E-Paper
Advertisement

ఇండియా, ఆఫ్ఘానిస్తాన్ టెస్ట్ చూసే నాథుడే లేడు..ప‌రువు తీసిన త‌న్వీర్ అహ్మ‌ద్

ఇండియా, ఆఫ్ఘానిస్తాన్ టెస్ట్ చూసే నాథుడే లేడు..ప‌రువు తీసిన త‌న్వీర్ అహ్మ‌ద్
Advertisement

Tanveer Ahmed:  ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా (India vs Afghanistan, One-off Test,) మధ్య టెస్ట్ సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. న్యూ చండీగఢ్ వేదికగా నిన్న ఈ టెస్ట్ సిరీస్ ప్రారంభమైంది. మొన్నటి వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ చాలా విజయవంతంగా.. హౌస్ ఫుల్ స్టేడియాలతో కొనసాగింది. అయితే నిన్న ప్రారంభమైన ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమిండియా టెస్ట్ సిరీస్ మాత్రం చాలా చెప్పగా సాగుతోంది. ఈ టెస్ట్ సిరీస్ చూసేందుకు జనాలు ఎవరూ రావడం లేదు. ఇలాంటి క్రమంలోనే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ టెస్ట్ సిరీస్ చూసేందుకు 500 మంది కూడా రాలేదని దారుణంగా ట్రోల్ చేశారు.

Also Read:  Tanveer Ahmed: బాబ‌ర్ ను ( babar azam) ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

ఇండియా, ఆఫ్ఘానిస్తాన్ టెస్ట్ చూసే నాథుడే లేడు..ప‌రువు తీసిన త‌న్వీర్ 

Advertisement

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య టెస్ట్ సిరీస్ కొనసాగుతున్న నేపథ్యంలో… ప్రేక్షకులు పెద్దగా రాలేదు. ఈ క్రమంలోనే ఈ టెస్ట్ సిరీస్ పై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ తన స్టైల్లో స్పందించారు. ఐపీఎల్ పేరుతో విర్రవీగుతున్న బీసీసీఐ… పరువు ఒక్క టెస్ట్ సిరీస్ తో పోయిందంటూ బాంబు పేల్చారు. ఆఫ్గనిస్తాన్ వర్సెస్ టీమిండియా మధ్య జరుగుతున్న చండీగఢ్ టెస్ట్ నేపథ్యంలో ప్రేక్షకులు ఎవరూ రాలేదని పరువు తీసే ప్రయత్నం చేశారు. సరిగ్గా లెక్క పెడితే స్టేడియంలో 500 మంది కూడా జనాలు లేరంటూ సెటైర్లు పేల్చారు. ఐపీఎల్ పేరుతో మొన్నటి వరకు క్రికెట్ ను నాశనం చేసిన బీసీసీఐకి… ఇది అవమానకరమైన సంఘటన అంటూ విమర్శలు చేశారు.

మొన్న బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ నేపథ్యంలో… జనాలు విపరీతంగా వచ్చారని గుర్తు చేశారు. కానీ కోట్ల ఆదాయం ఉన్న టీమిండియా టెస్ట్ మ్యాచ్లకు మాత్రం జనాలు కరువయ్యారు అంటూ సెటైర్లు పేల్చారు. దీనిపై బీసీసీఐ సమాధానం చెప్పాలంటూ ఫైర్ అయ్యారు. ఐపీఎల్ ఒక్కటే క్రికెట్ కాదని… టెస్ట్ క్రికెట్ కూడా ఎదగాలని కోరారు. తాను తీసుకున్న గోతిలో.. తానే పడ్డట్లుగా బీసీసీఐ వ్యవహారం ఉందంటూ చురకలు అంటించారు తన్వీర్ అహ్మద్.
దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

ఏకైక టెస్టులో అదరగొట్టిన టీమిండియా

Advertisement

న్యూ చండీగఢ్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతోంది. ఈ ఏకైక టెస్టులో మొదటి బ్యాటింగ్ చేసిన ఆ టీమ్ ఇండియా ఎనిమిది వికెట్ల నష్టానికి 564 పరుగులు సాధించింది. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ చేస్తోంది. రెండో రోజు ముగిసే సమయానికి ఐదు వికెట్ల నష్టపోయిన ఆఫ్గనిస్తాన్ 113 పరుగులు సాధించింది. రేపు లంచ్ సమయం వరకు ఆఫ్గనిస్తాన్ ఆల్ అవుట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది.

Also Read: Ambati Rayudu: బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి Ambati Rayudu!

 

 

Related News

55 ప‌రుగుల‌కే ఆలౌటైనా సిగ్గు రాలేదా? ఫాతిమా స‌నా ఓవ‌రాక్ష‌న్‌పై టీమిండియా క్రికెట‌ర్ సీరియ‌స్

పాకిస్తాన్ జ‌ట్టులో పెను ప్ర‌కంప‌న‌లు…ప్లేయ‌ర్ల మొబైల్ ఫోన్లను లాగేసుకున్న PCB

అదరగొట్టిన ఇండియా, పాకిస్తాన్ మరో ఘోర ఓటమి…ఫిక్సింగ్ చేశారంటూ త‌న్వీర్ ఆరోప‌ణ‌లు

55 ప‌రుగుల‌కే పాకిస్తాన్ ఆలౌట్…ఫాతిమా స‌నా పాత వీడియో వైర‌ల్

PCBలో ఆర్థిక సంక్షోభం.. PSL ఆడే ప్లేయ‌ర్ల జీతాలు భారీగా త‌గ్గింపు ?

సచిన్ వికెట్ తీయాలంటే.. ఆ దేవుడిని పూజించాల్సిందే..బ్రెట్ లీ కామెంట్స్ వైరల్

పాకిస్తాన్ జ‌ట్టులో అంద‌రూ క‌ట్టప్ప‌లే..అందుకే సంక‌నాకిపోతున్నారు

టీమిండియా తిక్క కుదరాలంటే, నఖ్వీకి ఐసీసీ చైర్మన్ పదవి ఇవ్వండి..!

Big Stories

Advertisement
×