E-Paper
Advertisement

ఆఫీస్ లేదా ఇంట్లో ఇతరుల నెగెటివ్ వైబ్స్‌తో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇది మీ కోసమే!

ఆఫీస్ లేదా ఇంట్లో ఇతరుల నెగెటివ్ వైబ్స్‌తో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇది మీ కోసమే!
Advertisement

Secondhand Stress: సెకండ్‌హ్యాండ్ స్మోకింగ్ గురించి మనందరికీ తెలుసు.. కానీ ‘సెకండ్‌హ్యాండ్ స్ట్రెస్’ గురించి విన్నారా? మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ,మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా సహోద్యోగులు, తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు, ఆ ప్రతికూల భావోద్వేగాలు మీకు కూడా సోకుతాయి. ఇది ఒక అంటువ్యాధిలా పని చేస్తుంది. మన మెదడులోని ‘మిర్రర్ న్యూరాన్లు’ ఎదుటివారి హావభావాలను, భావాలను పసిగట్టి మనలో కూడా అదే విధమైన రసాయన మార్పులను కలిగిస్తాయి. ఫలితంగా.. సమస్య మీది కాకపోయినా మీరు మానసిక అశాంతికి గురవుతారు. ఈ వింత పరిస్థితిని గుర్తించే ప్రధాన లక్షణాలు ఇప్పుడు చూద్దాం.

సెకండ్‌హ్యాండ్ స్ట్రెస్ యొక్క ప్రధాన లక్షణాలు:

1. వివరించలేని అలసట:
మీరు శారీరకంగా పెద్దగా పనులు చేయకపోయినా.. రోజంతా విపరీతమైన అలసటగా అనిపిస్తుందా? మీ చుట్టూ ఉన్న వ్యక్తులు నిరంతరం ఫిర్యాదులు చేస్తున్నా లేదా టెన్షన్‌లో ఉన్నా, ఆ నెగెటివ్ ఎనర్జీని తీసుకోవడం వల్ల మీ మెదడు త్వరగా అలసిపోతుంది.

Advertisement

2. మీ ప్రవర్తనలో మార్పు :
సాధారణంగా మీరు ప్రశాంతంగా ఉండేవారే కావచ్చు. కానీ మీ పార్ట్నర్ లేదా బాస్ ఒత్తిడిలో ఉన్నప్పుడు మీరు కూడా చిన్న విషయాలకే చిరాకు పడటం మొదలుపెడతారు. ఎదుటివారి కోపం లేదా భయం మీలోకి ప్రవేశించి మిమ్మల్ని అసహనానికి గురి చేస్తుంది.

3. నిరంతర ఆందోళన :
మీ జీవితంలో అన్నీ బాగున్నా.. ఏదో తెలియని భయం లేదా ఆందోళన మిమ్మల్ని వేధిస్తుంటే అది సెకండ్‌హ్యాండ్ స్ట్రెస్ కావచ్చు. మీ సోషల్ మీడియా ఫీడ్‌లో నెగెటివ్ వార్తలు చదవడం లేదా స్నేహితుల కష్టాలు వినడం వల్ల మీ ‘కార్టిసాల్’ (ఒత్తిడి హార్మోన్) స్థాయిలు పెరుగుతాయి.

Advertisement

4. శారీరక లక్షణాలు:
సెకండ్‌హ్యాండ్ స్ట్రెస్ కేవలం మనసుకే పరిమితం కాదు. ఇది తలనొప్పి, కండరాల నొప్పులు, ముఖ్యంగా భుజాలు, మెడ బిగుసుకుపోవడం వంటి శారీరక ఇబ్బందులకు దారితీస్తుంది. కొంత మందిలో జీర్ణక్రియ సమస్యలు కూడా తలెత్తవచ్చు.

5. ఏకాగ్రత లోపించడం:
పక్క సీటులో ఉన్న సహోద్యోగి టెన్షన్‌లో పేపర్లు సర్దుతున్నా లేదా గట్టిగా మాట్లాడుతున్నా మీరు చేస్తున్న పనిపై ఫోకస్ చేయలేకపోతున్నారా? ఇతరుల ఒత్తిడి మీ మెదడును ‘హై అలర్ట్’ మోడ్‌లోకి పంపుతుంది. దీని వల్ల ఏకాగ్రత దెబ్బతింటుంది.

Also Read: కనురెప్పలు అదరడానికి ప్రధాన కారణాలు.. ఏ విటమిన్ లోపిస్తే ఇలా జరుగుతుంది?

దీని నుంచి బయటపడటం ఎలా?
భావోద్వేగ సరిహద్దులు: ఇతరుల సమస్యల పట్ల సానుభూతి చూపడం మంచిదే. కానీ వారి సమస్యలను మీ స్వంతం చేసుకోకండి. “ఇది నా సమస్య కాదు” అని మీకు మీరు చెప్పుకోవడం ప్రాక్టీస్ చేయండి.

పాజిటివ్ వైబ్స్: ఒత్తిడిని కలిగించే వ్యక్తుల నుంచి కొంచెం బ్రేక్ తీసుకోండి. ప్రకృతిలో సమయం గడపడం లేదా మీకు నచ్చిన సంగీతం వినడం వల్ల మీ మూడ్ మారుతుంది.

శ్వాస వ్యాయామాలు: ఎవరైనా మీ ముందు టెన్షన్ పడుతుంటే.. మీరు లోతైన శ్వాస తీసుకోండి. ఇది మీ నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది.

సెకండ్‌హ్యాండ్ స్ట్రెస్ అనేది నేటి కాలంలో ఒక పెద్ద సమస్య. మన చుట్టూ ఉన్న ప్రపంచం నుంచి మనల్ని మనం పూర్తిగా విడదీయలేం. కానీ ఇతరుల ఒత్తిడి మనపై ప్రభావం చూపకుండా రక్షణ కవచాన్ని ఏర్పరుచుకోవాలి. మీ మానసిక ఆరోగ్యం మీ ప్రాధాన్యత అని గుర్తుంచుకోండి.

Related News

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

Big Stories

Advertisement
×