Varun Sandesh: వరుణ్ సందేశ్ …ఒకప్పుడు హ్యాపీ డేస్,కొత్త బంగారు లోకం సినిమాలతో మోస్ట్ హాపెనింగ్ హీరోగా ఒక వెలుగు వెలిగిన ఈ లవర్ బాయ్ ఇపుడు రూటు మార్చాడు.ఇప్పటికే పలు సరికొత్త సినిమాలతో పలకరించిన వరుణ్ ఇప్పుడు నా వైఫ్ మిస్సింగ్ అనే ఒక ఇంట్రెస్టింగ్ సైకలాజికల్ థ్రిల్లర్‌తో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు.కొమర మీడియా వర్క్స్ బ్యానర్‌పై ఆహా (aha) ప్రెసెంట్స్ లో శివ కంఠంనేని, ఆర్. వెంకటేశ్వర రావు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.ఇక ఈ మధ్యే నయనం అనే ‘నయనం’ వెబ్ సిరీస్‌తో మంచి పేరు తెచ్చుకున్న స్వాతి ప్రకాష్ మంత్రిప్రగడ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండటం విశేషం.తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగాయి.
గ్రాండ్‌గా ప్రారంభోత్సవం..
ఈ సినిమా ఓపెనింగ్ కి టాలీవుడ్ ప్రముఖులు హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. సీనియర్ ప్రొడ్యూసర్ సి. కళ్యాణ్ గారు తొలి షాట్‌కు క్లాప్ కొట్టగా, నటుడు, ఫిలిం ఛాంబర్ సెక్రటరీ అశోక్ కుమార్ గారు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. జాతీయ అవార్డు గ్రహీత, సీనియర్ దర్శకుడు నీలకంఠ గారు గౌరవ దర్శకత్వం వహించి మూవీ టీమ్ ని ఆశీర్వదించారు.ఇకపోతే ఈ రోజు నుండే సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కావడం విశేషం.
also read :APFDC చైర్మన్‌గా భరత్ భూషణ్..అభినందించిన నటసింహం !
సైకలాజికల్ థ్రిల్లర్‌లో ‘ప్రేమ కథ’!
మాములుగా అయితే థ్రిల్లర్ సినిమాలంటే కేవలం ఇన్వెస్టిగేషన్ మాత్రమే . కానీ, ఈ చిత్రంలో ఒక చక్కటి ప్రేమ కథను అంతర్లీనంగా జోడించినట్లు తెలిపారు దర్శకురాలు స్వాతి ప్రకాష్ . సైకలాజికల్ అంశాలతో సాగే ఈ కథలో వరుణ్ సందేశ్ నటన సరికొత్తగా ఉండబోతోందని సమాచారం. ప్రముఖ రచయిత్రి ఉమర్జీ అనురాధ ఈ చిత్రానికి కథను అందించగా, శ్రీనివాస్ మండల స్క్రీన్‌ప్లే, ఆదిత్య భార్గవ్ డైలాగ్స్ అందిస్తున్నారు.
బలమైన టెక్నికల్ టీమ్..
ఈ సినిమాకు మరో ఎస్సెట్ గా చెప్పుకోవాల్సింది సంగీత దర్శకుడు సాయి కార్తీక్. ఎన్నో హిట్ సినిమాలకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన ఆయన, ఈ థ్రిల్లర్ కోసం ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తారో చూడాలి. ఇక సతీష్ కుమార్ ఎన్.ఎస్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, సాయి బాబు తలారి ఎడిటర్ గా వ్యవహరించబోతున్నాడు
మిస్ అయిన ఆ ‘వైఫ్’ ఎవరు?
సినిమా టైటిల్ “నా వైఫ్ మిస్సింగ్” అని ప్రకటించడంతోనే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ మొదలైంది. సినిమాలో కీలక పాత్రల్లో హాస్య నటుడు ప్రవీణ్, మోహిత్ మరియు జబర్దస్త్ ఫేమ్ సత్య శ్రీ నటిస్తున్నారు. అసలు వరుణ్ సందేశ్ భార్యగా ఎవరు నటిస్తున్నారు? ఆమె ఎలా మిస్ అయింది? అనే సస్పెన్స్ ఎలిమెంట్స్‌ను మూవీ టీమ్ ప్రస్తుతానికి సీక్రెట్ గా ఉంచింది. ఇక ఈ సినిమాకి డిజిటల్ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ సపోర్ట్ ఉండటంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయ్.చూడాలి మరి లవ్ రొమాంటిక్ కామెడీ సినిమాలని వదిలి కంటెంట్ ఓరియంట్ సినిమాలవైపు ఫోకస్ పెట్టిన వరుణ్ సందేశ్ ఈ సినిమాతో ఎలాంటి ఫలితం రాబడతాడో!
also read :అప్పుడు ‘ఆదిపురుష్’.. ఇప్పుడు ‘కల్కి 2’.. అదే తప్పు మళ్ళీ జరుగుతుందా?