement

3. ఓవర్ హైడ్రేషన్ లేదా వాటర్ ఇన్టాక్సికేషన్ :
వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. అతిగా నీరు తీసుకోవడం వల్ల కూడా సమస్యలు వస్తాయి. పుచ్చకాయలో నీటి శాతం చాలా ఎక్కువ. దీన్ని అతిగా తిన్నప్పుడు శరీరంలో నీటి నిల్వలు పెరిగి సోడియం స్థాయిలు పడిపోతాయి. దీనిని ‘వాటర్ ఇన్టాక్సికేషన్’ అంటారు. దీని వల్ల కాళ్ల వాపులు, అలసట , కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది.

4. కాలేయ వాపు సమస్యలు :
క్రమం తప్పకుండా మద్యం సేవించే వారు పుచ్చకాయను అతిగా తినకూడదు. పుచ్చకాయలోని లైకోపీన్ , ఆల్కహాల్ కలిస్తే కాలేయానికి హాని కలిగించే అవకాశం ఉందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది కాలేయ వాపు లేదా ఆక్సిడేటివ్ స్ట్రెస్ కి దారి తీయవచ్చు.

5.గుండె సంబంధిత సమస్యలు :
పుచ్చకాయలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది సాధారణంగా గుండెకు మంచిదే. కానీ అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో పొటాషియం స్థాయిలు విపరీతంగా పెరిగి ‘హైపర్‌కలేమియా’అనే పరిస్థితి ఏర్పడవచ్చు. దీని వల్ల గుండె లయ తప్పడం , పల్స్ రేట్ తగ్గడం, కండరాల బలహీనత వంటి ఇబ్బందులు కలుగుతాయి.

జాగ్రత్తలు, సూచనలు:
పరిమితి: ఒక రోజుకు 200 నుంచి 300 గ్రాముల పుచ్చకాయ ముక్కలు తినడం సురక్షితం.

సమయం: రాత్రి పడుకునే ముందు పుచ్చకాయ తినడం మానుకోండి. ఇది జీర్ణ క్రియను నెమ్మది చేయడమే కాకుండా.. పదే పదే యూరిన్‌కి వెళ్లాల్సి రావడం వల్ల నిద్రకు భంగం కలిగిస్తుంది.

కలర్: మరీ విపరీతమైన ఎరుపు రంగులో ఉన్న పండ్లను ఎంచుకోకండి. అవి ఇంజక్షన్ల వల్ల రంగు మారి ఉండొచ్చు.

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×