E-Paper
Advertisement

Uric Acid Symptoms: మీ శరీరంలో ఈ 5 మార్పులు కనిపిస్తే.. వెంటనే అలర్ట్ అవ్వండి !

Uric Acid Symptoms: మీ శరీరంలో ఈ 5 మార్పులు కనిపిస్తే.. వెంటనే అలర్ట్ అవ్వండి !
Advertisement

Uric Acid Symptoms: మన శరీర అనేక వ్యర్థాలను ఉత్పత్తి చేస్తుంది. వీటిని కిడ్నీలు ఫిల్టర్ చేస్తాయి. యూరిక్ యాసిడ్ వీటిలో ఒకటి. శరీరంలోని ప్యూరిన్ ప్రోటీన్ల విచ్ఛిన్నం ద్వారా యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. తర్వాత కిడ్నీలు దానిని ఫిల్టర్ చేస్తాయి. అయితే.. కొన్నిసార్లు శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి.

Advertisement

యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగినప్పుడు లేదా కిడ్నీల దానిని సరిగ్గా ఫిల్టర్ చేయలేనప్పుడు, అది శరీరంలో పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ఈ పరిస్థితిని హైపర్‌యూరిసెమియా అంటారు. అయితే.. ఈ పరిస్థితిని కొన్ని సంకేతాల (హై యూరిక్ యాసిడ్ లక్షణాలు) సహాయంతో గుర్తించవచ్చు. ఇది సకాలంలో దానిని నియంత్రించడంలో సహాయ పడుతుంది. ఇంతకీ శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

యూరిక్ యాసిడ్ పెరిగిందని తెలిపే లక్షణాలు: 

Advertisement

కీళ్ల నొప్పి, వాపు:

యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల కలిగే అత్యంత సాధారణ లక్షణం తీవ్రమైన కీళ్ల నొప్పి , వాపు. దీనిని గౌట్ అని పిలుస్తారు. యూరిక్ యాసిడ్ స్ఫటికాలు కీళ్లలో పేరుకుపోయినప్పుడు.. అది అకస్మాత్తుగా.. తీవ్రమైన నొప్పి, ఎరుపు , దృఢత్వాన్ని కలిగిస్తుంది. ఈ నొప్పి సాధారణంగా బొటనవేలులో ప్రారంభమవుతుంది. కానీ మోకాలు, చీలమండల, వేళ్లలో కూడా సంభవించవచ్చు.

మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి:

యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగినప్పుడు.. కిడ్నీలు దానిని పూర్తిగా ఫిల్టర్ చేయ లేకపోతాయి. దీని వల్ల అది స్ఫటికాల రూపంలో మూత్ర నాళంలో పేరుకు పోతుంది. దీని వల్ల నొప్పి, మంట లేదా తరచుగా యూరిన్ రావడం వంటివి జరగుతాయి. కొన్నిసార్లు, యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. ఇది తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది.

అలసటగా, బలహీనంగా అనిపించడం:

యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడం వల్ల కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది అలసటకు దారి తీస్తుంది. అంతేకాకుండా.. కీళ్ల నొప్పులు , వాపు కూడా శక్తి లేక పోవడానికి దారి తీస్తుంది.

Also Read: మీరు ఈ లిస్ట్‌లో ఉన్నారా? అయితే గ్రీన్ టీ తాగడం వెంటనే ఆపేయండి!

చర్మంపై దద్దుర్లు లేదా దురద:

కొన్ని సందర్భాల్లో.. యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడం వల్ల చర్మంపై దద్దుర్లు లేదా దురద వస్తుంది. యూరిక్ యాసిడ్ స్ఫటికాలు చర్మం కింద పేరుకుపోయినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఇది సాధారణంగా వేళ్లు, చెవులు లేదా మోచేతుల చుట్టూ కనిపిస్తుంది.

అధిక రక్తపోటు, కిడ్నీ సమస్యలు:

దీర్ఘకాలికంగా పెరిగిన యూరిక్ యాసిడ్ స్థాయిలు రక్త నాళాలు, కిడ్నీలపై ఒత్తిడిని కలిగిస్తాయి. అధిక రక్తపోటు, కిడ్నీలు దెబ్బతినే ప్రమాదాన్ని పెంచుతాయి. కిడ్నీల పనితీరు సరిగా లేకపోవడం వల్ల మూత్ర విసర్జన తగ్గడం, కాళ్ళలో వాపు, శరీరంలో విష పదార్థాలు పేరుకుపోవడం జరుగుతుంది.  ఇలాంటి సమయంలో కిడ్నీలు దెబ్బతినే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి.

Related News

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

ఒక్క పన్ను పీకడానికి రూ.2.25 లక్షలా.. అదే ఇండియాలో అయితే?

డెస్క్ జాబ్ చేస్తున్నారా? ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

తగ్గేదెలే.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆత్మగౌరవం విషయంలో అసలు రాజీపడరు

స్కూల్‌కు వెళ్లే సమయం అయినా పిల్లలు నిద్రలేవడం లేదా? ఈ 5 టిప్స్‌తో మార్నింగ్ రొటీన్ మార్చండి

గుండెపోటు ముప్పును 30 శాతం తగ్గించగల పిల్.. తాజా అధ్యయనంలో అద్భుత ఫలితాలు

వర్షాకాలంలో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఈ పుడ్స్

రక్తంలో చక్కెర పెరగకుండా ఉండాలంటే ఆపిల్ తినాలా? పియర్ తినాలా?

Big Stories

Advertisement
×