ముఖంపై ఫైన్ లైన్స్, ముడతలు కనిపించడం వయసు పెరుగుతున్న కొద్దీ సహజం. అయితే ఒక్కసారిగా అద్దంలో చూసుకున్నప్పుడు అవి మరింత స్పష్టంగా కనిపిస్తే చాలా మంది ఆందోళన చెందుతారు. చర్మ సంరక్షణ ఉత్పత్తులు దీర్ఘకాలంలో మంచి ఫలితాలు ఇస్తాయి. కానీ వాటి ప్రభావం కనిపించడానికి కొంత సమయం పడుతుంది. అలాంటి సమయంలో మేకప్‌లో చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా వెంటనే యవ్వనంగా కనిపించవచ్చు. సరైన మేకప్ టెక్నిక్స్‌ను ఉపయోగిస్తే ముఖం తాజాగా, ప్రకాశవంతంగా, సహజంగానే అందంగా కనిపిస్తుంది.
చాలామంది ముఖంలోని లోపాలను దాచేందుకు మందంగా ఉండే మ్యాట్ ఫౌండేషన్‌ను ఉపయోగిస్తారు. అయితే ఇది ఫైన్ లైన్స్, ముడతలను మరింత స్పష్టంగా చూపించే అవకాశం ఉంది. మేకప్ ప్రారంభించే ముందు మంచి మాయిశ్చరైజర్‌ను రాయాలి. ఇది చర్మానికి తేమను అందించి మేకప్‌ను సాఫీగా కనిపించేలా చేస్తుంది. తేలికపాటి స్కిన్ టింట్ లేదా సీరమ్ ఫౌండేషన్‌ను ఉపయోగించడం మంచిది. అవసరమైన ప్రాంతాల్లో మాత్రమే ఫౌండేషన్ అప్లై చేయాలి. ఇలా చేస్తే ముఖం సహజంగా, యవ్వనంగా కనిపిస్తుంది.
బ్లష్‌ను గడ్డాల మధ్య భాగంలో అప్లై చేయడం చాలా మందికి అలవాటు. కానీ ఇలా చేయడం వల్ల ముఖం కాస్త కిందకు వాలినట్లు కనిపించవచ్చు. యవ్వనంగా కనిపించాలంటే బ్లష్‌ను చెంప ఎముకల పైభాగంలో అప్లై చేసి కనుపాపల వైపు మెల్లగా బ్లెండ్ చేయాలి. ఇది ముఖానికి లిఫ్టెడ్ లుక్‌ను ఇస్తుంది. పౌడర్ బ్లష్ కంటే క్రీమ్ లేదా లిక్విడ్ బ్లష్ ఉపయోగిస్తే మరింత సహజమైన మెరుపు వస్తుంది. ముఖం ఆరోగ్యంగా కనిపిస్తుంది.
కళ్ల కింద ఎక్కువ కన్‌సీలర్ వాడటం వల్ల ఫైన్ లైన్స్ మరింత స్పష్టంగా కనిపిస్తాయి. అందువల్ల తక్కువ మొత్తంలోనే ఉపయోగించడం మంచిది. కళ్ల వద్ద లోపలి మూలల దగ్గర కొద్దిగా కన్‌సీలర్ అప్లై చేయాలి. అలాగే బయట మూలల వద్ద కూడా కొద్దిగా రాసి పైకి బ్లెండ్ చేయాలి. ఈ పద్ధతి డార్క్ సర్కిల్స్‌ను తగ్గించి కళ్లను తాజాగా కనిపించేలా చేస్తుంది. ముఖం కూడా మరింత ఫ్రెష్‌గా కనిపిస్తుంది.
గాఢమైన నలుపు రంగు ఐలైనర్ కొన్నిసార్లు కళ్లను అలసిపోయినట్లు చూపించవచ్చు. ముఖ్యంగా కళ్ల చుట్టూ ముడతలు ఉన్నప్పుడు ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుంది. అందువల్ల బ్రౌన్, చార్కోల్ లేదా నేవీ బ్లూ వంటి సాఫ్ట్ షేడ్స్‌ను ఎంచుకోవడం మంచిది. ఇవి కళ్లకు అందమైన ఆకృతి ఇస్తాయి. కింది ల్యాష్ లైన్‌పై మందంగా ఐలైనర్ వేయకుండా ఉండాలి. ఇలా చేస్తే కళ్ల పరిమాణం చిన్నగా కనిపించే అవకాశం ఉంటుంది.
Also Read: మీ అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారా? ఈ తేదీల్లో పుట్టినవారు మంచి భర్త కాగలరు
వయసు పెరిగే కొద్దీ పెదవుల సహజ ఆకృతి మరియు నిండుదనం తగ్గవచ్చు. గాఢమైన మ్యాట్ లిప్‌స్టిక్స్ పెదవులను మరింత సన్నగా చూపించవచ్చు. ముందుగా సహజ పెదవి రంగుకు దగ్గరగా ఉండే లిప్ లైనర్‌ను ఉపయోగించాలి. ఆ తర్వాత టింటెడ్ లిప్ బామ్, లిప్ ఆయిల్ లేదా సాటిన్ ఫినిష్ లిప్‌స్టిక్‌ను అప్లై చేయాలి. చివరిగా పెదవుల మధ్య భాగంలో కొద్దిగా గ్లోస్ వేయాలి. దీంతో పెదవులు నిండుగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
యవ్వనంగా కనిపించడానికి ఖరీదైన చికిత్సలు అవసరం లేదు. సరైన మేకప్ పద్ధతులను అనుసరించడం ద్వారా కూడా ఫైన్ లైన్స్, ముడతలను తక్కువగా కనిపించేలా చేయవచ్చు. తేలికపాటి ఉత్పత్తులు, మంచి తేమ, సహజమైన ఫినిష్‌ను ఎంచుకోవడం ద్వారా ముఖం తాజాగా, అందంగా, యవ్వనంగా కనిపిస్తుంది.