E-Paper
Advertisement

Kayadu Lohar : అర్ధరాత్రి వరకు అదే పని.. చాలా కష్టపడ్డ హీరోయిన్..

Kayadu Lohar : అర్ధరాత్రి వరకు అదే పని.. చాలా కష్టపడ్డ హీరోయిన్..
Advertisement

Kayadu Lohar : టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కాయదు లోహర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తమిళ సినిమాలతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగులో వరుసగా సినిమాలు చేసే బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తూ వస్తుంది.. దక్షిణాదిలో ఓవర్ నైట్ స్టార్‌డమ్ సంపాదించిన హీరోయిన్ గా దూసుకుపోతుంది. సౌత్ లో తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్రాగన్ ప్రేక్షకులను పలకరించింది ఆ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ ని దక్కించుకోవడంతో ఆమెకు ఆఫర్లు కూడా క్యూ కట్టాయి.

తెలుగులో రీసెంట్ గా మాస్ హీరో విశ్వక్ సేన్ నటించిన ఫంకీ చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ వస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన గురించి ఎన్నో విషయాలను షేర్ చేసుకుంది. ఆమె గురించి ఆసక్తికర వివరాలను తెలుసుకుందాం..

అర్ధరాత్రి 2 వరకు అదేపని..

Advertisement

డ్యూడ్ మూవీతో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న సాయి అభ్యంకర్.. సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేయడంతో పాటుగా ఆల్బమ్ సాంగ్స్ కూడా చేస్తూ వస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్ సాంగ్స్ ని ఆయన చేశారు.. పవళ మల్లి పేరుతో గత నెలలో ఓ సాంగ్ వచ్చింది. ఇందులోనే సాయికి జోడీగా కాయదు కనిపించింది.. యూట్యూబ్ లో సూపర్ హిట్ అయిన ఆ పాటకు 8 మిలియన్స్ వ్యూస్ ను సొంతం చేసుకోవడం మామూలు విషయం కాదు. ఇందులో అనుకోకుండా ఛాన్స్ వచ్చింది అని హీరోయిన్ కాయదు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.. ఈ పాట షూటింగ్ కోసం దాదాపు అర్ధరాత్రి రెండు గంటల వరకు కూడా చేస్తున్నట్లు ఆమె చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. చాలా కష్టపడ్డారు కాబట్టి ఇప్పుడు మంచి సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు అంటూ నేటిజెన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఇది అయితే హాట్ టాపిక్ గా మారింది.. ఆమె టాలెంట్ కి ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.

Also Read :కొత్త ఇంట్లోకి బాలీవుడ్ స్టార్ కపుల్.. ఎన్ని కోట్లో తెలుసా..?

ప్రస్తుతం కాయదు సినిమాల విషయానికొస్తే.. 

Advertisement

టాలీవుడ్ యంగ్ బ్యూటీ కాయదు లోహర్ వరుసగా సినిమాలో లైన్లో పెట్టుకునేందుకు తెగ ప్రయత్నాలు చేస్తూ వస్తుంది.. డ్రాగన్ చిత్రంతో ఈమె హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది ఆ తర్వాత వరుసగా సినిమాలు క్యూ కడతాయని అందరూ అనుకున్నారు కానీ కాస్త స్లోగానే అవకాశాలు ఆమె దగ్గరకు వస్తున్నాయి. గతంలో నటించిన సినిమాలన్నీ ఒకే ఎత్తు అయితే ఇప్పుడు నేచురల్ స్టార్ నాని తో కలిసి స్క్రీన్ ని షేర్ చేసుకుంటుంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘ ది ప్యారడైజ్’లో హీరోయిన్‌గా చేస్తోంది. ఈమె నటించిన తొలి మలయాళ మూవీ ‘పల్లి చట్టంబి’ ఈ వీకెండే థియేటర్లలోకి వచ్చింది. ప్యారడైజ్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఈ మూవీ గనక హిట్ అయితే ఈమె మరోసారి హిట్ చిత్రాన్ని తన ఖాతాలో వేసుకున్నట్లే..

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×