E-Paper
Advertisement

హెయిర్ స్ట్రెయిట్నర్‌ కేవలం హెయిర్ స్టైలింగ్ కోసం కాదు.. ఇంట్లో ఈ పనులు కూడా చేయగలదు

హెయిర్ స్ట్రెయిట్నర్‌ కేవలం హెయిర్ స్టైలింగ్ కోసం కాదు.. ఇంట్లో ఈ పనులు కూడా చేయగలదు
Advertisement

Hair Straightener Uses| హెయిర్ స్టైలింగ్ కోసం చాలా మంది ఇళల్లో హెయిర్ స్ట్రెయిట్నర్‌ ఉపయోగింస్తుంటారు. జుట్టు స్ట్రెయిట్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అయితే హెయిర్ స్ట్రెయిట్నర్‌ తో ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. ఇంట్లో రోజువారీ చిన్న చిన్న పనులకు కూడా హెయిర్ స్ట్రెయిట్నర్‌ బాగా ఉపయోగపడుతుంది. కొన్ని స్మార్ట్ చిట్కాలతో మీరు దీన్ని వేర్వేరు రకాలుగా వినియోగించవచ్చు.

స్నాక్స్ ప్యాకెట్లను సీల్ చేయడం

చిప్స్, డ్రై ఫ్రూట్స్, స్నాక్స్ ప్యాకెట్లు తెరిచి ఉంటే వాటిని సులభంగా సీల్ చేయవచ్చు. ప్యాకెట్ తెరిచిన అంచును స్ట్రెయిట్నర్ ప్లేట్ల మధ్య ఉంచి కొన్ని సెకన్లు ప్రెస్ చేయండి. ఇలా చేస్తే ఆహారం ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది.

బట్టల మీది ముడతలు తొలగించడం

Advertisement

ప్రయాణంలో ఉన్నప్పుడు ఇస్త్రీ చేయడం కష్టం అయితే స్ట్రెయిట్నర్‌ను మినీ ఇస్త్రీలాగా ఉపయోగించవచ్చు. కాలర్, కఫ్స్, బట్టల అంచుల మీది చిన్న ముడతలు తొలగించడానికి ఉపయోగపడుతుంది. ఇందులో టెంపరేచర్ మరీ ఎక్కువ చేయకుండా జాగ్రత్తగా వాడండి.

జుట్టుకు సాఫ్ట్ వేవ్స్ ఇవ్వడం

స్ట్రెయిట్నర్‌తో జుట్ట స్ట్రెయిట్ చేయడంతో పాటు మృదువైన కర్ల్స్ లేదా వేవ్స్ కూడా చేయవచ్చు. జుట్టు చిన్న చిన్న విభాగాలుగా తీసుకుని తిప్పుతూ లైట్‌గా ప్రెస్ చేయండి. ఇది సహజమైన, స్టైలిష్ లుక్ ఇస్తుంది.

అత్యవసరం సమయంలో ఆహారం వేడి చేయడం

Advertisement

అత్యవసర పరిస్థితుల్లో చిన్న మొత్తంలో ఆహారాన్ని ఫాయిల్‌లో చుట్టి స్ట్రెయిట్నర్‌తో వేడి చేయవచ్చు. ఆయిల్ ఎక్కువగా ఉండే ఫుడ్ లేదా తడి ఆహారాలకు ఈ పద్ధతి వాడకండి.

గిఫ్ట్ రిబ్బన్లను రాపింగ్ చేయడం

బంధు, మిత్రులకు మీరు ఇచ్చే కానుకులకు గిఫ్ట్ రిబ్బన్లతో అందంగా రాప్ చేయగలరు. కర్ల్ చేయడానికి స్ట్రెయిట్నర్ ఉపయోగపడుతుంది. రిబ్బన్‌ను ప్లేట్ల మధ్య జార్చి ఒత్తండి. ఇది గిఫ్ట్ ప్యాకింగ్‌ను ప్రొఫెషనల్ లుక్ ఇస్తుంది.

కొవ్వొత్తి మైనం తొలగించడం

కొవ్వొత్తి మైనం కారినప్పుడు దానిపై ఒక గుడ్డ పెట్టి స్ట్రెయిట్నర్‌తో లైట్ హీట్ ఇవ్వండి. మైనం కరిగిన తర్వాత సులభంగా తుడిచేయవచ్చు.

చిన్న వస్తువులను శానిటైజ్ చేయడం

కొన్ని చిన్న చిన్న వస్తువులను శానిటైజ్ చేయడానికి వాటిని కాస్త వేడి చేయడం ద్వారా క్రిములు చనిపోతాయి. అందుకే ఇలాంటి ఉపయోగాల కోసం స్ట్రెయిట్నర్ ప్లేట్లను ఎప్పుడూ శుభ్రంగా ఉంచండి.

Also Read: కిచెన్‌లో మొండి మరకలున్నాయా.. ఇదొక్కటి వేస్తే నిమిషాల్లో క్లీన్..

భద్రతా చిట్కాలు

  • హాట్ ప్లేట్లను నేరుగా తాకకండి
  • నీరు, పిల్లలకు దూరంగా ఉంచండి
  • ప్రతి ఉపయోగం తర్వాత ఆఫ్ చేయండి
  • అసురక్షితమైన వస్తువులపై వినియోగించండి

హెయిర్ స్ట్రెయిట్నర్ ఒక సూపర్ టూల్. జుట్టు స్టైలింగ్ కాకుండా ఇంట్లో అనేక చిన్న పనులకు ఉపయోగపడుతుంది. జాగ్రత్తగా, సురక్షితంగా వాడితే మీ రోజువారీ జీవితం చాలా సులభం అవుతుంది.

Related News

ఖరీదైన ఫేస్‌వాష్ అవసరం లేదు.. కిచెన్‌లో లభించే ఈ ఐటెమ్స్‌తో మీ ఫేస్ డీప్ క్లీన్

పుట్టబోయేది మగబిడ్డ లేదా ఆడబిడ్డ.. హార్ట్‌బీట్‌తో తెలుసుకోవచ్చా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

వయసు మీరుతున్నా ప్రేమలో మాత్రం ఫ్రెష్‌ ఫీలింగ్.. ఈ తేదీల్లో పుట్టినవారు గ్యారంటీ లవర్స్

రోజూ పకోడీలు తిని బోర్ కొడుతోందా? పచ్చి బొప్పాయితో క్రిస్పీ కట్లెట్స్ ట్రై చేయండి

కృష్ణాష్టమికి మీ పాపను రాధమ్మగా ముస్తాబు చేయాలా? ఫొటోషూట్ అందంగా చేయడానికి టిప్స్

మహిళల్లో ఎముకల బలహీనత సమస్య.. మెనోపాజ్‌కు ముందే బలమైన ఎముకల కోసం ఏం చేయాలి?

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

Big Stories

Advertisement
×