E-Paper
Advertisement

Japan Sleep: జపనీయులు నిద్రపోయేది 6 గంటలే.. కానీ అంత ఆరోగ్యంగా ఎలా ఉంటారో

Japan Sleep: జపనీయులు నిద్రపోయేది 6 గంటలే.. కానీ అంత ఆరోగ్యంగా ఎలా ఉంటారో
Advertisement

జపాన్ దేశస్థులే ఎక్కువ కాలం దీర్ఘాయుష్షుతో జీవిస్తారని ఎన్నో అధ్యయనాలు చెప్పాయి. వీరికి క్రమశిక్షణ, సమయపాలన అధికంగా ఉంటాయి. అయితే జపాన్ ప్రజలు ఇతర దేశాలతో పోలిస్తే తక్కువ నిద్రపోతారు. రాత్రిపూట వీరు నిద్రపోయేది కేవలం 6 గంటలే. ఆరు గంటల నిద్రతోనే వీరు అంత ఆరోగ్యంగా ఎలా జీవించగలుగుతున్నారు? దీర్ఘాయుష్షుని ఎలా పొందగలుగుతున్నారు? ఈ సందేహాలు ఎంతో మందిలో ఉంటాయి. జపాన్లో ఉద్యోగస్తుల పనితీరు, పని గంటలు ఎక్కువ. ఆఫీస్ కు వెళ్లేందుకు ప్రయాణం కూడా ఎక్కువ గంటల పాటు చేయాలి. అందుకే జపాన్ ప్రజలు నిద్రను తగ్గించుకున్నారు. అలాగని వారికి అనారోగ్యాలు ఏమీ రావడం లేదు, ఆరోగ్యంగానే జీవిస్తున్నారు. అదెలా సాధ్యమో తెలుసా?

జపనీయులు నిద్రపోయేది 6 గంటలే అయినా వారికి సరిపడా విశ్రాంతి అందుతోంది. దానికి కారణాలు ఎక్కువగానే ఉన్నాయి. వారు ఎల్లప్పుడూ చల్లని గదుల్లో నిద్రపోతారు. బక్ వీట్‌తో చేసిన గట్టి దిండ్లను వాడుతారు. పడుకునే ముందు వేడి నీళ్లతో స్నానం చేస్తారు. ఇవన్నీ కూడా వారికి లోతైన నిద్రకు సహాయపడతాయి. దీని వల్ల వారు ఆరేడు గంటలే నిద్రపోతున్నా కూడా సరిపోతుంది.

Advertisement

ఇనేమురి అంటే ఏమిటి?
ఇనేమురి అనే ప్రత్యేక నిద్ర అలవాటు జపాన్ వారి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇనెమురి అంటే ఉన్నచోటే కాసేపు కునుకు తీయడం. పని ప్రదేశంలో, ట్రైన్ లో.. కూర్చునే స్థితిలోనే కొద్దిసేపు నిద్రపోతారు. దీనివల్ల జపనీయులకు ఎంతో లాభం కలుగుతుంది. జపాన్లో రాత్రి తక్కువ నిద్రపోతారు.. కాబట్టి ఇనేమురి నిద్ర వారికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇనెమురి వల్ల మెదడుకి చిన్న బ్రేక్ దొరుకుతుంది. దీనివల్ల అలసట రాదు. పది పదిహేను నిమిషాల పాటు నిద్రపోయి లేవడం వల్ల వారికి ఏకాగ్రత పెరుగుతుంది. ఆలోచనా శక్తి మెరుగవుతుంది. పనిలో తప్పులు చేసే పరిస్థితి రాదు. నిరంతర పని వల్ల వచ్చే మానసిక ఒత్తిడిని కూడా ఈ చిన్న నిద్రలు పోగొడతాయి. నిద్రలేమి ప్రభావాన్ని ఇది చాలా వరకు తగ్గిస్తుంది. రాత్రి సరిగా నిద్ర పోకపోయినా కూడా ఇనెమురి నిద్ర వల్ల నిద్రాలోపం చాలావరకు కనిపించదు. ఇతర దేశాల్లో ఆఫీసుల్లో నిద్రపోవడం తప్పుగా భావిస్తారు. కానీ జపాన్లో మాత్రం బ్రేక్ తీసుకొని కాసేపు నిద్రపోవచ్చు. అలాగని పగటిపూట నిద్ర.. రాత్రి నిద్రకు పూర్తి ప్రత్యామ్నాయం కాదు. ఇది కేవలం తాత్కాలిక విశ్రాంతి మాత్రమే. దీర్ఘకాలిక ఆరోగ్యం కోసం రాత్రి పూట కచ్చితంగా ఆరు నుంచి ఎనిమిది గంటలకు తగ్గకుండా నిద్ర పోవాల్సిన అవసరం ఉంది.

Also Read:Poor Sleep: వృద్ధాప్యాన్ని వేగవంతం చేసే నిద్రలేమి.. దీని నుంచి ఎలా బయటపడాలి ?

Advertisement

మనకు నిద్ర తగ్గితే ప్రమాదం
నిపుణులు చెబుతున్న ప్రకారం దీర్ఘకాలంగా నిద్ర తగ్గిపోవడం అనేది ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరంగా మారుతుంది. ఎవరైతే తక్కువ నిద్రపోతారో వారిలో ఊబకాయం, డిప్రెషన్ వంటి సమస్యలు పెరిగిపోతాయి. అలాగే పగటిపూట నిద్రమత్తు ఎక్కువ అయిపోతుంది. మానసికంగా అలసిపోయినట్టు కనిపిస్తారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వంటి సంస్థలు నిద్రలేమి వల్ల దీర్ఘకాలంలో గుండె జబ్బులు, మధుమేహం వచ్చే ప్రమాదం పెరిగిపోతాయని ముందే హెచ్చరించాయి. జపాన్ లో దీర్ఘాయుష్షు ఉన్నప్పటికీ వారి జీవన నాణ్యత మాత్రం తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు అక్కడే ప్రభుత్వం, సంస్థలు కలిసి పని గంటలను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఉద్యోగుల మానసిక ఆరోగ్యం గురించి కూడా వారు ఆలోచిస్తున్నారు.

Related News

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

Big Stories

Advertisement
×