E-Paper
Advertisement

ఏపీ ప్రైవేట్ ట్రావెల్స్‌ కు బిగ్ రిలీఫ్.. సీటు ట్యాక్స్ భారీగా తగ్గింపు!

ఏపీ ప్రైవేట్ ట్రావెల్స్‌ కు బిగ్ రిలీఫ్..  సీటు ట్యాక్స్ భారీగా తగ్గింపు!
Advertisement

Big Relief for AP Private Travel Buses: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యజమానులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తాజానిర్ణయంతో బస్సుల యజమానులు మాత్రమే కాకుండా, సాధారణ ప్రయాణికులకు కూడా లాభం కలగనుంది. ఈ మేరకు ఏపీ రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక వివరాలను వెల్లడించారు. సీట్ ట్యాక్స్ ను భారీగా తగ్గిస్తున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం రాష్ట్రంలో బస్సు రవాణాపై మంచి ప్రభావం చూపే అవకాశముంది.

భారీగా తగ్గిన సీట్ ట్యాక్స్!

ఇప్పటి వరకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై విధించే సీటు పన్ను చాలా ఎక్కువగా ఉండేది. ఒక సీటుకు సుమారు రూ. 4,000 వరకు ట్యాక్స్ వసూలు చేయడం వల్ల యజమానులకు ఆర్థిక భారం ఎక్కువగా ఉండేది. అయితే, ఇప్పుడు ప్రభుత్వం ఆ ట్యాక్స్‌ ను రూ. 2,500కు తగ్గిస్తూ నిర్నం తీసుకుంది. అంటే, ప్రతి సీటుపై సుమారు రూ. 1,500 వరకు యజమానులు ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. పెద్ద సంఖ్యలో బస్సులు నడిపే సంస్థలకు ఈ నిర్ణయం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

టికెట్ ధరలు తగ్గే అవకాశం

Advertisement

ప్రభుత్వం తీసుకున్న ట్యాక్స్ తగ్గింపు నిర్ణయంతో బస్సు యజమానుల ఖర్చులు తగ్గడం వల్ల, దాని ప్రభావం ప్రయాణికులపై పడే అవకాశం ఉంది. ముఖ్యంగా టికెట్ ధరలు కొంత వరకు తగ్గవచ్చు. అంతే కాకుండా, ప్రయాణికులకు మరిన్ని బస్సులు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. దీంతో ప్రయాణ సమయంలో ఎదురయ్యే ఇబ్బందులు  తగ్గుతాయి.

2 నెలల్లో ఏపీ 700కు పైగా బస్సులు

అటు ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న బస్సులను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోకి తీసుకుని వచ్చి మళ్లీ రిజిస్టర్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. గతంలో ఈ ప్రక్రియ కొంత కష్టంగా ఉండేది. కానీ, ఇప్పుడు ఈ సౌకర్యం అందుబాటులోకి రావడంతో చాలా మంది యజమానులు తమ బస్సులను ఏపీకి మార్చుకునే అవకాశం ఉంది. వచ్చే రెండు నెలల్లోనే 700కు పైగా బస్సులు రాష్ట్రంలోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. బస్సుల సంఖ్య పెరగడం వల్ల ప్రయాణికులకు మరింత సౌలభ్యం కలుగుతుంది. ప్రత్యేకంగా పండుగల సమయంలో, సెలవులలో ఉండే రద్దీని తగ్గించడంలో సాయపడుతాయి. అంతేకాదు, పోటీ పెరగడం వల్ల సర్వీసు క్వాలిటీ కూడా మెరుగుపడే అవకాశం ఉంది.

భద్రత విషయంలో నో కాంప్రమైజ్

Advertisement

అటు భద్రత విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడటం లేదు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు కేవలం ప్రయాణికుల రవాణా కోసం మాత్రమే ఉపయోగించాలని సూచించింది. సరుకు రవాణాకు అనుమతి ఉండదు. ఈ నిబంధనను కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీని వల్ల ప్రయాణికుల భద్రతకు మరింత ప్రాధాన్యం ఇవ్వబడుతుంది.

Read Also: వందే భారత్ రైలు ఎక్కుతున్నారా? దోమల బ్యాట్ తీసుకెళ్లండి!

Related News

భారత్ నుంచి లండన్‌కు బస్సు సర్వీస్.. అమ్మో.. అన్ని రోజుల ప్రయాణమా?

ఒక్క టికెట్ చాలు.. 56 రోజుల పాటు రైల్లో దేశమంతా చుట్టేయొచ్చు!

భారత్‌లో మరో అద్భుతం.. సముద్ర గర్భంలో బుల్లెట్ ట్రైన్.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న ఇండియా!

పాకిస్తాన్ లో జగన్నాథుడి రథయాత్ర.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి!

వర్షాకాలంలో మాత్రమే పరుగులు తీసే హెరిటేజ్ రైలు.. ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం!

ఫ్యామిలీతో థీమ్ పార్క్ వెళ్లే మజానే వేరు.. ప్రపంచంలోని 8 బెస్ట్ థీమ్ పార్క్స్ ఇవే

‘మిర్చి’ సాంగ్ లోని ఈ ప్లేస్ గుర్తుందా? అది ఇప్పుడు ఘోస్ట్ టౌన్, జనాలంతా ఏమయ్యారు?

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

Big Stories

Advertisement
×