E-Paper
Advertisement

బయట ఎండలో తిరిగి ఇంటికి రాగానే ఈ తప్పులు చేస్తున్నారా? ఈ ఆరోగ్య సమస్యలకు కారణాలు ఇవే

బయట ఎండలో తిరిగి ఇంటికి రాగానే ఈ తప్పులు చేస్తున్నారా? ఈ ఆరోగ్య సమస్యలకు కారణాలు ఇవే
Advertisement

వేసవి కాలంలో ఎండలు తీవ్రంగా ఉంటాయి. బయట ఎండలో తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత శరీరం చాలా వేడిగా ఉంటుంది. డీహైడ్రేషన్, అలసట, కళ్లు తిరగడం, మైకం వంటి సమస్యలు ఎక్కువవుతాయి. ఈ సమయంలో కొన్ని చిన్న తప్పులు చేయడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుంది. ఈ తప్పులను నివారించడం ద్వారా వేసవిలో ఆరోగ్యంగా ఉండవచ్చు.

ఇంటికి వచ్చిన వెంటనే చల్లని నీళ్లు తాగకండి

ఎండలో తిరిగి వచ్చిన వెంటనే ఫ్రిజ్ నీళ్లు తాగడం చాలా మందికి అలవాటు. కానీ హఠాత్తుగా చల్లని నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది. తలనొప్పి, గొంతు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సాధారణ లేదా కొద్దిగా చల్లని నీళ్లు నెమ్మదిగా తాగండి.

వెంటనే చల్లనీటితో స్నానం చేయకూడదు

Advertisement

ఎండలో నుంచి వచ్చిన వెంటనే చల్లని నీటితో స్నానం చేయడం వల్ల రక్త ప్రసరణకు అంతరాయం కలుగుతుంది. శరీరం వేడిగా ఉన్న సమయంలో ఇలా చేస్తే అలసట, మైకం వచ్చే అవకాశం ఉంది. కొంతసేపు విశ్రాంతి తీసుకుని, శరీరం చల్లబడిన తర్వాత స్నానం చేయండి.

ఎయిర్ కండీషనర్ కింద నేరుగా కూర్చోకండి

ఎండలో తిరిగి ఇంట్లోకి రాగానే వేడిగా ఉన్న శరీరంతో ఏసీ కింద కూర్చోవడం వల్ల హఠాత్తుగా ఉష్ణోగ్రతలో మార్పుల వల్ల జలుబు, తలనొప్పి, కండరాల నొప్పులు వస్తాయి. ముందు సాధారణ గదిలో కూర్చుని శరీరం చల్లబడేలా చూడండి.

టీ లేదా కాఫీ తాగకండి

Advertisement

ఇంటికి వచ్చిన వెంటనే టీ లేదా కాఫీ తాగడం వల్ల డీహైడ్రేషన్ పెరుగుతుంది. అంటే శరీరంలో నీరు తగ్గిపోతుంది. కెఫీన్ శరీరంలోని నీటిని ఎక్కువగా వెళ్లగొట్టి వేడిని పెంచుతుంది. అందుకే టీ, కాఫీ బదులు నీళ్లు, నారింజ జ్యూస్, లేదా కొబ్బరి నీళ్లు తాగండి.

నీటి అవసరాన్ని నిర్లక్ష్యం చేయకండి

వేసవిలో చాలా చెమట పట్టడం వల్ల శరీరం.. నీరు ఎక్కువగా కోల్పోతుంది. తగినంత నీళ్లు తాగకపోతే అలసట, మైకం, తలనొప్పి వస్తాయి. రోజంతా క్రమం తప్పకుండా నీళ్లు తాగండి.

మసాలా, నాన్ వెజ్ ఆహారం మితంగా చేయాలి

ఎండలో నుంచి వచ్చిన వెంటనే నూనెలు, మసాలాలు, మాంసాహారం ఎక్కువగా ఉన్న భోజనం చేయడం జీర్ణక్రియను దెబ్బతీస్తుంది. తేలికపాటి ఆహారం లేదా పండ్లు తినండి.

చెమటలు పట్టిన బట్టలు మార్చకుండా ఉండకండి

చెమటలు పట్టిన బట్టలు శరీరంపై ఉంచడం వల్ల చర్మ సమస్యలు, దుర్వాసన వస్తాయి. ఇంటికి వచ్చిన వెంటనే శుభ్రమైన, ఫ్రెష్ బట్టలు మార్చుకోండి.

Also Read: చాణక్య నీతి.. స్త్రీలో ఈ గుణాలుంటేనే ఇంట్లో సుఖ, సంతోషాలు

మళ్లీ ఎండలోకి వెళ్లకండి

కొంతసేపు చల్లబడిన వెంటనే మళ్లీ ఎండలోకి వెళ్లడం వల్ల అలసట, డీహైడ్రేషన్ పెరుగుతాయి. మధ్యాహ్నం ఎండలో అవసరం లేని పనులు చేయకండి.

Related News

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

Big Stories

Advertisement
×