E-Paper
Advertisement

TDP : టీడీపీ, జనసేన ఉమ్మడి పోరాటం.. షాక్‌లో వైసీపీ!

TDP : టీడీపీ, జనసేన ఉమ్మడి పోరాటం.. షాక్‌లో వైసీపీ!
Advertisement

ఏపీ రాజకీయాల్లో కూటమి ముక్కలు కాబోతుందని జోరుగా ప్రచారం సాగుతోంది. టీడీపీ నేతలు జనసేన నేతలకు ప్రయారిటీ ఇవ్వడం లేదని కేవలం ఒక పొత్తు పార్టీగా భావిస్తున్నారని, తద్వారా జనసైనికులు అసహనంతో ఉన్నారని కథనాలు వచ్చాయి. ఈ విషయంపై డీప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం సీరియస్‌గా దృష్టి సారించారని.. తెలుగుదేశం పార్టీ నేతల ఓవరాక్షన్‌ను సీఎం చంద్రబాబు వద్ద ప్రస్తావించి అసహనం వ్యక్తం చేసినట్టు ప్రతిపక్ష పార్టీ సోషల్ మీడియా విభాగం పెద్దఎత్తున ప్రచారం చేసింది. ఇదంతా అవాస్తవం అని కూటమి నేతలు చెబుతున్నారు.

విభజన రాజకీయాలు..

గత ఎన్నికల్లో అధికారానికి దూరమైన జగన్.. మరల అధికారంలోకి వచ్చేందుకు కుటిల రాజకీయాలు మొదలెట్టారని టాక్ నడుస్తున్నది. అందుకే టీడీపీ, జనసేనకు మధ్య చెడిందని దుష్టప్రచారం చేస్తున్నారని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. ఇటీవల జిల్లాల పునర్విభజనలోనూ తెలుగుదేశం పార్టీ లీడర్లకు అనుకూలంగా ఉండే నియోజకవర్గాల ఏర్పాటుకు చంద్రబాబు కృషి చేశారని.. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులకు మాత్రమే మేలు జరుగుతుందని, మిగతా పార్టీల వారికి పెద్దగా అనుకూలంచకపోవచ్చని వైసీపీ ఆరోపిస్తున్నది. ఈ విషయంలో జనసైనికులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు సైతం గుర్రుగా ఉన్నారని.. ఈ విషయాన్నిపవన్ దగ్గర ప్రస్తావించాలని అనుకుంటున్నట్లు ప్రచారం మొదలెట్టింది.

అధికారం కోసం ఎంతకైనా..

Advertisement

వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారంలో రావడమే ధ్యేయంగా జగన్ పావులు కదుపుతున్నాడని.. అందుకే ఏ విషయాన్ని వదలకుండా రాజకీయం చేస్తున్నారని చర్చ జరుగుతున్నది. పెట్టుబడులు, ల్యాండ్ పూలింగ్, ప్రైవేటు కాలేజీల అంశం, సూపర్ సిక్స్, ఆలయాలపై దాడులు ఇలా ఏ విషయాన్ని వదలొద్దని వైసీపీ నేతలు, సోషల్ మీడియా వారియర్స్‌కు జగన్ సూచించినట్టు అధికార పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. అందుకే కూటమిలో చిచ్చు రేపి ప్రభుత్వాన్ని కూలగొట్టాలని జగన్ స్కెచ్ వేశాడని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ, జనసేన పార్టీలు కలిసి జగన్, వైసీపీకి మరోసారి షాక్ ఇచ్చాయి.

Political Funding Report: పార్టీల పైసా వసూల్ ! రెండు తెలుగు రాష్ట్రలో ఏ పార్టీ కలెక్షన్ ఎంతెంత..?

Advertisement

జగన్ ప్రచారం చేయించినట్టుగా తాము విడిపోలేదని, తమ మధ్య ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవని నిరూపించింది. ప్రస్తుతం దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో పూర్తయింది. అయితే, వీలైనంత త్వరగా ఏపీలోనూ ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టాలని జనసేన పార్టీ నేతలు, టీడీపీ నేతలు కేంద్రానికి వినతి పత్రం అందజేసినట్టు తెలుస్తున్నది. ఇరు పార్టీలు విడివిడిగా విజ్ఞప్తి చేసిన ఒకే అంశంలో ఉమ్మడిగా పోరాటం చేస్తున్న సంకేతాలను ప్రతిపక్ష వైసీపీకి పంపినట్టు సమాచారం. జగన్ ఎన్ని డ్రామాలు ఆడినా.. కుటిన రాజకీయాలు చేసినా కూటమి సర్కార్ మరోసారి అధికారంలోకి వస్తుందని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతలు ఇకనైనా చీప్ పాలిట్రిక్స్ ప్లే చేయకుండా జనాల సమస్యల మీద ఫోకస్ చేయాలని, ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని కూటమి నేతలు హితవు పలికినట్టు తెలుస్తున్నది.

Related News

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

ఎవరీ పూల సుబ్బయ్య? వెలిగొండ ప్రాజెక్టుకు ఆయన పేరు ఎందుకు పెట్టారు?

Big Stories

Advertisement
×