E-Paper
Advertisement

Tollywood: ఘనంగా మెహర్ రమేష్ కూతురి నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్!

Tollywood: ఘనంగా మెహర్ రమేష్ కూతురి నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్!
Advertisement

Tollywood: ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టడమే కాదు సెలబ్రిటీల వారసులు కూడా కొత్త బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఈ మేరకు విజయ్ దేవరకొండ -రష్మిక మందన్న, అల్లు శిరీష్ – నయనికా రెడ్డి, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ – కావ్య రెడ్డి ఇలా ఒక్కొక్కరు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఇక ఇప్పుడు బండ్ల గణేష్ కూతురు జనని నిశ్చితార్థం ఇటీవల ఘనంగా జరిగింది. పైగా ఆ నిశ్చితార్థ వేడుకలలో సినీ , రాజకీయ ప్రముఖులు సందడి చేశారు. అటు బండ్ల గణేష్ కూడా తన తాహతుకు తగ్గట్టుగా ఖరీదైన రిటర్న్ గిఫ్ట్స్ను అందించి అందరిని ఆశ్చర్యపరిచారు.. అయితే ఇప్పుడు మరో టాలీవుడ్ డైరెక్టర్ కూతురు వైవాహిక బంధంలోకి అడుగుపెడుతోంది.

ఘనంగా మెహర్ రమేష్ కూతురు నిశ్చితార్థం..

వారెవరో కాదు టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేష్ కూతురు మోహన. తాజాగా ఈమె నిశ్చితార్థం జరిగింది. అందుకు సంబంధించిన వీడియోని డైరెక్టర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ముఖ్యంగా ఈ వేడుకలో మెగా జంట అయిన మెగాస్టార్ చిరంజీవి – సురేఖ కొణిదెల చేతులమీదుగా కాబోయే నూతన జంట ఉంగరాలు మార్చుకున్నారు. ఇకపోతే ఈ వేడుకకు శ్రీకాంత్, సునీల్, నమ్రతా, సితార , కేటీఆర్ , వివి వినాయక్ , వెంకటేష్ తదితరులు హాజరయ్యారు. ఇకపోతే మెహర్ రమేష్ కి చిరంజీవి దగ్గర బంధువులు కావడంతో ఈ జంట చేతుల మీదుగా వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం మెహర్ రమేష్ కూతురు మోహన నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

మెహర్ రమేష్ కాబోయే అల్లుడు..

Advertisement

ఇకపోతే మోహనకి నిశ్చితార్థం జరగడంతో మెహర్ రమేష్ కి కాబోయే అల్లుడు బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఆయన ఎవరు? అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మెహర్ రమేష్ కి కాబోయే అల్లుడి పేరు అనిరుద్ అని తెలుస్తోంది. అయితే ఆయన బ్యాక్ గ్రౌండ్ విషయాలు ఇంకా తెలియడం లేదు.ప్రస్తుతం వీరి పెళ్లి ఈ ఏడాదిలోనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

also read:రామ్ చరణ్ పెద్ది మూవీ రన్ టైమ్ పై కొత్త చర్చ.. ట్రైలర్ రిలీజ్ అక్కడే!

మెహర్ రమేష్ బ్యాక్ గ్రౌండ్..

Advertisement

మెహర్ రమేష్ విషయానికి వస్తే.. పూరీ జగన్నాథ్ దగ్గర తొలుత దర్శకత్వ శాఖలో పనిచేసిన ఈయన అదే సమయంలో అంటే 2002లో రిలీజ్ అయిన బాబీ సినిమాలో కూడా నటించారు. ఇక ఎన్టీఆర్ ఆంధ్రావాలా సినిమాను కన్నడలో పునీత్ రాజ్ కుమార్ తో వీర కన్నడిగ తీసి దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అలాగే మహేష్ బాబు ఒక్కడు చిత్రాన్ని అజయ్ పేరుతో కన్నడలో రీమేక్ చేసి అక్కడ మరో విజయాన్ని సొంతం చేసుకున్నారు మెహర్ రమేష్. ఇకపోతే ఎన్టీఆర్ కంత్రి సినిమా ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఇది బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది . ఆ తర్వాత చేసిన శక్తి, షాడో, భోళాశంకర్ అన్నీ కూడా వరుసగా ఒకదానిని మించి మరొకటి ప్లాప్ ను చవి చూసాయి.. ఇక ప్రస్తుతం ఆయన ఖాళీగానే ఉన్నట్లు తెలుస్తోంది . ఇక ఇప్పుడు తన ఒక్కగానొక్క కూతురు మోహన నిశ్చితార్థాన్ని జరిపించారు.

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×