E-Paper
Advertisement

Organ Stress: శరీరం ఇచ్చే సైలెంట్ వార్నింగ్స్.. వీటిని నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదం

Organ Stress: శరీరం ఇచ్చే సైలెంట్ వార్నింగ్స్.. వీటిని నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదం
Advertisement

ఆధునిక జీవితంలో చాలామంది ఆరోగ్యాన్ని పెద్దగా పట్టించుకోరు. ఎలాంటి తీవ్రమైన నొప్పి లేదా సమస్య వచ్చినప్పుడే డాక్టర్‌ను సంప్రదిస్తారు. కానీ వైద్య నిపుణులు చెబుతున్న ప్రకారం మన శరీరం పెద్ద వ్యాధులు రాకముందే చిన్న చిన్న సంకేతాల ద్వారా హెచ్చరికలు ఇస్తుంది. ఈ సంకేతాలను చాలా మంది నిర్లక్ష్యం చేయడం వల్లనే తర్వాత పెద్ద సమస్యలు వస్తున్నాయి. శరీరంలో అవయవాలు సరిగ్గా పని చేయకపోతే అది ఒక్కసారిగా పెద్ద లక్షణాల రూపంలో కనిపించదు. మొదట్లో చాలా సున్నితమైన మార్పులుగా బయటపడుతుంది. ఉదాహరణకు నిద్ర బాగా పట్టినా అలసటగా అనిపిస్తుంది. కానీ ఇది గుండె, కాలేయం లేదా ఇతర అవయవాలపై ఒత్తిడి పెరుగుతోందని సూచన కావచ్చు.

ఈ లక్షణాలు
అలాగే చర్మం ఎండిపోవడం, జుట్టు బలహీనంగా మారడం, గోళ్ళ రంగు మారడం వంటి లక్షణాలు కూడా లోపల జరుగుతున్న సమస్యలకు సంకేతాలే. జీర్ణ సంబంధిత సమస్యలు కూడా ముఖ్యమైన సూచనలు ఇస్తాయి. ఆకలి తగ్గడం లేదా పెరగడం, తిన్నది సరిగా జీర్ణం కాకపోవడం, తరచూ గ్యాస్ లేదా బ్లోటింగ్ సమస్యలు రావడం వంటి విషయాలను చాలామంది చిన్నగా తీసుకుంటారు. కానీ ఇవి గట్ హెల్త్ లేదా కాలేయ పనితీరులో మార్పులను సూచించవచ్చు. అలాగే మూత్రంలో మార్పులు కిడ్నీ ఆరోగ్యం గురించి ముఖ్యమైన సంకేతాలను ఇస్తాయి.

Advertisement

Also read: Nose Bleeding: వేసవిలో ముక్కు నుంచి రక్తం కారడం ప్రమాదకరమా? అసలెందుకిలా జరుగుతుంది?

మెదడులో వచ్చే మార్పులు
శరీరంలో చిన్న చిన్న నొప్పులు, ఎప్పుడూ బరువుగా అనిపించడం, ఏకాగ్రత తగ్గడం, మతిమరుపు వంటి సమస్యలు కనిపించవచ్చు. వీటిని చాలామంది అలసట లేదా స్ట్రెస్‌గా భావిస్తారు. కానీ ఇవి మెదడు పనితీరులో మార్పులు లేదా శరీరంపై పెరిగిన ఒత్తిడి కారణంగా రావచ్చు. కొన్ని సందర్భాల్లో ఎటువంటి కారణం లేకుండా కండరాలు తగ్గిపోవడం కూడా కాలేయ సమస్యల ప్రారంభ సంకేతంగా భావిస్తారు.

Advertisement

Also read: Goa Tour: గోవాలో కొత్త రూల్స్… అనుమతి లేకుండా ఆ పనిచేస్తే ఒకరోజు జైలు శిక్ష

వైద్యులు చెబుతున్న ప్రకారం, ఈ చిన్న లక్షణాలను నిర్లక్ష్యం చేయడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఇవి గుండె, కిడ్నీ, కాలేయం వంటి ముఖ్య అవయవాలు క్రమంగా దెబ్బతింటున్నాయని సూచిస్తాయి. మొదట్లో గుర్తిస్తే చికిత్స సులభంగా ఉంటుంది. కానీ ఆలస్యమైతే సమస్యలు తీవ్రమవుతాయి. చికిత్స కూడా కష్టంగా మారుతుంది. అయితే ఈ సమస్యలను నివారించడం చాలా కష్టం కాదు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా ఈ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. సమతుల ఆహారం తీసుకోవడం, ప్రతిరోజూ కొంతసేపు వ్యాయామం చేయడం, సరిపడ నిద్రపోవడం చాలా ముఖ్యమైనవి. రోజుకు తగినంత నీరు తాగడం కూడా శరీరానికి చాలా ఉపయోగకరం. అంతేకాకుండా, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం యోగా, ధ్యానం వంటి పద్ధతులను పాటించడం మంచిది.

చిన్న చిన్న లక్షణాలు కనిపించినప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించడం అవసరం. రెగ్యులర్ హెల్త్ చెకప్ చేయించుకోవడం ద్వారా కూడా ముందుగానే సమస్యలను గుర్తించవచ్చు. దీంతో పెద్ద వ్యాధులు రాకుండా నివారించుకోవచ్చు.

Related News

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

Big Stories

Advertisement
×