ఇల్లు అందంగా డెకరేట్ చేయాలంటే కేవలం హాల్, ప్రధాన ద్వారమే కాదు. బాత్రూమ్ కూడా అందంగా కనిపించాలి. ఎందుకంటే ఇంటి అందాన్ని పెంచడంలో బాత్రూమ్ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే చాలా ఇళ్లలో చిన్న బాత్రూమ్‌లు ఉండటం వల్ల అవి వస్తువులతో నిండిపోయి త్వరగా ఇరుకుగా, అస్తవ్యస్తంగా కనిపిస్తాయి. వస్తువులు ఎక్కువగా ఉంటే స్థలం మరింత తక్కువగా అనిపిస్తుంది. అయితే బాత్రూమ్‌ను అందంగా, స్టైలిష్‌గా మార్చడానికి పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కొన్ని చిన్న మార్పులతోనే మీ బాత్రూమ్‌కు 5 స్టార్ హోటల్ తరహా లగ్జరీ లుక్ తీసుకురావచ్చు.
బాత్రూమ్ గోడల కలర్స్ మొత్తం వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి. చిన్న బాత్రూమ్‌లలో తెలుపు, బేజ్, లైట్ గ్రే లేదా పాస్టెల్ గ్రీన్ వంటి లైట్ కలర్స్ రంగులను ఉపయోగించడం మంచిది. ఈ రంగులు ఎక్కువ వెలుతురును ప్రతిబింబిస్తాయి. ఫలితంగా బాత్రూమ్ విశాలంగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ముదురు రంగులు వాడితే చిన్న బాత్రూమ్ మరింత ఇరుకుగా కనిపించే అవకాశం ఉంటుంది.
మంచి లైటింగ్ ఉన్న బాత్రూమ్ ఎప్పుడూ శుభ్రంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. లగ్జరీ హోటళ్లలో కూడా లైటింగ్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు. అద్దం చుట్టూ ఎల్‌ఈడీ స్ట్రిప్ లైట్లు అమర్చడం ద్వారా ఆధునిక లుక్ వస్తుంది. మంచి లైటింగ్ గోడల రంగులను మరింత అందంగా చూపించడంతో పాటు బాత్రూమ్‌ను పెద్దదిగా కనిపించేలా చేస్తుంది.
బాత్రూమ్‌లో వస్తువులు చెల్లాచెదురుగా ఉండటం వల్ల అస్తవ్యస్తంగా కనిపిస్తుంది. అందుకే సరైన స్టోరేజ్ క్యాబినెట్ ఏర్పాటు చేయాలి. మీ బాత్రూమ్ పరిమాణానికి సరిపోయే రెడిమేడ్ క్యాబినెట్‌ను ఎంచుకోవచ్చు. టాయిలెట్రీలు, క్లీనింగ్ ప్రొడక్ట్స్, ఇతర వస్తువులను అందులో భద్రపరిస్తే బాత్రూమ్ శుభ్రంగా కనిపిస్తుంది. బాత్రూమ్ క్రమంగా సెట్ చేసి పెడితే అది ఎప్పుడూ లగ్జరీ హోటల్ బాత్రూమ్‌లా అనిపిస్తుంది. వీటికి పెద్దగా ఖర్చు కాదు.
బాత్రూమ్‌లోని ట్యాప్స్, షవర్‌లు, ఇతర ఫిట్టింగ్స్ కూడా అందాన్ని ప్రభావితం చేస్తాయి. సాధారణ ఫిట్టింగ్స్‌కు బదులుగా మ్యాట్ బ్లాక్, బ్రష్డ్ బ్రాస్ లేదా రోజ్ గోల్డ్ ఫినిష్ ఉన్న వాటిని ఉపయోగించవచ్చు. ఇవి కొంచెం ఖరీదైనవి, అయితే బాత్రూమ్‌కు ప్రీమియం లుక్‌ను అందిస్తాయి.
చిన్న బాత్రూమ్‌లకు గ్లాస్ షవర్ పార్టిషన్ చాలా మంచి ఆప్షన్. ఇది తడి, పొడి ప్రాంతాలను వేరు చేస్తుంది. గోడల మాదిరిగా వెలుతురును అడ్డుకోదు కాబట్టి బాత్రూమ్ పెద్దదిగా కనిపిస్తుంది. గ్లాస్ షవర్ డోర్‌ను కూడా ఏర్పాటు చేయవచ్చు. ఇది ఆధునిక, లగ్జరీ ఫీలింగ్ ఇస్తుంది.
Also Read: ఫ్రిజ్ మొత్తం వస్తువులు నింపేస్తున్నారా? దాని వల్ల జరిగే నష్టాలు ఇవే
సాధారణ క్యాబినెట్ తలుపులు తెరవడానికి ఎక్కువ స్థలం అవసరం అవుతుంది. స్లైడింగ్ డోర్ క్యాబినెట్లు మాత్రం తక్కువ స్థలంతో పనిచేస్తాయి. ఇవి బాత్రూమ్‌ను శుభ్రంగా, ఆధునికంగా కనిపించేలా చేస్తాయి. చిన్న బాత్రూమ్‌లకు ఇవి ఉత్తమ ఎంపికగా చెప్పవచ్చు.
లగ్జరీ బాత్రూమ్‌లలో అనవసరమైన వస్తువులు కనిపించవు. అవసరమైన వస్తువులను మాత్రమే బయట ఉంచి, మిగిలిన వాటిని క్యాబినెట్లలో భద్రపరచాలి. శుభ్రమైన నేల.. బాత్రూమ్‌ను పెద్దదిగా, ఆకర్షణీయంగా చూపిస్తాయి.
చిన్న బాత్రూమ్‌ను అందంగా మార్చడానికి భారీ రీనోవేషన్ అవసరం లేదు. లైట్ కలర్స్, మంచి లైటింగ్, స్మార్ట్ స్టోరేజ్, ఆధునిక ఫిట్టింగ్స్, గ్లాస్ పార్టిషన్లు వంటి చిన్న మార్పులతోనే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. తక్కువ ఖర్చుతో మీ బాత్రూమ్‌ను 5 స్టార్ హోటల్ స్థాయి లగ్జరీ స్పేస్‌గా మార్చుకోవచ్చు.