E-Paper
Advertisement

Fatty Liver Signs: మీ కాలేయం ఆరోగ్యంగా ఉందో లేదో మీ చేతులే చెప్తాయ్.. ఈ 5 లక్షణాలు చెక్ చేసుకోండి

Fatty Liver Signs: మీ కాలేయం ఆరోగ్యంగా ఉందో లేదో మీ చేతులే చెప్తాయ్.. ఈ 5 లక్షణాలు చెక్ చేసుకోండి
Advertisement

Fatty Liver Signs: ప్రస్తుత లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్ల వల్ల నేడు చాలామందిని వేధిస్తున్న సమస్య ‘ఫ్యాటీ లివర్’. కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల వచ్చే ఈ సమస్య ప్రారంభంలో ఎలాంటి నొప్పులను కలిగించదు. అందుకే దీనిని ‘సైలెంట్ కిల్లర్’ అని పిలుస్తారు. అయితే.. మన శరీరంలోని అంతర్గత మార్పులు బాహ్యంగా కొన్ని అవయవాల ద్వారా వ్యక్తమవుతాయి. ముఖ్యంగా మీ చేతులు, అరచేతులు కాలేయ పనితీరు గురించి స్పష్టమైన సంకేతాలను ఇస్తాయి. ఈ  లక్షణాలను ముందుగానే గుర్తించడం ద్వారా కాలేయం దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు.

మీ చేతులు ఫ్యాటీ లివర్ గురించి ఏం చెబుతున్నాయి ?

Advertisement

కాలేయం మన శరీరంలో అతిపెద్ద రసాయన ఫ్యాక్టరీ వంటిది. ఇది విషపూరిత పదార్థాలను బయటకు పంపడమే కాకుండా.. జీర్ణక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. కాలేయం చుట్టూ కొవ్వు అధికంగా చేరినప్పుడు అది తన సహజ పనితీరును కోల్పోతుంది. ఆ సమయంలో చేతులపై కనిపించే కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఇక్కడ ఉన్నాయి.

1.అరచేతులు ఎర్రబడటం:
ఫ్యాటీ లివర్ లేదా లివర్ సిర్రోసిస్ ఉన్నవారిలో అరచేతులు వింతగా ఎర్రగా మారుతాయి. ముఖ్యంగా అరచేతి కింద ఉండే మెత్తని భాగం (బొటనవేలి కింద , చిటికెన వేలి కింద ఉండే ప్రదేశం) ఎర్రటి రంగులోకి మారుతుంది. దీనిని ‘లివర్ పామ్స్’ అని కూడా అంటారు. రక్తంలో హార్మోన్ల అసమతుల్యత వల్ల రక్తనాళాలు వ్యాకోచించడం వల్ల ఇలా జరుగుతుంది.

Advertisement

2.వేళ్ల చివరలు ఉబ్బడం:
మీ వేళ్ల చివరలు వెడల్పుగా మారి, గోర్లు వంగినట్లు (డ్రమ్ స్టిక్స్ లాగా) కనిపిస్తున్నాయా? దీనిని ‘క్లబ్బింగ్’ అంటారు. కాలేయం సరిగ్గా పనిచేయకపోవడం వల్ల రక్తంలో ఆక్సిజన్ సరఫరాలో మార్పులు వచ్చి వేళ్ల కణజాలం ఉబ్బుతుంది. ఇది దీర్ఘకాలిక కాలేయ వ్యాధికి సంకేతం.

3.చేతులపై దురద:
కాలేయం పాడైతే పిత్తాశయ రసాలు రక్తంలో కలిసిపోతాయి. దీనివల్ల అరచేతులు, అరికాళ్ళలో విపరీతమైన దురద వస్తుంది. ఎంత గోకినా ఈ దురద తగ్గదు. రాత్రిపూట ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది.

4. వణుకు పుట్టే చేతులు:
కాలేయం రక్తాన్ని శుద్ధి చేయలేనప్పుడు, శరీరంలో అమ్మోనియా వంటి విషపదార్థాలు పేరుకుపోతాయి. ఇది మెదడుపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల మీరు చేతులను ముందుకు చాచినప్పుడు అవి అదుపులేకుండా వణుకుతాయి. దీనిని ‘లివర్ ఫ్లాప్’ అని పిలుస్తారు. ఇది ఫ్యాటీ లివర్ తదుపరి దశలకు చేరుకుందని సూచిస్తుంది.

Also Read: నడుము నొప్పికి అసలు కారణం ఇదేనా? ప్రమాదకరమైన వ్యాధులను గుర్తించే వన్ మినిట్ గైడ్

5. గోళ్ల రంగులో మార్పు:
ఆరోగ్యకరమైన గోర్లు గులాబీ రంగులో ఉంటాయి. కానీ కాలేయ సమస్యలు ఉన్నవారిలో గోర్లు తెల్లగా మారి, చివరన కేవలం ఒక చిన్న ఎర్రటి లేదా గోధుమ రంగు గీత కనిపిస్తుంది. దీనిని ‘టెర్రీస్ నెయిల్స్’ అంటారు. కాలేయంలో కొవ్వు పెరిగి వాపు రావడం వల్ల ఈ మార్పు సంభవిస్తుంది.

ఏం చేయాలి ?

మీ చేతులపై పై లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ని సంప్రదించి ‘లివర్ ఫంక్షన్ టెస్ట్’ (LFT) లేదా అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకోవడం మంచిది. ఫ్యాటీ లివర్ ప్రారంభ దశలో ఉంటే తినే ఆహారంలో మార్పులు, క్రమం తప్పని వ్యాయామం, బరువు తగ్గడం ద్వారా దీనిని పూర్తిగా నయం చేసుకోవచ్చు.

Related News

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

Big Stories

Advertisement
×