E-Paper
Advertisement

Fire Accident: ఆర్మీ క్యాంప్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

Fire Accident: ఆర్మీ క్యాంప్‌లో భారీ అగ్ని ప్రమాదం..  ఎగిసిపడుతున్న మంటలు
Advertisement

Fire Accident: ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లా జోషిమఠ్‌లో ఉన్న ఆర్మీ క్యాంప్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా..  సైనిక వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. జోషిమఠ్ ప్రాంతం వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైనది కావడంతో..  అక్కడ ఉన్న ఆర్మీ క్యాంప్‌లో మంటలు చెలరేగడం అందరినీ ఆందోళనకు గురిచేసింది.

 జోషిమఠ్‌లో ఉన్న ఆర్మీ  క్యాంప్‌లోని ఒక స్టోర్ రూమ్‌లో ఒక్కసారిగా మంటలు ప్రారంభమయ్యాయి. స్టోర్ రూమ్‌లో నిల్వ ఉంచిన వస్తువులు అగ్నికి ఆహుతి కావడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. చూస్తుండగానే దట్టమైన నల్లటి పొగ ఆ ప్రాంతమంతా అలుముకుంది. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో పక్కనే ఉన్న ఇతర విభాగాలకు కూడా ప్రమాదం పొంచి ఉందని భావించిన సైనికులు వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రాథమికంగా సైనిక సిబ్బంది తమ వద్ద ఉన్న పరికరాలతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు.

Advertisement

సమాచారం అందుకున్న వెంటనే స్థానిక అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక యంత్రాలతో తీవ్రంగా శ్రమిస్తున్నారు. జోషిమఠ్ కొండ ప్రాంతం కావడం.. చలి తీవ్రత ఉన్నప్పటికీ…  సిబ్బంది ప్రాణాలకు తెగించి మంటలు ఇతర నివాస ప్రాంతాలకు లేదా ఆయుధ గారాలకు వ్యాపించకుండా అడ్డుకట్ట వేశారు. ప్రస్తుతం మంటలు క్రమంగా అదుపులోకి వస్తున్నట్లు సమాచారం అందుతోంది.

ఈ ప్రమాదంలో ఎంత మేర ఆస్తి నష్టం సంభవించింది అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. స్టోర్ రూమ్‌లో ఉన్న ఫర్నిచర్, రికార్డులు లేదా ఇతర సైనిక సామాగ్రి కాలిపోయి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే..  ఈ ఘటనలో ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చే అంశం. ప్రాథమిక అంచనా ప్రకారం షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని భావిస్తున్నారు. క్యాంప్‌లో ఉన్న విద్యుత్ వైరింగ్‌లో లోపాల వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

ప్రస్తుతం ఆర్మీ ఉన్నతాధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మంటలు పూర్తిగా ఆరిపోయిన తర్వాత నష్టాన్ని అంచనా వేస్తామని..  అలాగే ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని అధికారులు వెల్లడించారు. సరిహద్దు ప్రాంతాలకు సమీపంలో ఉన్న జోషిమఠ్‌లో ఇటువంటి ప్రమాదాలు జరగడం భద్రతా పరంగా కూడా చర్చనీయాంశంగా మారింది.

ALSO READ: Tirumala: జల్లికట్టు వేడుకలలో అపశృతి.. తలకాయ పగిలి తీవ్ర స్థితిలో..?

Related News

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

రాత్రి నూడుల్స్.. ఉదయానికి శవాలు.. ఒకే కుటుంబంలో 5 గురు మృతి!

ఈ నెలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఆ రెండు అంశాలపై వాడీ వేడీ రచ్చ!

ఢిల్లీలో వీడని సస్పెన్స్.. అభిజిత్ దీప్కే ఆచూకిపై గందరగోళం.. నేహా బోరా తీవ్ర ఆరోపణలు!

బీజేపీ అగ్రనేతకు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిన ఎల్.కే. అద్వానీ.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే?

స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌ టెన్షన్‌కు ఇక చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం?

ప్రపంచాన్ని సైతం కదిలించిన చరిత్ర.. అక్టోబర్ 17 ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా..?

డేంజర్ బెల్స్.. ఏఐతో భారీగా పర్యావరణం విధ్వంసం.. ఎలానో తెలుసా..?

Big Stories

Advertisement
×