మంచి నిద్ర శరీరాన్ని, మనసును.. ఫ్రెష్‌గా, ప్రశాంతంగా ఉంచుతుంది. అయితే చాలా మందికి రాత్రి నిద్ర సరిగా పట్టదు. నిద్రపోయే సమయంలో ఆందోళన, అశాంతిని అనుభవిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. బెడ్ రూంలో వాతావరణం, కొన్ని అలవాట్లు నిద్ర నాణ్యతను ప్రభావితం చేస్తాయి. నిద్రకు ముందు కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది, మంచి గాఢ నిద్ర కూడా లభిస్తుంది.
చాలా మంది రాత్రి పడుకునే సమయంలో కూడా ఫోన్‌లో సోషల్ మీడియా చూస్తూ గడుపుతారు. ఇది మెదడును ఎక్కువగా ఉత్తేజపరుస్తుంది. ఫోన్ నుంచి వచ్చే బ్లూ లైట్ శరీరంలో నిద్రకు తోడ్పడే మెలటోనిన్ హార్మోన్‌ను తగ్గిస్తుంది. వాస్తు ప్రకారం ఎలక్ట్రానిక్ పరికరాలు బెడ్‌రూంలో పాజిటివ్ ఎనర్జీని దెబ్బతీస్తాయి. కాబట్టి నిద్రపోవడానికి ముందు కనీసం 30 నిమిషాల ఫోన్ దూరంగా పెట్టేయండి.
వాస్తు నిపుణుల ప్రకారం.. మీ బెడ్‌కు ఎదురుగా అద్దం పెట్టకూడదు. అద్దం ఎనర్జీ ప్రతిబింబించి దాన్ని మరింత ఎక్కువగా పెంచుతాయి. రాత్రి అద్దంలో ఒక వ్యక్తి తన ప్రతిబింబాన్ని చూసుకోవడం అసౌకర్యంగా కలిగిస్తుంది. అందుకే నిద్రకు ముందు అద్దాలను తెరతో కప్పివేయాలి.
పడకగదిలో మీ బెడ్ చుట్టూ.. బట్టలు, బ్యాగులు, షూస్ వంటి వస్తువులు చెల్లాచెదురుగా ఉంటే మానసిక శాంతి లభించదు. వాస్తు ప్రకారం.. ఇలా వస్తువులు చిందరవందరగా ఉండడం గదిలో శక్తి ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. బెడ్ కింద వస్తువులు పేర్చి ఉంచకూడదు. గదిని శుభ్రంగా, వస్తువులన్నీ సక్రమంగా అలంకరించి.. ఉంచడం నిద్రను మెరుగుపరుస్తుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం.. తల ఉత్తరం వైపు చేసి నిద్రపోవడం మంచిది కాదు. ఇలా చేయడం వల్ల నిద్ర ప్రశాంతంగా ఉండదు. తల దక్షిణం లేదా తూర్పు వైపు ఉంచి నిద్రపోవడం మంచిది. ఇలా చేయడం వల్ల శక్తి సమతుల్యంగా ఉంటుంది.
గదిలో లైట్లు ఆన్ చేసి పెట్టకూడదు. దీని వల్ల మెదడు ఉత్తేజంగా ఉండకూడదు. వాస్తు ప్రకారం వెచ్చని పసుపు.. లేదా డిమ్ లైట్లు ఉపయోగించాలి. ఇది గదిని ప్రశాంతంగా చేసి నిద్రను ఆహ్వానిస్తుంది.
Also Read: రాత్రంతా ఆలోచిస్తూ ఉంటారా.. నిద్ర రావడం లేదా? దానికి కారణాలు ఇవే
పగిలిన అద్దాలు, బ్రోకెన్ ఫర్నిచర్, పగిలిన గాజు వస్తువులు నెగెటివ్ శక్తిని పెంచుతాయి. వాస్తు ప్రకారం.. ఇలాంటి వస్తువులు మానసిక ఒత్తిడి, అస్థిరతను కలిగిస్తాయి. వాటిని వెంటనే తొలగించాలి.
హింసాత్మక లేదా ప్రతికూల చిత్రాలు, డెకర్ ఇంట్లో అశాంతిని వ్యాప్తి చేస్తాయి. పాజిటివ్ ఎనర్జీ నిచ్చే పెయింటింగ్స్, ఫొటోలు, తేలికపాటి రంగులు గదిని ప్రశాంతంగా చేస్తాయి.