E-Paper
Advertisement

WhatsApp Hall Tickets: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇక నేరుగా తల్లిదండ్రుల వాట్సాప్‌కే హాల్ టికెట్లు!

WhatsApp Hall Tickets: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇక నేరుగా తల్లిదండ్రుల వాట్సాప్‌కే హాల్ టికెట్లు!
Advertisement

WhatsApp Hall Tickets: తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు వారి తల్లిదండ్రుల సౌకర్యార్థం ఇంటర్ బోర్డు ఓ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. సాంకేతికతను వినియోగించుకుంటూ, విద్యార్థుల హాల్ టికెట్లను నేరుగా వారి తల్లిదండ్రుల వాట్సాప్ నంబర్లకు పంపాలని నిర్ణయించింది. ఈ మేరకు బోర్డు అధికారులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. కాలేజీల చుట్టూ తిరిగే పని లేకుండా, సులభంగా హాల్ టికెట్లు పొందేలా ఈ ఏర్పాట్లు చేస్తున్నారు.

వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. సాధారణంగా పరీక్షలకు వారం రోజుల ముందు హాల్ టికెట్లు ఇస్తుంటారు. కానీ ఈసారి చివరి నిమిషంలో హడావిడి లేకుండా, పరీక్షలకు సుమారు 45 రోజుల నుంచి రెండు నెలల ముందే హాల్ టికెట్లను వాట్సాప్ ద్వారా పంపేందుకు బోర్డు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం గ్రామీణ, పట్టణ అనే తేడా లేకుండా అత్యధిక శాతం మంది తల్లిదండ్రుల వద్ద స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

ఈ కొత్త విధానం వల్ల ప్రధానంగా హాల్ టికెట్లలో దొర్లే తప్పులను ముందే గుర్తించి సవరించుకునే అవకాశం కలుగుతుంది. వాట్సాప్‌లో హాల్ టికెట్ అందిన వెంటనే తల్లిదండ్రులు అందులోని విద్యార్థి పేరు, ఫోటో, తండ్రి పేరు, గ్రూపు తదితర వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. ఒకవేళ ఏవైనా తప్పులు గమనిస్తే, వెంటనే సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లి సరిచేయించుకోవచ్చు.

అలాగే, తమ పిల్లల పరీక్షా కేంద్రం (Exam Center) ఎక్కడ పడింది? ఏ తేదీన ఏ పరీక్ష జరగనుంది? అనే వివరాలపై తల్లిదండ్రులకు స్పష్టమైన అవగాహన కల్పించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. దీనివల్ల విద్యార్థులకు మానసిక ఒత్తిడి తగ్గి, పరీక్షలపై ప్రశాంతంగా ఏకాగ్రత వహించే అవకాశం కలుగుతుందని బోర్డు వర్గాలు తెలిపాయి.

Advertisement

Read Also: Kim Jong Un: కిమ్ జోంగ్ ఉన్ రాజకీయ వారసురాలు ఈమేనా?.. అధికారిక కార్యక్రమాల్లో ప్రత్యక్షం

Related News

ఉన్మాదుల్లా ప్రవర్తించారు.. BRSపై రేవంత్ రెడ్డి ఫైర్

తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధిస్తేనే మేలు.. తాటికొండ రాజయ్య సంచలనం

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై భగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణులు.. శామీర్‌పేట్‌లో భారీగా ర్యాలీ!

ఆయుష్ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. భారీగా పెంచిన స్టైఫండ్!

రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన.. కేసీఆర్ చావు కోరుకున్నారు.. గవర్నర్‌కు కేటీఆర్ ఫిర్యాదు!

కేసీఆర్ ఆరోగ్యంపై చిల్లర రాజకీయాలా? హరీశ్ రావు గుట్టు విప్పిన టీపీసీసీ చీఫ్!

మీ నేతలు తోసేస్తే.. ప్రభుత్వంపై నిందలా? BRS మహిళా నేతలకు సీతక్క స్ట్రాంగ్ కౌంటర్!

మగ పోలీసులు తోసేశారు.. కిందపడితే తొక్కేశారు.. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల ఆవేదన

Big Stories

Advertisement
×