E-Paper
Advertisement

Smartwatch Side Effects: స్టైలిష్‌గా ఉందని స్మార్ట్‌వాచ్ వాడుతున్నారా.. మరి సైడ్ ఎఫెక్ట్స్ సంగతేంటి?

Smartwatch Side Effects: స్టైలిష్‌గా ఉందని స్మార్ట్‌వాచ్ వాడుతున్నారా.. మరి సైడ్ ఎఫెక్ట్స్ సంగతేంటి?
Advertisement

Smartwatch Side Effects: ప్రస్తుత టెక్ యుగంలో స్మార్ట్‌వాచ్‌లు కేవలం టైం చూసుకోవడానికి మాత్రమే కాకుండా.. ఆరోగ్యం, అలెర్ట్స్ వంటి రోజువారీ కార్యకలాపాలను ట్రాక్ చేసుకోవడానికి ఒక ముఖ్యమైన సాధనంగా మారిన విషయం తెలిసిందే. మన చేతికి ధరించే స్మార్ట్‌వాచ్ రోజూ మనం ఎన్ని అడుగులు వేస్తున్నాం, గుండె స్పందన రేటును పర్యవేక్షించడం, నిద్రను ట్రాక్ చేయడం వంటి అనేక ఫీచర్లను అందిస్తుంది. అయితే, ఆరోగ్య నిపుణులు స్మార్ట్‌వాచ్‌లను ఉపయోగిస్తున్నప్పుడు కొన్ని ముందు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని చెబుతున్నారు. లేదంటే.. ఆరోగ్యాన్ని కాపాడాల్సిన వాచ్‌లే మనకు అనారోగ్య సమస్యలను తెచ్చిపెట్టే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

చర్మ ససమ్యలు రావొచ్చు:

కొంతమంది గంటల తరబడి స్మార్ట్‌వాచ్‌ను ధరిస్తుంటారు. దీనివల్ల ఆ ప్రదేశంలో చర్మానికి గాలి ఆడకపోవడంతో చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు. ఇదివరకే చర్మ ససమ్యలతో ఇబ్బంది పడుతున్నవాళ్లు స్మార్ట్‌వాచ్‌ను బిగుతుగా పెట్టుకోకూడదని చెబుతున్నారు. అలాగే కొందరికి స్మార్ట్ వాచ్‌ల నుంచి వచ్చే రేడియేషన్​ వల్ల కూడా తలనొప్పి లేదా వికారం లాంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

Advertisement

Read Also: నిద్రపోయే ముందు నీళ్లు తాగడం మంచిదా? కాదా?.. ఈ విషయంలో నిపుణులు మాట ఇదే!

నిద్రకు అంతరాయం:

ఆరోగ్యం గురించి అలెర్ట్ చేస్తుందని చాలామంది స్మార్ట్‌వాచ్‌ను ధరించే నిద్ర పోతుంటారు. అయితే ఈ వాచ్ వల్ల నిద్రలేమి సమస్యలు కూడా వస్తాయి అంటున్నారు నిపుణులు. కాబట్టి.. నిద్రపోయే ముందు స్మార్ట్‌వాచ్​ తీసేయడమే ఉత్తమం. నిజానికి స్మార్ట్‌వాచ్​ అనేది ఆరోగ్యాన్ని ట్రాక్ చేసేందుకు ఉపయోగపడు సాధనం. అయితే స్మార్ట్‌వాచ్‌ను అతిగా వాడితే అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంది అని ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు.

కచ్చితత్వం అసవరం:

Advertisement

స్మార్ట్‌వాచ్‌లు నిజానికి స్క్రీనింగ్ సాధనం మాత్రమే. రోగనిర్ధారణ సాధనం కాదని వైద్య నిపుణులు అంటున్నారు. గతంతో.. పోలిస్తే ఫలితాలు మెరుగ్గా అందిచడంలో యాప్‌లు మెరుగయ్యాయని, కానీ మరింత కచ్చితత్వం అవసరమని చెబుతున్నారు. అయితే, స్మార్ట్‌వాచ్‌లు ఆరోగ్య సమస్యల గురించి అలర్ట్‌ చేసినప్పుడు డాక్టర్ వద్దకు వెళ్లి రోగనిర్ధారణ పరీక్షలు చేయించుకుంటే మంచిదని సూచిస్తున్నారు.

Read Also: భరించలేని తలనొప్పి క్షణాల్లో మాయం.. ఐస్ వాటర్‌లో దాగున్న అద్భుత రహస్యమిదే!

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×