Kriti Sanon: ఆడా మగా ఇద్దరు సమానం ..కాని మగవాడు కాస్త ఎక్కువ సమానం అంటాడు రాధాగోపాళం లో బాపు. సమానత్వం గురించి ఎంత ఎవరెంత చెప్పినా, ఎవరేం వాదించినా అదే సొసైటీలో కనిపిస్తుందన్న సంగతి అందరికి తెల్సిందే. అదిగో ఆ విషయాన్నే మరోసారి కుండబద్దలు కొట్టినట్టు చెబుతుంది కృతి సనన్…ఇంతకీ ఈ అమ్మడు ఎవరంటారా ..అదేనండీ 2014లో సుక్కు -మహేశ్ బాబు కాంబోలో వచ్చిన నేనొక్కడినే’ సినిమాతో తొలిసారిగా ఎంట్రీ ఇచ్చిందిగా తనే.
సినిమా బడ్జెట్ తగ్గించాల్సి వస్తే
ఒక మోడల్‌గా ప్రయాణం మొదలుపెట్టి, నేడు బాలీవుడ్‌లో తిరుగులేని స్టార్‌గా, నేషనల్ అవార్డ్ విన్నర్‌గా ఎదిగిన కృతి.. తన కెరీర్‌లో ఫేస్ చేసిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ని ఒక ఇంటర్వ్యూలో ఇలా బయట పెట్టేసింది. సినిమా బడ్జెట్ అనగానే అది కేవలం హీరోల చుట్టూనే తిరుగుతుందని వాపోయింది. ఒక సినిమా హిట్ అవ్వాలంటే హీరో, హీరోయిన్ ఇద్దరు ఒకేలా కష్టపడతారని, రెమ్యూనరేషన్ దగ్గరకు వచ్చేసరికి భూమికి,ఆకాశానికి, ఉన్నంత తేడా ఉంటుందని అసలు విషయం చెప్పుకొచ్చింది. ఒకవేళ సినిమా బడ్జెట్ తగ్గించాల్సి వస్తే, మొదటగా హీరోయిన్ రెమ్యూనరేషన్ నే కట్ చేస్తారని, కానీ హీరోల రెమ్యూనరేషన్ ని మాత్రం అస్సలు ముట్టుకోరని ఆవేదన వ్యక్తం చేసింది.
also read :బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో అరుదైన దృశ్యం.. మోదీని కలిసి మురిసిపోయిన తనికెళ్ల భరణి!
ఛాన్సులు దక్కాలంటే పెద్ద యుద్దమే
ఇక షూటింగ్ సెట్స్ లో హీరో, హీరోయిన్ మధ్య ఎలాంటి వివక్ష ఉంటుందో చెబుతూ తనకి ఎదురైన ఇన్సిడెంట్ ని షేర్ చేసుకుంది. కెరీర్ మొదట్లో ఒక ప్రాజెక్ట్ కోసం తనతో సమానమైన క్రేజ్ ఉన్న హీరోకు లగ్జరీ కార్ పంపించిన మేనేజ్‌మెంట్, తనకు మాత్రం ఒక సాధారణ వెహికల్‌ను పంపారట. ఆ సమయంలోనే తాను ఇండస్ట్రీలో నిలబడాలంటే కేవలం నటన సరిపోదు, ఒక బ్రాండ్‌గా ఎదగాలని డిసైడ్ అయినట్టు తెలిపింది కృతి. ఇక బాలీవుడ్ లో నెపోటిజం ఏ స్థాయిలో ఉంటుందో చెబుతూ ఒక రేంజ్ లో ఫైర్ అయ్యింది.సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్ళకే ఇక్కడ అవకాశాలని, తన లాంటి వారికి (Outsiders) ఛాన్సులు దక్కాలంటే పెద్ద యుద్దమే చేయాలంటూ ఘాటుగా స్పందించింది.ఇక తనని అనుకున్న ఎన్నో పాత్రలు కేవలం నెపోటిజం కారణంగా స్టార్ కిడ్స్ కి వెళ్లిపోయాయని తెలిపింది.
ఇక కృతి కెరీర్ విషయానికి వస్తే .. 2014 ‘హీరోపంతి’ సినిమాతో టైగర్ ష్రాఫ్ జోడీగా బాలీవుడ్ లో అడుగెట్టిన ఈ బ్యూటీ వరుసగా ‘దిల్ వాలే’, ‘బరేలీ కీ బర్ఫీ’, ‘లుకా ఛుప్పి’, ‘మిమీ’ వంటి సినిమాలతో మంచి పేరే తెచ్చుకుంది.ముఖ్యంగా ‘మిమీ’ సినిమాలో ప్రెగ్నెంట్ ఉమెన్ గా కృతి చేసిన యాక్టింగ్ నెక్స్ట్ లెవల్ . అందుకే నేషనల్ అవార్డ్ ఈ బ్యూటి ఇంటికి సగర్వంగా నడిచొచ్చింది.
ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి నిర్మాతగా
ప్రస్తుతం నటనే కాకుండా ‘బ్లూ బటర్ ఫ్లై ఫిలిమ్స్’ (Blue Butterfly Films) అనే ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి నిర్మాతగా సినిమాలు తీస్తుండటం విశేషం. ఇక ఈ మధ్యే కృతి నిర్మించిన ‘తీన్ పత్తి’ రిలీజ్ అయి నెట్‌ఫ్లిక్స్‌లో మంచి పేరే తెచ్చుకుంది. ఇక దీంతో పాటు ఆమె స్కిన్ కేర్ బ్రాండ్ ‘హైఫన్’ (Hyphen) తో బిజినెస్ ఉమెన్‌గా సక్సెస్ అవడం మరో విశేషం. ఇవన్ని ఇలా ఉంటె ఈ మధ్యే వచ్చిన ‘క్రూ’ (Crew) సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కావడం కృతి రేంజ్ ని మరింత పెంచేసింది. ఏది ఏమైనా మేల్ డామినేషన్ ఉన్న సినీ ఇండస్ట్రీలో ఇలా వాయిస్ రైజ్ చేస్తూ అసలు విషయాన్ని చెప్పడం మెచ్చుకోతగ్గ విషయమే!
also read :“నా వైఫ్ మిస్సింగ్”అంటున్న వరుణ్ సందేశ్ ..క్లాప్ కొట్టిన సి. కళ్యాణ్!