E-Paper
Advertisement

Transparent Car: ట్రాన్సపరెంట్ జీప్ చూశారా భయ్యా.. ఇంజిన్‌తో సహా అన్నీ బయటకే కనిపిస్తాయ్!

Transparent Car: ట్రాన్సపరెంట్ జీప్ చూశారా భయ్యా.. ఇంజిన్‌తో సహా అన్నీ బయటకే కనిపిస్తాయ్!
Advertisement

Viral Video: కొన్ని వాహనాలు చాలా వింతగా కనిపిస్తాయి. కేవలం మ్యూజియంలలో ప్రదర్శనకు పెట్టేందుకు వాటిని రూపొందిస్తారు. కానీ, తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ట్రాన్సపరెంట్ జీప్ అద్భుతంగా ఆకట్టుకుంటుంది. Supercar Blondie ఇన్ స్టా పేజీలో పోస్టు చేసిన ఈ వీడియోలో ఫుల్లీ ట్రాన్స్‌ పరెంట్ జీప్ గురించి చూపించారు. ఇది ఆఫ్ రోడ్ హిస్టరీ మ్యూజియంలో ఉన్న ఒక స్పెషల్ జీప్. ఈ జీప్ పనితీరు ఎలా ఉంటుందో బయటకు కనిపించేలా రూపొందించారు. ఇది కేవలం డిస్‌ ప్లే పీస్ మాత్రమే కాదు, చక్కగా నడుస్తుంది కూడా..

బాడీ అంతా బయటకు కనిపించేలా!

ఈ జీప్ పూర్తి పారదర్శక బాడీతో కనిపిస్తుంది. పాలికార్బోనేట్ తో పాటు స్పెషల్ మెటీరియల్‌ తో రూపొందించారు.  ఇంజన్, సస్పెన్షన్, ఇతర పార్ట్స్ అన్నీ కనిపించేలా తయారు చేసింది. ఇది ఆఫ్ రోడ్ టెక్నాలజీని ఎడ్యుకేషనల్‌ గా చూపిస్తుంది. ఇది జీప్ Wrangler స్టైల్‌ లో  కనిపిస్తుంది. కానీ, పూర్తిగా క్లియర్ బాడీతో ఉంటుంది. ఇంజిన్, గేర్‌ బాక్స్, యాక్సిల్స్ అన్నీ విజిబుల్ గా ఉన్నాయి. వీడియోలో ఎక్స్‌ ప్లైన్ చేస్తూ.. ఈ జీప్ ఎలా నడుస్తుందో కూడా చూపించారు. ఇది మ్యూజియం బిల్డ్ అయినా, రోడ్డు మీద కూడా నడవడం విశేషం. భారత్‌ లో ఇలాంటివి చాలా రేర్.

Advertisement

ఇలాంటి జీప్ లు ఎక్కడైనా ఉన్నాయా?

⦿ జీప్ రాంగ్లర్ ట్రాన్స్‌పరెంట్ హుడ్: అమెరికాలో కొంతమంది రాంగ్లర్ ఓనర్లు ఫైబర్‌ గ్లాస్, క్లియర్ ప్లాస్టిక్‌ తో ట్రాన్స్‌ పరెంట్ హుడ్ (బోనెట్) ఫిట్ చేస్తున్నారు. ఇంజన్ బే పూర్తిగా కనిపిస్తుంది. ఇది చాలా రేర్, కస్టమ్ మాత్రమే. అమెరికాలో వీటి సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటుంది.

Advertisement

Read Also: షావోమీ స్మార్ట్ ఫోన్లే కాదండోయ్, అదిరిపోయే ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!

⦿ పూర్తిగా ట్రాన్స్‌ పరెంట్ కాన్సెప్ట్ జీప్: 2018-19లో ఒక రష్యన్ కంపెనీ ‘Transparent Jeep Wrangler’ అనే అనే పూర్తి పారదర్శక బాడీ కాన్సెప్ట్ ను పరిచయం చేసింది. పాలికార్బోనేట్ షెల్ తో రూపొందించారు. కానీ, అది రోడ్ లీగల్ కాదు. షో కారు మాత్రమే.

నెటిజన్లు ఏమంటున్నారంటే?

అటు ఈ వీడియోను చూసి, నెటిజన్లు క్రేజీగా రియాక్ట్ అవుతున్నారు. ఇలాంటి జీప్ లు అందుబాటులోకి వస్తే ఏదైనా సమస్య వస్తే, ఈజీగా గుర్తించే అవకాశం ఉంటుందంటున్నారు. అటు “పెట్రోల్ కొట్టించుకునేటప్పుడు ఎలాంటి మోసాలు జరగవు. ఎందుకంటే.. తక్కువ పోస్తే, ఈజీగా తెలిసిపోతుంది” అని మరికొంత మంది కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

Read Also: బజాజ్ నుంచి సరికొత్త ఈ-రిక్షాలు,వీటి ప్రత్యేకత ఏంటో తెలుసా

Related News

పండుగ షాపింగ్ అంతంతమాత్రమే.. వెనుకడుగు వేస్తున భారతీయులు.. కారణాలివే

మళ్లీ రీఛార్జ్ ధరలు పెంచనున్న జియో.. అంబానీ కీలక వ్యాఖ్యలు

బంగారం సరే.. డబ్బులు ఎలా డబుల్ అవుతాయ్? ఇలా చేస్తే సరి!

భయపెడుతోన్న రూపాయి.. బలపడుతోన్న డాలర్, RBI కళ్లెం వేయగలదా?

పోస్ట్ ఆఫీస్ RDలో నెలకు రూ.6,000 పొదుపు చేస్తే.. 5 ఏళ్లకు ఎంత వస్తుంది?

పండుగ సేల్‌లో 80 శాతం వరకు డిస్కౌంట్.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ బిజినెస్ సీక్రెట్ ఇదే

19 ఏళ్ల యువకుడి అద్భుత సృష్టి.. 3D ప్రింటింగ్ ఐడియాతో.. రూ.7 కోట్లకు పైగా సంపాదన!

అత్తమామల ఇల్లు, ఆస్తిపై కోడలికి హక్కులుంటాయా? భారత చట్టం ఏం చెబుతోందంటే

Big Stories

Advertisement
×