E-Paper
Advertisement

Iron Deficiency: జుట్టు పలచబడుతోందా ? ఐరన్ లోపం కావచ్చు

Iron Deficiency: జుట్టు పలచబడుతోందా ? ఐరన్ లోపం కావచ్చు
Advertisement

Iron Deficiency: నేటి కాలంలో.. చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య జుట్టు రాలడం. దీనికి ఒత్తిడి, కాలుష్యం కారణమని మనం అనుకుంటాం. కానీ అసలు కారణం మన శరీరంలో ఉండే ఐరన్ లోపం కావచ్చు. శరీరంలో తగినంత ఐరన్ లేనప్పుడు, రక్తంలోని హిమోగ్లోబిన్ స్థాయిలు పడిపోతాయి. దీని వల్ల జుట్టు కుదుళ్లకు అందాల్సిన ఆక్సిజన్ అందదు. ఫలితంగా జుట్టు బలహీనపడి రాలిపోతుంది. జుట్టు పలచబడటానికి, ఈ పోషకాహార లోపానికి ఉన్న సంబంధాన్ని, దాని పరిష్కారాలను గురించిన పూర్తి వివరంగా తెలుసుకుందాం.

ఐరన్ లోపం అంటే ఏంటి ?
మన శరీరంలో ఎర్ర రక్త కణాలు ఆక్సిజన్‌ను మోసుకెళ్లడానికి హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ అవసరం. ఈ హిమోగ్లోబిన్ తయారీకి ఐరన్ అత్యంత కీలకం. శరీరంలో ఐరన్ తక్కువగా ఉన్నప్పుడు దానిని ‘రక్తహీనత’ అంటారు. ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా మహిళల్లో జుట్టు రాలడానికి ఇది ఒక ప్రధాన కారణం.

Advertisement

ఐరన్, జుట్టు రాలడం మధ్య సంబంధం:
జుట్టు పెరగడానికి మన తల భాగంలోని కణాలకు నిరంతరం ఆక్సిజన్, పోషకాలు అందాలి.

ఆక్సిజన్ సరఫరా తగ్గడం: ఐరన్ తక్కువగా ఉన్నప్పుడు హిమోగ్లోబిన్ ఉత్పత్తి తగ్గుతుంది. దీని వల్ల జుట్టు కుదుళ్లకు అందాల్సిన ఆక్సిజన్ అందక అవి ‘రెస్టింగ్ ఫేజ్’ లోకి వెళ్లిపోతాయి.

Advertisement

స్టెమ్ సెల్స్ పని తీరు: జుట్టు పెరుగుదలకు కారణమయ్యే.. స్టెమ్ సెల్స్ పని చేయాలంటే.. ఐరన్ అవసరం. అది లేనప్పుడు కొత్త జుట్టు మొలవడం ఆగిపోతుంది.

లక్షణాలు ఎలా ఉంటాయి ?
ఐరన్ లోపం వల్ల కలిగే జుట్టు రాలడం సాధారణంగా అందరిలో ఒకేలా ఉండదు.

జుట్టు పలచబడటం: తల పైభాగంలో జుట్టు పలచబడటం గమనించవచ్చు.

గోర్లు విరగడం: జుట్టుతో పాటు గోర్లు కూడా బలహీనంగా మారుతాయి.

అలసట: చిన్న పని చేసినా విపరీతమైన నీరసం, ఆయాసం రావడం.

ఎక్కువగా రాలడం: దువ్వినప్పుడు లేదా స్నానం చేసినప్పుడు కుచ్చులు కుచ్చులుగా జుట్టు రావడం.

నివారణ మార్గాలు, ఆహారం:
ఐరన్ లోపాన్ని అధిగమించడం ద్వారా జుట్టు రాలడాన్ని సమర్థవంతంగా అరికట్టవచ్చు.

ఆకుకూరలు: పాలకూర, తోటకూర వంటి ఆకుకూరల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.

నట్స్, సీడ్స్: బాదం, జీడిపప్పు, గుమ్మడి గింజలు, నువ్వులు డైట్‌లో చేర్చుకోవాలి.

విటమిన్ సి: ఐరన్ శరీరం గ్రహించాలంటే విటమిన్ సి అవసరం. కాబట్టి నిమ్మరసం, ఉసిరి, జామకాయలు తీసుకోవాలి.

మాంసాహారం: చికెన్, లివర్, గుడ్లు తీసుకోవడం వల్ల త్వరగా ఐరన్ పెరుగుతుంది.

సప్లిమెంట్స్: డాక్టర్ సలహాతో ఐరన్ టాబ్లెట్లు వాడటం వల్ల రక్తహీనత తగ్గుతుంది.

Also Read: విజయానికి తొలి అడుగు.. ఉదయం 9 గంటల లోపు మీరు చేయాల్సిన 5 పనులు!

జాగ్రత్తలు:
ఐరన్ లోపం ఉందని తెలియగానే సొంతంగా మందులు వాడకూడదు. రక్త పరీక్ష చేయించుకుని, శరీరంలో ఎంత ఐరన్ ఉందో తెలుసుకోవాలి. అధికంగా ఐరన్ తీసుకోవడం కూడా శరీరానికి హానికరం కావచ్చు.

జుట్టు ఆరోగ్యం అనేది మన శరీర అంతర్గత ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. పౌష్టికాహారం తీసుకోవడం, ఒత్తిడి తగ్గించుకోవడం ద్వారా ఐరన్ లోపాన్ని జయించి, ఒత్తైన జుట్టును తిరిగి పొందవచ్చు. కేవలం పైన పూసే నూనెలు, షాంపూల కంటే లోపల తీసుకునే ఆహారంపై దృష్టి పెట్టడం ఉత్తమం.

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×