E-Paper
Advertisement

కేసీఆర్ ఆనవాళ్లు తీసేస్తారా? చరిత్ర ఉన్నంత వరకు ఆయనే ఉంటారు.. తలసాని హాట్ కామెంట్స్!

కేసీఆర్ ఆనవాళ్లు తీసేస్తారా? చరిత్ర ఉన్నంత వరకు ఆయనే ఉంటారు.. తలసాని హాట్ కామెంట్స్!
Advertisement

Talasani Srinivas: స్వేచ్ఛ బ్యూరో: పైరవీలకు అవకాశం లేదు… ప్రజల ఆదరణ కలిగిన వారికే పదవులు, ఎన్నికలలో పోటీ చేసే అవకాశం అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. పార్టీకి కార్యకర్తలే మూలం అన్నారు. తెలంగాణ భవన్ లో ఆదివారం గోషామహల్ నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ సమావేశంను నిర్వహించారు.

తలసాని మాట్లాడుతూ..

Advertisement

ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ మనందరిది.. పార్టీ కోసం కష్టపడి పని చేసే వారికి, గుర్తింపు, సముచిత స్థానం లభిస్తుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం లో గోషామహల్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు జరిగాయన్నారు. బోనాల ఉత్సవాలకు నిధులు ఇచ్చిన చరిత్ర కేసీఆర్ ది అని వెల్లడించారు. కార్యకర్తలంతా సైనికుల్లా పార్టీ గెలుపు కోసం పని చేయాలని, వచ్చే ఎన్నికల్లో గోషామహల్ లో గులాబీ జెండా ఎగరాలని పిలుపు నిచ్చారు.

కార్యకర్తలకు పిలుపు

Advertisement

ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. నిరంతరం ప్రజలలో ఉంటూ సమస్యలపై ప్రభుత్వం పై పోరాడాలని సూచించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలపై కలసికట్టుగా ప్రజలతో కలిసి కొట్లాడాలని పిలుపు నిచ్చారు. మీకు అన్ని విధాలుగా నేను అండగా ఉంటానని, తెలంగాణ రాష్ట్రాన్ని భారత దేశ చిత్ర పటంలోకి తీసుకొచ్చిన గొప్ప నాయకులు కేసీఆర్ అని స్పష్టం చేవారు.

చరిత్ర ఉన్నంత వరకు కేసీఆర్ ఆనవాళ్లు

కేసీఆర్ ఆనవాలు తీసేస్తా అని ముఖ్యమంత్రి అంటుండు… చరిత్ర ఉన్నంత వరకు కేసీఆర్ ఆనవాళ్లు ఉంటాయన్నారు. కేసీఆర్ 10 సంవత్సరాల పాలనలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు అవుతుంది… చెప్పుకోవడానికి చేసిందేమీ లేదన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి మాట్లాడని విధంగా మన ముఖ్యమంత్రి బూతు భాషలు మాట్లాడుతుండని మండిపడ్డారు. ముఖ్యమంత్రి తన స్థాయిని మరిచి వయసుకు కూడా గౌరవం లేకుండా తెలంగాణ సాధించిన కేసీఆర్ ను విమర్శిస్తుండని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే..?

రాష్ట్రంలో ని అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ రావాలి… రేవంత్ రెడ్డి పోవాలి అని కోరుకుంటున్నారన్నారు. మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంలో అప్రమత్తంగా ఉండండి… ఓట్లు పోకుండా చూడాలని సూచించారు. 18 సంవత్సరాలు నిండిన వారు ఓటరుగా నమోదయ్యేలా చూడాలన్నారు. ఈ సారి డిజిటల్ విధానములో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. సభ్యత్వం తీసుకున్న వారికి గుర్తింపు కార్డులను కూడా అందిస్తామన్నారు.

Also Read: పగలు బీజేపీ.. రాత్రి బీఆర్ఎస్.. కిషన్ రెడ్డిపై రేవంత్ ఫైర్!

Related News

RTO Brokers: ఆర్టీఏలో ఏజెంట్ల రాజ్యానికి ఎండ్ కార్డ్?.. యాక్షన్‌లో అధికారులు!

Etela Rajender: రోడ్లెక్కి ధర్నాలా? రాహుల్, ప్రియాంకలపై ఎంపీ ఈటల సంచలన వ్యాఖ్యలు!

Karimnagar Robbery: కరీంనగర్ దోపిడీ ముఠా ప్లాన్ అట్టర్ ఫ్లాప్?.. చివరిలో సినిమా రేంజ్ లాంటి ట్విస్ట్..!

BJP Attack: రాహుల్ తీరుపై బీజేపీ ఫైర్.. ‘దేశ సమగ్రతను దెబ్బతీస్తే తీహార్ జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందే!’

Engineering Student: నా అవయవాలను దానం చేయండి అంటూ.. బీటెక్ విద్యార్ధి సూసైడ్ కలకలం!

KTR: ఆదిలాబాద్ CCI పునరుద్ధరణపై స్పష్టత ఇవ్వండి.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ!

Jurala Project: జూరాల ప్రాజెక్టు పోటెత్తిన వరద.. త్వరలో గేట్లు ఎత్తే అవకాశం!

Kiran Kumar Reddy: నీట్ స్కామ్‌పై కేంద్రానికి కాంగ్రెస్ డెడ్‌లైన్.. భువనగిరి ఎంపీ చామల సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×