E-Paper
Advertisement

Frizzy hair: జుట్టు జిడ్డుగా చిక్కులు పడకుండా ఉండాలంటే ఈ ఇంటి చిట్కా పాటించండి చాలు

Frizzy hair: జుట్టు జిడ్డుగా చిక్కులు పడకుండా ఉండాలంటే ఈ ఇంటి చిట్కా పాటించండి చాలు
Advertisement

వేసవిలో ఎక్కువ వేడి, చెమట, దుమ్ము, కాలుష్యం కారణంగా చాలామందిలో జుట్టు ఫ్రిజ్జీగా మారుతోంది. ఎంత దువ్వినా జుట్టు ఎగిరిపోయినట్టు కనిపించడం, చిట్లిపోవడం, పొడిగా మారడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కొందరు వెంటనే పార్లర్‌కి వెళ్లి ఖరీదైన హెయిర్ ట్రీట్మెంట్స్ చేయించుకుంటున్నారు. కానీ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఇంట్లోనే జుట్టును స్మూత్‌గా మార్చుకోవచ్చని హెయిర్ కేర్ నిపుణులు చెబుతున్నారు.

జుట్టు పొడిగా మారడం వల్ల
జుట్టు ఫ్రిజ్జీగా మారడానికి ప్రధాన కారణం డ్రైనెస్. వెంట్రుకల్లో తేమ తగ్గిపోతే జుట్టు పొడిగా మారి ఉబ్బినట్టు కనిపిస్తుంది. అందుకే జుట్టుకు తేమ అందించడం చాలా ముఖ్యం. కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, ఆర్గాన్ ఆయిల్ వంటి నూనెలతో వారానికి ఒకటి లేదా రెండు సార్లు మసాజ్ చేస్తే మంచి ఫలితం కనిపించే అవకాశం ఉంటుంది. నూనె రాసిన తర్వాత గోరువెచ్చని టవల్ చుట్టుకుంటే తేమ వెంట్రుకల్లోకి బాగా చేరుతుంది.

Advertisement

అలోవెరా జెల్ పట్టిస్తే
అలొవెరా జెల్ కూడా జుట్టుకు మంచి సహజ కండిషనర్‌లా పనిచేస్తుంది. అలొవెరా జెల్‌లో కొద్దిగా కొబ్బరి నూనె కలిపి హెయిర్ మాస్క్‌లా వేసుకుంటే జుట్టు మృదువుగా మారే అవకాశం ఉంటుంది. పెరుగు, తేనె కలిపి హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల కూడా పొడిబారిన వెంట్రుకలకు ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Also read: Ancient Grains: మొటిమలు రాకూడదంటే ఈ పురాతన ధాన్యాలు తప్పక తినాలి.. చర్మం గ్లో అవుతుంది

Advertisement

చాలామంది జుట్టును ఎక్కువగా స్ట్రెయిటెనర్, బ్లో డ్రయ్యర్‌తో స్టైల్ చేస్తుంటారు. కానీ అధిక వేడి వెంట్రుకలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వెంట్రుకల పై పొర దెబ్బతిని జుట్టు మరింత పొడిగా మారుతుంది. దీంతో చిట్లిన వెంట్రుకలు పెరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే అవసరం ఉన్నప్పుడే హీట్ టూల్స్ వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. తప్పనిసరిగా వాడాల్సి వస్తే హీట్ ప్రొటెక్టెంట్ సీరమ్ వాడటం మంచిదని చెబుతున్నారు.

తడి జుట్టుతో జాగ్రత్త
జుట్టు తుడిచే విధానం కూడా చాలా ముఖ్యం. చాలామంది టవల్‌తో గట్టిగా రుద్దుతుంటారు. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు బలహీనమవుతాయి. సాధారణ టవల్ బదులుగా మైక్రోఫైబర్ టవల్ లేదా కాటన్ టీషర్ట్‌తో నెమ్మదిగా తుడవాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే చాలా వేడి నీటితో హెయిర్ వాష్ చేయకుండా గోరువెచ్చని లేదా చల్లటి నీరు వాడితే జుట్టు మెత్తగా కనిపిస్తుంది.

రాత్రి పడుకునే సమయంలో కూడా జుట్టుకు సరైన కేర్ అవసరం. కాటన్ పిల్లో కవర్ల వల్ల వెంట్రుకలపై రాపిడి ఎక్కువ అవుతుంది. దీంతో జుట్టు ఫ్రిజ్జీగా మారే అవకాశం ఉంటుంది. సాటిన్ లేదా సిల్క్ పిల్లో కవర్లు వాడితే వెంట్రుకలు తక్కువగా చిట్లుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే జుట్టును బిగిగా కట్టకుండా లూజ్ బ్రెయిడ్ వేసుకుని పడుకుంటే కూడా మంచిదని సూచిస్తున్నారు. జుట్టు చివర్లు చిట్లిపోతే ఫ్రిజ్జీ సమస్య మరింత పెరుగుతుంది. అందుకే రెండు నెలలకు ఒకసారి ట్రిమ్ చేయించుకోవడం మంచిదని హెయిర్ నిపుణులు చెబుతున్నారు. స్ప్లిట్ ఎండ్స్ తొలగిస్తే జుట్టు ఆరోగ్యంగా కనిపిస్తుంది. అలాగే మంచి ఆహారం కూడా జుట్టు ఆరో్యానికి చాలా అవసరం. ప్రోటీన్, ఐరన్, బయోటిన్ ఉన్న ఆహారం తీసుకుంటే వెంట్రుకలకు బలం వస్తుంది.

Related News

ఒక్క పన్ను పీకడానికి రూ.2.25 లక్షలా.. అదే ఇండియాలో అయితే?

డెస్క్ జాబ్ చేస్తున్నారా? ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

తగ్గేదెలే.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆత్మగౌరవం విషయంలో అసలు రాజీపడరు

స్కూల్‌కు వెళ్లే సమయం అయినా పిల్లలు నిద్రలేవడం లేదా? ఈ 5 టిప్స్‌తో మార్నింగ్ రొటీన్ మార్చండి

గుండెపోటు ముప్పును 30 శాతం తగ్గించగల పిల్.. తాజా అధ్యయనంలో అద్భుత ఫలితాలు

వర్షాకాలంలో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఈ పుడ్స్

రక్తంలో చక్కెర పెరగకుండా ఉండాలంటే ఆపిల్ తినాలా? పియర్ తినాలా?

ఉదయం ఫ్రెష్‌గా లేవాలంటే రాత్రి ఎప్పుడు పడుకోవాలి? నిపుణులు ఏం చెబుతున్నారు?

Big Stories

Advertisement
×