Fridge Tips: ప్రిడ్జ్ …కిచెన్ లో ఉండాల్సిన సగం భాగం దీంట్లోనే ఉంటుంది.ప్రిడ్జ్ కి మనమిచ్చే ఇంపార్టెన్స్ అలాంటిది మరి.ముఖ్యంగా కూరగాయలు ఏవి తెచ్చిన ఫస్ట్ చేరాల్సిన చోటు ఇదే.అలా వారానికి సరిపడా కూరగాయలు ఒక రోజే తెచ్చేసి ఇందులో కుక్కేస్తుంటారు.కానీ వండుదామని రెండు రోజుల తర్వాత చూస్తే.. వంకాయలు ఎండిపోయి, బీరకాయలు బోసిపోయి, చిక్కుళ్ళు చిన్నబోయి కనిపిస్తాయి.ఇదేదో సాదా సీదా ప్రిడ్జ్ అనే కాదు ..కాస్ట్లీ ఫ్రిడ్జ్ లలోనూ అదే తంతూ.మరి ఈ తడి సమస్య పోవాలంటే ఏం చేయాలో చూసేద్దామా !
ఒక అద్భుతమైన స్టోరేజ్ హౌస్
దీనికి మీకు కావాల్సింది జస్ట్ ఒక పది రూపాయలు.అదేంటి పది రూపాయలు ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే తడి ఎలా పోతుంది అనుకుంటున్నారా ..పెట్టాల్సింది పది రూపాయలు కాదు. పది రూపాయలని ఖర్చు పెట్టి కొనుక్కొచ్చిన స్పాంజ్ తో..అవును..ఈ స్పాంజ్ తో మీ ఫ్రిజ్‌ను ఒక అద్భుతమైన స్టోరేజ్ హౌస్‌గా మార్చేయవచ్చు మరి.ముందుగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కూరగాయలు పాడవడానికి ప్రధాన కారణం ఫ్రిజ్‌లోని కూల్ నెస్ కాదు.అక్కడ అంతా నిండుకుపోయే తేమ.మనం కూరగాయలను వెజిటబుల్ బాక్స్‌లో పెట్టినప్పుడు, అవి శ్వాసక్రియ ప్రక్రియలో కొంత నీటి ఆవిరిని రిలీజ్ చేస్తాయి. ఫ్రిజ్ లోపల గాలి తక్కువగా ఉండటంతో ఆ తేమ బాక్స్ గోడలకు, కూరగాయల మీద డ్రాప్స్ డ్రాప్స్ గా పేరుకుపోతుంది. ఈ తేమ వల్లే బ్యాక్టీరియా, బూజు (Mold) డెవలప్ అయి కూరగాయలు కుళ్ళిపోయేలా చేస్తాయి.
also read :“నా వైఫ్ మిస్సింగ్”అంటున్న వరుణ్ సందేశ్ ..క్లాప్ కొట్టిన సి. కళ్యాణ్!
అదే మీరు గనుక పాత్రలు కడగడానికి వాడే మామూలు స్పాంజ్ ని ఒక వెజిటబుల్ ట్రేలో ఉంచి అక్కడ గాని పెట్టారంటే అది ఆ డ్రాప్స్ అన్నింటిని లాగేసి వెజిటబుల్స్ చుటూ కాస్త పొడి వాతావరణం ఉండేలా చేస్తుంది.దాంతో మీరు పెట్టిన కూరగాయలు అప్పుడే మార్కెట్ నుండి తెచ్చినంత తాజాగా ఉంటాయి.
ఫ్రిడ్జ్ లోపల ఫ్రెష్
ఈ ట్రిక్ ఉపయోగించాలంటే రాకెట్ సైన్స్ ఏమీ తెలియాల్సిన పనిలేదు. సింపుల్ గా మార్కెట్ నుంచి తెచ్చిన కూరగాయలను శుభ్రం చేసి, తడి లేకుండా ఆరబెట్టి వెజిటబుల్ డ్రాయర్‌లో సర్దుకోవాలి. ఆ తర్వాత ఒకట్రెండు పొడి స్పాంజ్‌లను ఆ బాక్స్ మూలల్లో ఉంచాలి. స్పాంజ్‌ను నేరుగా కూరగాయల మీద పెట్టకుండా పక్కన ఉంచడం వల్ల ఎయిర్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది.దాంతో అవి ప్రిడ్జ్ లోపల ఉన్న తేమని పీల్చుకోవడమే కాకుండా, ఫ్రిజ్‌లో వచ్చే రకరకాల ఆహార పదార్థాల వాసనలను కూడా ఈ స్పాంజ్ గ్రహించేస్తుంది.దాని వల్ల ఫ్రిజ్ తెరిచినప్పుడు వచ్చే ఒకరకమైన వాసనలు ఏవీ రాకుండా ఫ్రిడ్జ్ లోపల ఫ్రెష్ గా ఉంటుంది. ముఖ్యంగా పాలకూర, కొత్తిమీర, పుదీనా వంటి ఆకుకూరలు వాడిపోకుండా ఉండటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.వీటికి తోడు బెండకాయలు జిగురు రాకుండా, క్యారెట్లు మెత్తబడకుండా ఉండాలంటే కూడా ఇదే బెస్ట్ ఆప్షన్.
ఉంచితే మాత్రం అంతే సంగతులు
అయితే ఈ చిట్కా పాటించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా అవసరమండోయ్..స్పాంజ్ తేమను పీల్చుకుని తడిగా మారినప్పుడు, దాన్ని తీసి నీటిని గట్టిగా పిండేసి, ఎండలో ఆరబెట్టి మళ్ళీ ఉపయోగించాలి .అలా కాకుండా అలాగే ఉంచితే మాత్రం అంతే సంగతులు.అలాగే కక్కుర్తి పడి ఇంట్లో ఉన్న ఎదో ఒక స్పాంజ్ తోసేయకూడదు.అలా మంచి స్పాంజ్ లతో కాస్ల్టీ అయిన జిప్‌లాక్ బ్యాగులు లేదా ఎయిర్ టైట్ కంటైనర్లు వాడకుండానే కూరగాయలను ఫ్రెష్‌గా ఉంచుకోవచ్చు.మరి మీ ఇంట్లో కూడా ఈ స్పాంజ్ టెస్ట్ ఒకసారి చేసి చూసేయండి !
also read :సినిమా ఇండస్ట్రీలో అది మారాల్సిందే…నోరు విప్పిన నేషనల్ అవార్డ్ విన్నర్!