E-Paper
Advertisement

2 నిమిషాల ఆహారం.. జీవితకాలపు అనారోగ్యం, నూడుల్స్‌లోని చేదు నిజాలు

2 నిమిషాల ఆహారం.. జీవితకాలపు అనారోగ్యం, నూడుల్స్‌లోని చేదు నిజాలు
Advertisement

Instant Noodles health risks: ‘2 నిమిషాల్లో’ తయారయ్యే ఇన్‌స్టంట్ నూడుల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బ్యాచిలర్స్ నుంచి చిన్నపిల్లల వరకు అందరూ వీటిని ఇష్టంగా తింటారు. అయితే.. రుచిగా ఉండే ఈ ఆహారం వెనక దాగి ఉన్న ఆరోగ్య ముప్పులు సామాన్యులకు తెలియవు. ఇన్‌స్టంట్ నూడుల్స్‌లో పోషకాలు తక్కువగా ఉండటమే కాకుండా.. ప్రాసెస్ చేసిన మైదా, ప్రిజర్వేటివ్స్ , అధిక సోడియం ఉంటాయి. ఇవి దీర్ఘకాలంలో గుండె జబ్బులు, మధుమేహం, జీర్ణ సంబంధిత సమస్యలకు దారితీస్తాయి. ఇన్‌స్టంట్ నూడుల్స్ క్రమం తప్పకుండా తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.

ఇన్‌స్టంట్ నూడుల్స్ – ఆరోగ్య సమస్యలు:
1. పోషకాల లోపం:
ఇన్‌స్టంట్ నూడుల్స్‌ను అధికంగా ప్రాసెస్ చేస్తారు. తయారీ ప్రక్రియలో వీటిలోని విటమిన్లు, ప్రోటీన్లు , పీచు పదార్థాలు పూర్తిగా నశిస్తాయి. వీటిని తినడం వల్ల కడుపు నిండినట్లు అనిపిస్తుంది కానీ.. శరీరానికి అందాల్సిన అవసరమైన పోషకాలు అందవు. దీని వల్ల రక్తహీనత, నీరసం వంటి సమస్యలు తలెత్తుతాయి.

Advertisement

2. మెటాబోలిక్ సిండ్రోమ్ ముప్పు:
వారానికి రెండు లేదా మూడు సార్లు ఇన్‌స్టంట్ నూడుల్స్ తినే మహిళల్లో ‘మెటాబోలిక్ సిండ్రోమ్’ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది అధిక రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడానికి కారణమవుతుంది. ఇది భవిష్యత్తులో గుండె పోటుకు దారి తీస్తుంది.

3. ప్రమాదకరమైన ప్రిజర్వేటివ్స్:
నూడుల్స్ ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి వాటిలో ‘టెర్షియరీ బ్యూటైల్ హైడ్రోక్వినోన్’అనే పెట్రోలియం ఆధారిత ప్రిజర్వేటివ్‌ను ఉపయోగిస్తారు. ఇది జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. ఇది మన కణాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అంతే కాకుండా లివర్ పని తీరును మందగించేలా చేస్తుంది.

Advertisement

4. MSG, సోడియం అధికం:
చాలా రకాల నూడుల్స్ , వాటి మసాలాలలో ‘మోనోసోడియం గ్లుటామేట్’ ఉంటుంది. దీనిని రుచి కోసం ఉపయోగిస్తారు. ఇది మెదడు కణాలపై ప్రభావం చూపుతుంది. అంతే కాకుండా అలర్జీలు, తలనొప్పి, ఛాతిలో మంట వంటి సమస్యలకు కారణమవుతుంది. అలాగే.. ఇందులోని అధిక సోడియం (ఉప్పు) వల్ల కిడ్నీ సమస్యలు, రక్తపోటు పెరుగుతాయి.

Also Read: పరిశుభ్రత పేరుతో చర్మాన్ని పాడుచేసుకోకండి! రోజుకు 2 సార్లు స్నానం చేయడం వల్ల కలిగే అనర్థాలు

5. మైదా, జీర్ణక్రియ సమస్యలు:
ఇన్‌స్టంట్ నూడుల్స్ ప్రధానంగా మైదాతో తయారవుతాయి. మైదా పేగులకు అతుక్కుపోతుంది. దీని వల్ల మలబద్ధకం, ఇతర జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి. పైగా నూడుల్స్‌ను డీప్ ఫ్రై చేయడం వల్ల వాటిలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.

6. బరువు పెరగడం:
నూడుల్స్‌లో కార్బోహైడ్రేట్లు , కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఫైబర్ లేకపోవడం వల్ల ఆకలి త్వరగా వేస్తుంది. దీని వల్ల మనం ఇతర ఆహారాలను కూడా ఎక్కువగా తీసుకుంటాం. ఇది స్థూలకాయానికి ప్రధాన కారణం అవుతుంది.

అప్పుడప్పుడు రుచి కోసం నూడుల్స్ తినడం పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ దీనిని అలవాటుగా మార్చుకోవడం డేంజర్. వీటికి బదులుగా గోధుమలతో చేసిన నూడుల్స్ లేదా చిరు ధాన్యాలతో తయారైన సేమియా వంటి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోండి. నూడుల్స్ వండేటప్పుడు అందులో కొన్ని రకాల కూరగాయలు కలపడం వల్ల కొంతైనా పోషకాలు అందేలా చూసుకోవచ్చు.

Related News

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్ని ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

Big Stories

Advertisement
×