E-Paper
Advertisement

Horror Documentary ott : ప్రపంచంలోనే మోస్ట్ హారర్ డాక్యుమెంటరీలు ఇవే… ఒక్కసారి చూస్తే జన్మలో మర్చిపోలేరు భయ్యా

Horror Documentary ott : ప్రపంచంలోనే మోస్ట్ హారర్ డాక్యుమెంటరీలు ఇవే… ఒక్కసారి చూస్తే జన్మలో మర్చిపోలేరు భయ్యా
Advertisement

Horror Documentary ott : హారర్ మూవీలు చూసి భయపడతారా? అయితే ఇవి అంతకు మించిన డాక్యుమెంటరీలు. ఈ నిజ జీవిత కథలను ఒక్కసారి చూస్తే జన్మలో మర్చిపోలేరు. గుండె ధైర్యం ఉంటే మాత్రమే చూడండి. ట్రైలర్ లింక్ చూస్తేనే ఆమడ దూరం పారిపోతారు. ఇక ఓటీటీలో అందుబాటులో ఉన్న ఈ భయంకర డాక్యుమెంటరీలపై ఓ లుక్ వేద్దాం పదండి.

1. Wrinkles the Clown (2019)

ఇది పిల్లలను భయపెట్టడానికి డబ్బు తీసుకునే ఒక వ్యక్తి కథ. ఇది వింతగా అనిపించవచ్చు. ఇది నిజమే అతని పేరు Wrinkles the Clown. అల్లరి చేసే పిల్లలను భయపెట్టడానికి తల్లిదండ్రులు ఇతనిని అద్దెకు తీసుకోవచ్చనే ప్రచారం కూడా జరిగింది. అయితే, ఇంటర్నెట్‌లో వైరల్ అయిన వీడియోలన్నీ ముందుగానే ప్లాన్ చేసి చిత్రీకరించినవి. షార్ట్ కట్ లో చెప్పాలంటే, రింకిల్స్ ఒక వ్యక్తి సృష్టించిన భయంకరమైన కల్పిత పాత్ర. అతను నిజంగానే వీధుల్లో కనిపిస్తాడు కానీ వీడియోల్లో చూపించినంత క్రూరుడు కాదు. ఇది ఇంటర్నెట్ కల్చర్, పేరెంటింగ్ ఫియర్ గురించి ఒక భయంకర డాక్యు. Netflixలో ఇది అందుబాటులో ఉంది.

2. There’s Something Wrong With Aunt Diane (2011)

Advertisement

36 ఏళ్ల డయాన్ అనే మహిళ తన కారులో ఐదుగురు పిల్లలతో ప్రయాణిస్తుండగా, హైవేపై Wrong Wayలో దాదాపు రెండు మైళ్లు డ్రైవ్ చేసి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డయాన్, ఆమె రెండేళ్ల కూతురు, ఆమె ముగ్గురు మేనకోడళ్లు , ఎదురుగా వస్తున్న కారులోని ముగ్గురు వ్యక్తులు.. మొత్తం 8 మంది చనిపోయారు. డయాన్ తో పాటు, ఐదేళ్ల కొడుకు బ్రియాన్ మాత్రమే తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఆమె కారులో మత్తు పదార్థాలు దొరికినా, ఆమెకు ఆ అలవాటు లేదని కుటుంబ సభ్యులు చెప్పడంతో ఈకేసు చాలా క్రిటికల్ గా మారింది. YouTube, Prime Videoలో దొరుకుతుంది.

3. The Man With 1000 Kids (2024)

ఒక డచ్ యూట్యూబర్ జోనాథన్ జాకబ్ మేయర్ ప్రపంచవ్యాప్తంగా వందలాది మంది బిడ్డలకు బయోలాజికల్ ఫాదర్ అయ్యాడు. స్పెర్మ్ డొనేషన్ ద్వారా ఇది ఎలా జరిగింది? ఎథిక్స్, చట్టం, మోసం గురించి భయంకర నిజాలు ఇందులో చూపించడం జరిగింది. Netflixలో ఇప్పుడు స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంది.

4. The Imposter (2012)

Advertisement

ఇది 2012లో వచ్చిన ఒక బ్రిటిష్ డాక్యుమెంటరీ చిత్రం. ఇది 1990లలో జరిగిన ఒక నిజ జీవిత వింత సంఘటన ఆధారంగా రూపొందింది. 1994లో టెక్సాస్‌కు చెందిన 13 ఏళ్ల నికోలస్ బార్క్లే అనే బాలుడు మిస్సింగ్ అవుతాడు. మూడున్నర ఏళ్ల తర్వాత, స్పెయిన్‌లో ఒక యువకుడు వచ్చి తానే నికోలస్ అని ఆ కుటుంబానికి చెప్తాడు. కాని అతను నికోలస్ కాదు. ఆతరువాత ఏం జరిగిందనేదే మిగతా కథ ఇది Netflixలో అందుబాటులో ఉంది.

5. The Cannibal That Walked Free (2007)

ఇస్సేయ్ సగావా అనే జపానీస్ నరభక్షకుడు ఒక అమ్మాయిని చంపి తిన్నాడు. కానీ చట్టం లోపాల వల్ల జైలు శిక్ష పడకుండా తప్పించుకున్నాడు. తర్వాత సెలబ్రిటీ కూడా అయ్యాడు. ఈ డాక్యు సమాజం ఎలా సెన్సేషన్‌ను సెలబ్రేట్ చేస్తుందో భయంకరంగా చూపిస్తుంది. YouTubeలో ఇది దొరుకుతుంది.

Read Also : ‘డేర్ డెవిల్’ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… సీజన్ 2 అప్డేట్… ఏ ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ కానుందంటే ?

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×