E-Paper
Advertisement

Beer Facial Tips: పార్లర్‌కి వెళ్లక్కర్లేదు ! ఇంట్లోనే ఈ బీర్ ఫేస్ ప్యాక్‌తో ఇన్స్టంట్ గ్లో గ్యారంటీ

Beer Facial Tips: పార్లర్‌కి వెళ్లక్కర్లేదు ! ఇంట్లోనే ఈ బీర్ ఫేస్ ప్యాక్‌తో ఇన్స్టంట్ గ్లో గ్యారంటీ
Advertisement

Beer Facial Tips: బీర్ తాగడం ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. బీరును ద్రాక్ష, బార్లీ నుంచి తయారు చేస్తారు. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ బి, ఐరన్, కాల్షియం, ఫాస్ఫేట్, ఫైబర్, ఫ్లేవనాయిడ్ అనే మూలకంతో పాటు మన ఆరోగ్యానికి, చర్మానికి అవసరమైన ఇతర యాంటీ-ఆక్సిడెంట్లు కూడా దీనిలో ఉంటాయి. చర్మం డల్‌గా మారినప్పుడు మీరు మునుపటి అందాన్ని తిరిగి పొందడానికి బీర్ ప్యాక్ ఉపయోగించవచ్చు. బీరులో కొన్ని పదార్థాలను కలిపి తయారుచేసిన ఫేస్ ప్యాక్ చర్మాన్ని మెరుస్తూ ఉండేలాగా చేస్తుంది.

బీర్ ఫేస్ ప్యాక్‌లు పూర్తిగా సహజమైనవి. వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. బీర్ చర్మం యొక్క pH స్థాయిని సమతుల్యం చేస్తుంది. అంతే కాకుండా ఇది చర్మ సమస్యలను తగ్గిస్తుంది. ప్యాక్‌లో ఉపయోగించే పెరుగు టానింగ్‌ను తగ్గిస్తుంది. ఆలివ్ ఆయిల్ చర్మంలో తేమను అదిస్తుంది. పొడి చర్మాన్ని కూడా ఇది ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది. ముడతలను తొలగిస్తుంది. బీర్‌లో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. అందుకే ఇది చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ప్యాక్‌ను ఎలా తయారు చేసుకుని, ఉపయోగించాలో ఇప్పుడు నేర్చుకుందాం.

Advertisement

బీర్ ఫేస్ ప్యాక్:

కావాల్సినవి:

Advertisement

బీరు – 2 టీస్పూన్లు

పెరుగు – 1 టీస్పూన్

ఆలివ్ నూనె – 1 టీస్పూన్

గుడ్డులోని తెల్లసొన – 1

ఎలా తయారు చేయాలి ?

ఒక గిన్నెలో బీరు, పెరుగు, ఆలివ్ ఆయిల్ వేసి కలపండి. అన్నీ బాగా కలిపిన తర్వాత.. గుడ్డులోని తెల్లసొన వేసి బాగా మిక్స్ చేయండి. ఈ ఫేస్ ప్యాక్‌ను మీ ముఖం, మెడకు బాగా అప్లై చేయండి. 15 నిమిషాలు అలాగే ఉంచండి. 15 నిమిషాల తర్వాత.. మీ ముఖాన్ని నీటితో బాగా శుభ్రం చేసుకోండి.

బీర్ చర్మానికి చేసే మేలు:

యాంటీ ఆక్సిడెంట్లు:

బీర్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ తో పోరాడి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతే కాకుండా ఇవి ముడతలను తగ్గించడంలో కూడా చాలా బాగా పనిచేస్తాయి.

విటమిన్ డి:
బీర్ బార్లీ నుంచి తయారు చేయడం వల్ల వీటి నుంచి వచ్చే విటమిన్ బి చర్మాన్ని మెరిచేలా చేస్తాయి. అంతే కాకుండా చర్మంపై మచ్చలను తొలగించడంలో కూడా ఉపయోగపడుతుంది.

Also Read: ఆ దేశాల్లో జనం టూత్ బ్రష్‌లను ఫ్రిజ్‌లో పెడుతున్నారు.. ఎందుకో తెలిస్తే నోరెళ్లబెడతారు!

జిడ్డు తొలగించడం:
జిడ్డు చర్మం ఉన్న వారు తరచుగా బీర్ తో తయారు చేసిన ఫేస్ ప్యాక్ వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. బీర్ లోని ఈస్ట్ , ఎంజైమ్ లు చర్మాన్ని లోతుగా శుభ్రం చేసి ముఖ రంధ్రాలను తెరుస్తాయి. జిడ్డు చర్మాన్ని , మొటిమలను తగ్గించడంలో ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి.

హైడ్రేషన్:
చర్మానికి తేమను అందించడంలో బీర్ ఫేషియల్ సహాయపడుతుంది. డ్రై స్కిన్ ఉన్న వారు తరచుగా ఈ ఫేస్ ప్యాక్ వాడటం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.

ఎక్స్పోలియేషన్:

బీర్‌లోని లక్షణాలు చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. అంతే కాకుండా ముఖం కాంతివంతంగా కనిపించేలా చేస్తాయి.

Related News

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్ని ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

Big Stories

Advertisement
×