E-Paper
Advertisement

Weight Loss: కేవలం 15 రోజుల్లో బరువు తగ్గాలంటే ఈ టిప్స్ పాటించండి.. ఉదయాన్నే ఇలా చేస్తే సరి

Weight Loss: కేవలం 15 రోజుల్లో బరువు తగ్గాలంటే ఈ టిప్స్ పాటించండి.. ఉదయాన్నే ఇలా చేస్తే సరి
Advertisement

Weight Loss| బరువు తగ్గడానికి ఎప్పుడూ కఠినమైన డైట్ అవసరం లేదు. ఉదయాన్నే సులభమైన అలవాట్లు పాటిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఈ చిన్న చిన్న అలవాట్లు జీర్ణక్రియను పెంచి కొవ్వు తగ్గిస్తాయి. ఈ అలవాట్లు 15 రోజులు పాటిస్తే మీ శరీరంలో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి.

ఉదయం లేవగానే గోరువెచ్చని నీటితో ప్రారంభించండి

ప్రతిరోజు ఉదయం లేవగానే ఒకటి లేదా రెండు గ్లాసుల గోరువెచ్చని నీరు తాగండి. ఇలా చేస్తే మీ జీర్ణక్రియ వేగవంతమై క్యాలరీలు కరగడం మొదలవుతాయి. పైగా శరీరంలోని మలినాలు బయటకు పంపుతుంది. జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. మెరుగైన ఫలితాల కోసం నిమ్మరసం కలిపి తాగండి.

ఉదయం సూర్యకాంతిని గ్రహించండి

Advertisement

సూర్యకాంతి శరీరానికి చాలా ఉపయోగకరం. శరీరంలో హార్మోన్లు సమతుల్యం చేస్తుంది. జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. ప్రతిరోజూ 10 నుంచి 15 నిమిషాలు సూర్యకాంతిలో ఉండండి. దీంతో శరీరంలో విటమిన్ D స్థాయి పెరుగుతుంది. విటమిన్ డి ఎముకల బలాన్ని పెంచేందుకు ఉపయోగపడుతుంది.

ఉదయం వ్యాయామం చేయండి

ఉదయం వ్యాయామం చేయడం వల్ల కొవ్వు త్వరగా కరుగుతుంది. రోజంతా ఉత్సాహాన్ని పెంచుతుంది. మీలో ఏకాగ్రత కూడా మెరుగవుతుంది. నడక, జాగింగ్ లేదా ఇంట్లో వ్యాయామాలు చేయవచ్చు. రోజుకు 20 నుంచి 30 నిమిషాలు సరిపోతాయి.

ప్రోటీన్ ఎక్కువగా ఉన్న అల్పాహారం తినండి

Advertisement

అల్పాహారం బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం ఆకలిని తగ్గిస్తుంది. ఇది క్రేవింగ్స్‌ను నియంత్రిస్తుంది.
గుడ్లు, పెరుగు, బాదం, వాల్‌నట్స్, పిస్తా, కాజు లాంటి డ్రై ఫ్రూట్ నట్స్ తినండి. లేదా మొలక విత్తనాలు కూడా తొనొచ్చు. ఇది ఎక్కువసేపు తృప్తిని ఇస్తుంది.

జాగ్రత్తగా తినే అలవాటు అలవర్చుకోండి

ఆహారం నెమ్మదిగా నమిలి తినండి. తినేటప్పుడు మొబైల్ ఉపయోగించవద్దు. మొబైల్ చూస్తూ తింటే మీరు అధికంగా తినే అవకాశం ఉంది. జీర్ణక్రియ కూడా మెరుగవుతుంది. కాలరీల నియంత్రణకు సహాయపడుతుంది.

ఉదయాన్నే చక్కెర పానీయాలు తగ్గించండి

ఉదయం చాలామంది టీ లేదా చక్కెర పానీయాలు తాగుతారు. వీటి వల్ల శరీరంలో క్యాలరీలు పెరుగుతాయి. బరువు తగ్గేవారికి ఈ పెరిగిన క్యాలరీలు అడ్డంకి. బదులుగా హెర్బల్ టీ లేదా నీరు తాగండి. ఇలా చేస్తే బ్లడ్ షుగర్‌ స్థిరంగా ఉంటుంది.

భోజనం ముందుగా ప్లాన్ చేయండి

ఉదయం మీ ఆహారాన్ని ముందుగానే ప్లాన్ చేయండి. ఇలా చేయడం వల్ల అనారోగ్యకరమైన ఆహారం తినకుండా నివారించవచ్చు. దీంతో మీ డైట్‌ కూడా మెరుగవుతుంది. అందుకోసం హెల్తీ స్నాక్స్ బెస్ట్ ఆప్షన్.

మీ శరీర బరువుని రోజూ గమనించండి

ప్రతి ఉదయం మీ బరువును చెక్ చేయండి. దీంతో మీ మోటివేషన్‌ పెరుగుతుంది. మీరు క్రమశిక్షణగా ఉండటానికి సహాయపడుతుంది. మీ డైట్ ట్రాకింగ్ మంచి ఫలితాలు ఇస్తుంది.

ఉదయం చురుకుగా ఉండండి

ఉదయం ఎక్కువసేపు కూర్చోవద్దు. చిన్న పనులు చేస్తూ చురుకుగా ఉండండి. ఈ కారణంగా ఎక్కువ కాలరీలు ఖర్చు అవుతుంటాయి. బరువు తగ్గడాన్ని వేగవంతం చేస్తుంది.

సరైన నిద్ర చాలా అవసరం

సరైన నిద్ర బరువు తగ్గడంలో ముఖ్యమైనది. నిద్రలేమి ఆకలిని పెంచుతుంది. మీలో క్రేవింగ్స్‌ కూడా పెరుగుతాయి. ఈ కారణంగా అనారోగ్యకర ఆహారం తిని మీ బరువు మళ్లీ పెరుగుతుంది. అందుకే సమయానికి నిద్రపోవాలి, లేవాలి.

Also Read : పర్ఫెక్ట్ ఇడ్లీ రెసిపీ.. సుతిమెత్తని ఇడ్లీ ఇంట్లోనే చేసేయండి.. చాలా ఈజీ

క్రమంగా తప్పకుండా పాటించాలి

ఈ అలవాట్లు 15 రోజులు పాటిస్తే మార్పు కనిపిస్తుంది. కానీ క్రమం తప్పకుండా నిరంతరం పాటిస్తేనే ఫలితాలు దక్కుతాయి.

Related News

విచిత్ర వేడుక.. జీవితాంతం పెళ్లి వద్దంటూ ప్రేమికుల గ్రాండ్ సెలబ్రేషన్

టేస్టీ అండ్ స్పైసీ క్యాప్సికమ్ రైస్..నిమిషాల్లో తయారయ్యే రెసిపీ!

బంగాళాదుంపలతో కాదు.. అవకాడోతో ఇలా ఫ్రైస్ చేసేయండి, టేస్ట్ అదిరిపోతుంది!

ఎప్పుడూ పకోడీలేనా? ఈసారి పచ్చి అరటికాయతో ఇలా షామీ కబాబ్ చేసి చూడండి!

దిష్టి ఎలా తీయాలో తెలుసా? వేటితో తీస్తే వెంటనే ఫలితం ఉంటుంది?

కొత్తగా పెళ్లయిన యువతికి ఇంటర్వ్యూలో అలాంటి ప్రశ్న.. మీరైతే ఏం చేస్తారు?

ముఖంపై నల్లటి మచ్చలతో ఇబ్బంది పడుతున్నారా? క్లియర్ స్కిన్ కోసం డాక్టర్ ఏం చెప్పారంటే

చూపు దెబ్బతినకముందే అప్రమత్తం కండి.. కళ్లు చెప్పే ఆ రహస్య సంకేతాలు ఇవే!

Big Stories

Advertisement
×