E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode April 16th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్న్న దీప ఫోన్ లో తిట్టడం అందరూ విని షాక్ అవుతారు   

Karthika Deepam 2 Serial Today Episode April 16th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్న్న దీప ఫోన్ లో తిట్టడం అందరూ విని షాక్ అవుతారు   
Advertisement

Karthika Deepam 2  serial today Episode: కాంచన వెటకారంగా తనకు వచ్చిన కల గురించి చెప్తుంటే.. కార్తీక్‌ వెటకారంగా దీపతో పాటు జ్యోత్స్నకు కూడా తాళి కట్టి అంటూ ఏదో చెప్పబోతుంటే.. దీప కోపంగా చూస్తూ లోపలికి వెళ్లిపోతుంది. దీంతో కార్తీక్‌ దీపను పిలిచినా ఆగకుండా వెళ్లిపోతుంది. దీంతో శ్రీధర్‌ ఇవన్నీ కాపురంలో కామనేలే అక్కడ గంగానది పొంగిపోతుంటుంది వెళ్లి ఆపు అని చెప్పగానే.. కార్తీక్‌ నువ్వు మరోసారి మా ఇంటికి రాకు మాష్టారు.. ఎక్కడైనా అత్తగారి వల్ల గొడవలు జరుగుతాయి. ఇక్కడ మామ వల్ల జరుగుతున్నాయి అంటూ వెళ్లిపోతాడు. బయట పెరట్లో నిలబడిన దీప ఏడుస్తూ ఉంటుంది. కార్తీక్‌ వెళ్లి చూసి గంగానది గట్టిగానే కారుతుంది అని మనసులో అనుకుంటూ వెళ్తాడు.  దీపను ఓదార్చాలని చూస్తాడు.

దీప మాత్రం కోపంగా ఏడుస్తూనే కార్తీక్‌ను తిడుతుంది. జ్యోత్స్న చాలెంజ్‌ చేసింది మీ అమ్మకు కల వచ్చింది. కానీ నువ్వు జ్యోత్స్న మెడలో తాళి కడతాను అనడం ఏంటి..? అనగానే.. నేను కడతాను అనలేదు.. కడతానా..? అన్నాను.. ఈ భూ ప్రపంచం మొత్తం వెతికి దానికి ఎవడినో ఒకడిని మొగుణ్ని చేస్తాను అని కార్తీక్‌ చెప్పగానే.. అదేదో నువ్వే అయ్యేలా ఉన్నావు అంటుంది దీప. దీంతో కార్తీక్‌ షాక్‌ అవుతాడు. ఈసారి మళ్లీ దాని నోటి నుంచి నిన్ను పెళ్లి చేసుకుంటాను అనే మాట రానివ్వు చాలా పెద్ద గొడవ అవుతుంది అంటూ వార్నింగ్‌ ఇవ్వగానే.. కార్తీక్‌ మాత్రం నువ్వు ఎవరితోనూ గొడవ పెట్టుకోకు.. జ్యోత్స్నకు నువ్వు కాస్త దూరంగా ఉండు అని చెప్పగానే.. ఒకవేళ అది నీకోసం మన ఇంటికే వస్తే.. అని దీప అడగ్గా మన వాకిట్లోకి కూడా అడుగుపెట్టనివ్వను అంటూ కార్తీక్‌ చెప్తుండగానే.. బయటు శివనారాయణ, పారిజాతం, జ్యోత్స్న, దశరథ, సుమిత్ర పూలు, పండ్లు స్వీట్లు తీసుకుని కాంచన ఇంటికి వస్తారు.

Advertisement

శ్రీధర్‌ అందరినీ చూసి ఆశ్చర్యపోతాడు. కాంచనను పిలుస్తాడు. కాంచన వచ్చి అందరినీ ప్రేమతో పలకరిస్తూ.. ఏంటివి పూలు, పండ్లు స్వీట్లు తీసుకొచ్చారు అని అడుగుతుంది. దీంతో జ్యోత్స్న అవును అత్తయ్య మీరంటే మాకు స్పెషల్‌ కదా అనగానే.. సుమిత్ర భయంగా మనసులో చూస్తుంటే.. జ్యోత్స్నను కార్తీక్‌కు చేసుకోమని అడగడానికి వచ్చినట్టు ఉన్నారు.. అనుకుంటుండగానే.. దశరథ నా అల్లుడేడి అమ్మా అంటాడు. దీంతో సుమిత్ర అల్లుడు ఏంటి అన్నయ్య..నీకు మేనల్లుడు కదా.. అంటుంది. దీంతో శ్రీధర్‌ మనసులో రాత్రి వచ్చిన కల ఎక్కడ నిజం అవుతుందోనని కాంచన భయపడుతున్నట్టు ఉంది అనుకుంటాడు.  పారిజాతం వెళ్లి దీప, కార్తీక్‌లను పిలవడానికి వెల్తుంటే.. నేను వెళ్లి పిలుచుకొస్తాను అంటూ జ్యోత్స్న వెళ్తుంది. కాంచన మాత్రం అసలు వీళ్లు ఎందుకు వచ్చారో అర్థం కావడం లేదు అనుకుంటూ భయపడుతుంది.

పెరట్లో కార్తీక్‌, దీప, కాంచన కల గురించి మాట్లాడుకుంటుంటే.. జ్యోత్స్న వింటుంది. వెనక నుంచి అలాగే లోపలికి వెళ్లి వాళ్లు పెరట్లో లేరని బావకు ఫోన్‌ చేసి సరదాగా మాట్లాడతాను ఉండండి అని చెప్తూ కాల్ చేస్తుంది. ఇప్పుడే ఈ ఫోన్‌ ఒకటి అంటూ కార్తీక్‌ ఫోన్‌ లిఫ్ట్‌ చేయగానే.. దీప ఫోన్‌ తీసుకుని కోపంగా జ్యోత్స్నను తిడుతుంటే.. జ్యోత్స్న స్పీకర్‌ పెట్టి అందరూ వినేలా చేస్తుంది. ఇంతలో పారిజాతం ఫోన్‌ లాక్కుని దీపకు నిజం చెప్తుంది. దీంతో దీప అందరూ వినేసి ఉంటారా..? అని భయపడుతుంది. ఇద్దరూ లోపలికి వెళ్లగానే.. కార్తీక్‌ వీళ్లను చూస్తేనే అర్థం అవుతుంది అంతా వినేశారని.. ఇప్పుడు మనం టాఫిక్‌ డైవర్ట్‌ చేయాలి అంటూ కార్తీక్‌ వెళ్లి ఏదేదో మాట్లాడుతుంటే.. సుమిత్ర నీ భార్య ఇలా మాట్లాడుతుందని అనుకోలేదు.. అంటూ నిలదీయగానే.. దశరథ, పారిజాతం, సుమిత్రను కలగజేసుకోవద్దని చెప్తారు.

Advertisement

అయినా సుమిత్ర అలాగే మాట్లాడుతుంది. దీప ఇలా మాట్లాడుతుందని నేను అసలు ఊహించలేదు అనగానే.. పారిజాతం నువ్వేం తప్పు చేశావు అమ్మ క్షమాపణ చెప్పడానికి అంటూ దాసు వస్తాడు. అమ్మ పిలిచింది అందుకే వచ్చాను అంటాడు. ఈ శుభకార్యంలో నా కొడుకు లేకపోతే ఎలా అందుకే పిలిచాను అని పారిజాతం చెప్తుండగానే.. అనసూయ వస్తుంది. శుభకార్యం ఏంటమ్మా అని అడుగుతుంది. దీంతో దీప కోసం చలివిడి కార్యక్రమం ఏర్పాటు చేయించాను అని పారిజాతం చెప్పగానే.. అనసూయ షాక్‌ అవుతుంది. దీప నా మనవరాలు లాంటిది.. సుమిత్రకు కూతురు లాంటిది.. దశరథ, సుమిత్రల చేతుల మీదుగా పెళ్లి జరిగింది కాబట్టి వాళ్లిద్దరూ తల్లిదండ్రులుగా ముందుండి ఈ కార్యక్రమం చేయాలని అందరినీ తీసుకొచ్చాను అంటూ చెప్తూ చలివిడి కార్యక్రమం చేయిస్తుంది. ఇంతలో కార్తీకదీపం 2 ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Telugu Tv Serials : ఈ వారం సీరియల్స్ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏదంటే..?

ఇంద్రజకు ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలో తెలుసా..? సినిమా కన్నా ఎక్కువే..

Gundeninda GudiGantalu Today episode: సంబరాలు చేసుకున్న ప్రభా.. చింతామణి కుట్ర తెలిసిపోతుందా..? బాలుకు షాక్..

Podarillu Today Episode : విగ్నేశ్వరి దెబ్బకు మహా ఫ్యూజుల్ అవుట్.. మహా కోసం సర్ప్రైజ్ ప్లాన్.. నిజం తెలిసిపోతుందా..?

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం శ్రీయ.. పల్లవి నగలను కొట్టేసిందా..? అక్షయ్ సీరియస్..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కు షాక్.. వల్లి ఫిట్టింగ్ అదిరిపోయింది.. నెక్స్ట్ ఏం జరుగుతుంది..?

Sunday Movies in Tv : ఆదివారం టీవీ సినిమాలు.. మాస్ ఫ్యాన్స్ కు పునకాలే..

Nindu Noorella Saavasam Serial Today Episode July 18th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్లాన్ ప్రకారం బుజ్జమ్మ చంపాలనుకున్న ప్రచండ

Big Stories

Advertisement
×