E-Paper
Advertisement

Winter Hydration: చలికాలంలోనూ డీహైడ్రేషన్.. మీలో ఎంతమందికి ఈ లక్షణాల గురించి తెలుసు ?

Winter Hydration: చలికాలంలోనూ డీహైడ్రేషన్.. మీలో ఎంతమందికి ఈ లక్షణాల గురించి తెలుసు ?
Advertisement

Winter Hydration: చలికాలంలో డీహైడ్రేషన్ సమస్యను చాలా మంది అంతగా పట్టించుకోరు. చలిలో చెమట పట్టదు కాబట్టి.. తక్కువ నీరు తాగాలని అనుకుంటారు. కానీ ఇది పెద్ద తప్పు. అందుకే చలి కాలంలో డీహైడ్రేషన్ ప్రమాదం పెరుగుతుంది. కానీ దాని లక్షణాలు చాలా నెమ్మదిగా కనిపిస్తాయి. దీనికి ఒక కారణం ఏమిటంటే.. చల్లని గాలిని పీల్చడం వల్ల శరీరం నుంచి తేమ వేగంగా పోతుంది. మరొక కారణం ఏమిటంటే.. చల్లని వాతావరణంలో, శరీరం నీరు తాగలన్న కోరికను అణిచివేస్తుంది. అందుకే.. మనకు తక్కువ దాహం అనిపిస్తుంది. అంతేకాకుండా.. ఈ సమయంలో చాలా మంది టీ, కాఫీ లేదా సూప్ వంటి వేడి డ్రింక్స్ కాబట్టి ఎక్కువగా ఆధారపడతారు. ఇవి నీటిని శరీరంలో భార్తీ చేయలేవు.

Advertisement

చలికాలంలో డీహైడ్రేషన్ ఎందుకు పెరుగుతుందో ఇలా  గుర్తించండి:

Advertisement

తాగే నీరు:

చలికాలంలో డీహైడ్రేషన్ పెరగడానికి అతిపెద్ద కారణం మనకు దాహం తక్కువగా అనిపించడమే. చలికాలంలో.. శరీరం వేడిని నిలుపుకోవడానికి రక్త నాళాలను సంకోచించేలా చేస్తుంది. ఈ ప్రక్రియ మెదడులో నీరు తాగాలన్న కోరికను అణిచివేస్తుంది. రెండవది, మనకు చెమట పట్టదు కాబట్టి మనం నీరు తాగాల్సిన అవసరం లేదని అనుకుంటాం.

శ్వాసకోశ నీటి నష్టం:

చలికాలంలో గాలి సాధారణంగా పొడిగా, చల్లగా ఉంటుంది. మనం చల్లని గాలిని పీల్చినప్పుడు.. మన శరీరం అంతర్గత తేమను ఉపయోగించి దానిని వేడి చేసి తేమగా చేస్తాయి. మనం గాలిని వదిలినప్పుడు.. ఆ తేమ ఆవిరిగా విడుదల అవుతుంది. శరీరం నుంచ ఇలా పదే పదే ద్రవం కోల్పోవడాన్ని శ్వాసకోశ నీటి నష్టం అంటారు.

చలికాలంలో ఎక్కువ యూరిన్:

చల్లని వాతావరణంలో.. శరీరం రక్త నాళాలను సంకోచించేలా చేసి.. గుండె చుట్టూ రక్తాన్ని కేంద్రీకరిస్తుంది. అప్పుడు మెదడు కిడ్నీలకు ఎక్కువ మూత్రాన్ని ఉత్పత్తి చేయమని సంకేతాలు ఇస్తుంది. దీనిని కోల్డ్ డైయూరిసిస్ అంటారు. దీని వల్ల శరీరం ఎక్కువ నీటిని బయటకు పంపిస్తుంది.

యూరిన్ రంగు:

డీహైడ్రేషన్‌ను గుర్తించడానికి సులభమైన మార్గం మీ యూరిన్ రంగును చెక్ చేయడం. మీరు తగినంతగా హైడ్రేట్ అయి ఉంటే.. యూరిన్ లేత పసుపు లేదా దాదాపు పారదర్శకంగా ఉంటుంది. మూత్రం ముదురు పసుపు రంగులో ఉంటే, మీరు వెంటనే ఎక్కువ నీరు తాగాలి అనేదానికి ఇది స్పష్టమైన సంకేతం.

Related News

టేస్టీ అండ్ స్పైసీ క్యాప్సికమ్ రైస్..నిమిషాల్లో తయారయ్యే రెసిపీ!

బంగాళాదుంపలతో కాదు.. అవకాడోతో ఇలా ఫ్రైస్ చేసేయండి, టేస్ట్ అదిరిపోతుంది!

ఎప్పుడూ పకోడీలేనా? ఈసారి పచ్చి అరటికాయతో ఇలా షామీ కబాబ్ చేసి చూడండి!

దిష్టి ఎలా తీయాలో తెలుసా? వేటితో తీస్తే వెంటనే ఫలితం ఉంటుంది?

కొత్తగా పెళ్లయిన యువతికి ఇంటర్వ్యూలో అలాంటి ప్రశ్న.. మీరైతే ఏం చేస్తారు?

ముఖంపై నల్లటి మచ్చలతో ఇబ్బంది పడుతున్నారా? క్లియర్ స్కిన్ కోసం డాక్టర్ ఏం చెప్పారంటే

చూపు దెబ్బతినకముందే అప్రమత్తం కండి.. కళ్లు చెప్పే ఆ రహస్య సంకేతాలు ఇవే!

చాణక్య నీతి.. భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టే స్నేహితులు వీరే.. ఇలా గుర్తించండి

Big Stories

Advertisement
×