Parenting Tips for Unmotivated Teenagers| టీనేజ్ (13 నుంచి 19 వయసు గల వారు) పిల్లలు భవిష్యత్తు గురించి అశ్రద్ధగా ఉంటే, చదువుని నిర్లక్ష్యం చేస్తే వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతారు. భవిష్యత్తు పట్ల టీనేజర్లు స్పష్టమైన లక్ష్యాలు లేకపోవడం తల్లిదండ్రులపై మానసిక ఒత్తిడి కలిగిస్తుంది. ఈ పరిస్థితి ఎంతో కష్టంగా అనిపించినా, నిపుణులు దీనికి సానుకూలంగా మార్గనిర్దేశం చేయడానికి సరళమైన మార్గాలను సూచిస్తున్నారు. టీనేజ్ పిల్లలు ఒత్తిడి కాకుండా మద్దతు కావాలి.
టీనేజ్ వయసులో పిల్లలు భావోద్వేగ, మానసిక మార్పుల దశలో ఉంటారు. భవిష్యత్తు గురించి గందరగోళానికి గురికావచ్చు. కొంతమంది పిల్లలు సరైన దిశానిర్దేశం లేకపోవడం వల్ల లేదా ఒత్తిడి వల్ల అశ్రద్ధగా ప్రవర్తిస్తారు. వారి భావాలను అర్థం చేసుకుంటే తల్లిదండ్రులు వారి కోసం సరైన నిర్ణయాలు తీసుకోగలరు. పిల్లలు భావోద్వేగంగా ఉంటే వారి పట్ల ఓర్పుతో ప్రవర్తించాలి. వారికి తప్పు ఒప్పు గురించి నేర్పించాలి.
టీనేజ్ పిల్లలతో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారితో క్రమం తప్పకుండా మాట్లాడాలి. అయితే వారిపై మీ నిర్ణయాలను బలవంతంగా రుద్దకండి. మాట్లాడేటప్పుడు వారి అభిప్రాయాలు, కష్టాల గురించి బాగా వినండి, వాటి అర్థం చేసుకున్న తరువాతే మాట్లాడండి. పిల్లలు తాము సురక్షితంగా ఉన్నామని భావిస్తేనే, అర్థం చేసుకున్నట్లు అనిపిస్తేనే మనసువిప్పి మాట్లాడుతారు. వెంటనే పరిష్కారాలు చెప్పకండి.
ఇంట్లో చిన్న చిన్న బాధ్యతలు అప్పగించండి. సమయ నిర్వహణ, ఇంటి పనులు లేదా సాధారణ నిర్ణయాలు తీసుకోవడం వంటివి వారికి అప్పగించండి. ఇది నెమ్మదిగా క్రమశిక్షణ, బాధ్యతను పెంచుతుంది. బాధ్యత నేర్చుకోవడం వల్ల వారు భవిష్యత్తు గురించి సీరియస్‌గా ఆలోచించడం ప్రారంభిస్తారు.
పిల్లలతో కలిసి చిన్న, చిన్న లక్ష్యాలు నిర్ణయించండి. మరీ పెద్ద ఆశయాలు సాధించాలనే ఒత్తిడి చేయకండి. చిన్న లక్ష్యాలు సాధించడం సులభం, ప్రేరణ ఇస్తాయి. లక్షాయలు పూర్తి చేస్తే వారితో కలిసి సక్సెస్ ఎంజాయ్ చేయండి. ఇలా చేస్తే వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
అకాడమిక్ మార్కులు మాత్రమే పిల్లల టాలెంట్‌కు నిదర్శనం కాదు. వారి సంభాషణ నైపుణ్యం, సృజనాత్మకత, సమస్యను పరిష్కరించ గలిగే నైపుణ్యాలను ప్రోత్సహించండి. ఈ నైపుణ్యాలు నిజ జీవితంలో వారిని విజయవంతులను చేస్తాయి. వారిలో ఆత్మవిశ్వాసం, స్వాతంత్ర్యాన్ని పెంచుతాయి.
తల్లిదండ్రులు అధికంగా ఒత్తిడి చేస్తే పిల్లలు చదువు పట్ల ఆసక్తి కోల్పోయే ప్రమాదముంది. దీంతో వారిలో భయం లేదా తిరుగుబాటును కలిగిస్తుంది. వారిని కంట్రోల్ చేయాలిని ఆలోచించకుండా సరిగా మార్గనిర్దేశం చేయండి. పిల్లలపై మీ బలవంతంగా రుద్దడం కంటే వారికి మద్దతు ఇస్తే వారు తప్పుడు నిర్ణయాలు తీసుకోరు.
పిల్లలు తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటారు. క్రమశిక్షణ, కష్టపడి పని చేయడం, సానుకూల అలవాట్లు మీ జీవితంలో చూపించండి. మీ చర్యలు మీ మాటల కంటే ఎక్కువ ప్రభావం చూపుతాయి.
పిల్లలు తమ ఆసక్తులను అన్వేషించేలా చేయండి. వారి హాబీలు, క్రీడలు, కళలు లేదా కొత్త నైపుణ్యాల ద్వారా వారు తమ అభిరుచిని కనుగొనవచ్చు. దీంతో వారు జీవితంలో సరైన దిశను గుర్తించగలరు.
రోజువారీ షెడ్యూల్‌ను సమతుల్యంగా ఉంచడానికి సహాయం చేయండి. చదువు, వినోదం, విశ్రాంతి మధ్య సమతుల్యత నేర్పండి. మంచి సమయ నిర్వహణ ఉంటే ఉత్పాదకతను పెంచుతుంది.
టీనేజ్ పిల్లలు తమ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఒత్తిడికి గురవుతారు. వారి భావాలను గుర్తించి, మద్దతు ఇవ్వండి. వారి భావాలను తిరస్కరించకండి. నమ్మకం, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
Also Read: పురుషుల్లో జుట్టు రాలే సమస్యకు ఇదే కారణం.. బైక్ రైడింగ్ చేసేవారు జాగ్రత్త
కొన్నిసార్లు పిల్లలకు కౌన్సెలింగ్ అవసరం. తీవ్రమైన అశ్రద్ధ లేదా ఒత్తిడి కనిపిస్తే సరైన నిపుణుడిని (సైకాలజిస్ట్) సంప్రదించండి. కౌన్సెలింగ్‌తో వారికి సరైన దిశ, ప్రేరణ లభిస్తుంది.