E-Paper
Advertisement

MacBook Neo: ఆపిల్ బడ్జెట్ ల్యాప్‌టాప్ లాంచ్.. 16 గంటల బ్యాటరీ, A18 Pro చిప్, ధర ఎంతంటే?

MacBook Neo: ఆపిల్ బడ్జెట్ ల్యాప్‌టాప్ లాంచ్.. 16 గంటల బ్యాటరీ, A18 Pro చిప్, ధర ఎంతంటే?

MacBook Neo| ఆపిల్ తన మ్యాక్ లైనప్‌లో కొత్త ఎంట్రీ లెవల్ ల్యాప్‌టాప్ మ్యాక్‌బుక్ నియోను లాంచ్ చేసింది. ఈ ల్యాప్‌టాప్ పవర్‌ఫుల్ A18 ప్రో చిప్‌తో వస్తుంది. ఫ్యాన్‌లెస్ డిజైన్ వల్ల పూర్తి నిశ్శబ్దంగా పని చేస్తుంది. 13 ఇంచ్ లిక్విడ్ రెటినా డిస్‌ప్లే, లైట్‌వెయిట్ బాడీతో ఉంది. లేటెస్ట్ macOSతో రన్ అవుతుంది. ఇండియాలో అఫర్డబుల్ ధరలో లభిస్తోంది.

ఇండియాలో ధర, అందుబాటు

మ్యాక్‌బుక్ నియో బేస్ మోడల్ (256GB స్టోరేజ్) ధర రూ.69,900. 512GB వేరియంట్ ధర రూ.79,900. సిల్వర్, బ్లష్, సిట్రస్, ఇండిగో రంగుల్లో లభిస్తుంది. ఆపిల్ ఆన్‌లైన్ స్టోర్, ఆపిల్ స్టోర్ యాప్ ద్వారా ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. మార్చి 11 నుంచి ఇండియాలో అధికారిక సేల్స్ మొదలవుతాయి. ఆపిల్ అథారైజ్డ్ రీసెలర్ల ద్వారా కూడా దొరుకుతుంది. ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల్లో సేల్ ఉంటుంది.

డిజైన్, డిస్‌ప్లే

మ్యాక్‌బుక్ నియో స్లీక్ అల్యూమినియం బాడీతో వస్తుంది. రౌండెడ్ కార్నర్లు ఉన్నాయి. బరువు సుమారు 1.23 కిలోగ్రాములు మాత్రమే. 13 ఇంచ్ లిక్విడ్ రెటినా డిస్‌ప్లే ఉంది. రిజల్యూషన్ 2408*1506 పిక్సెల్స్, 219 PPI డెన్సిటీ ఉంది. 500 నిట్స్ బ్రైట్‌నెస్ సపోర్ట్ చేస్తుంది. ఒక బిలియన్ కలర్లు డిస్‌ప్లే చేస్తుంది. యాంటీ-రిఫ్లెక్టివ్ కోటింగ్ ఉండటం వల్ల వివిధ లైటింగ్ కండిషన్లలో స్పష్టంగా కనిపిస్తుంది.

పెర్ఫామెన్స్, ప్రాసెసర్

A18 ప్రో చిప్‌తో రన్ అవుతుంది. ఆరు కోర్ల CPU ఉంది. రెండు కోర్లు హెవీ టాస్క్‌లను హ్యాండిల్ చేస్తాయి. 4 కోర్ ఎనర్జీ ఫీచర్ ఉండడంతో కరెంట్ తక్కువగా వినియోగిస్తుంది. ఐదు కోర్ల GPU, 16 కోర్ల న్యూరల్ ఇంజిన్ ఉన్నాయి. AI టాస్క్‌లను బాగా హ్యాండిల్ చేస్తుంది. వెబ్ బ్రౌజింగ్ ఇంటెల్ కోర్ అల్ట్రా 5 బేస్డ్ PCల కంటే 50శాతం ఫాస్ట్‌గా ఉంటుంది. AI వర్క్‌లోడ్స్ 3 రెట్లు ఫాస్ట్‌గా రన్ అవుతాయి. ఫోటో ఎడిటింగ్ టాస్క్‌లు దాదాపు రెండు రెట్లు ఫాస్ట్‌గా ఉంటాయి.

మెమరీ, స్టోరేజ్

8GB యూనిఫైడ్ మెమరీ ఉంది. 256GB, 512GB SSD స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. మ్యాజిక్ కీబోర్డ్ కంఫర్టబుల్ టైపింగ్ ఇస్తుంది. పెద్ద మల్టీ-టచ్ ఫోర్స్ టచ్ ట్రాక్‌ప్యాడ్ ఉంది. 512GB వేరియంట్‌లో టచ్ ID సపోర్ట్ ఉంది. ఫింగర్‌ప్రింట్‌తో అన్‌లాక్, Apple Pay చేయవచ్చు.

కెమెరా, ఆడియో ఫీచర్లు

1080p FaceTime HD కెమెరా ఉంది. మెరుగైన ఇమేజ్ ప్రాసెసింగ్ టెక్నాలజీతో వీడియో కాల్స్ స్పష్టంగా ఉంటాయి. డ్యూయల్ మైక్రోఫోన్ అరే సిస్టమ్ ఉంది. బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ తగ్గుతుంది. డ్యూయల్ సైడ్-ఫైరింగ్ స్పీకర్లు ఉన్నాయి. స్పేషియల్ ఆడియో, డాల్బీ ఆట్మాస్ సపోర్ట్ చేస్తాయి.

కనెక్టివిటీ, బ్యాటరీ

రెండు USB-C పోర్ట్‌లు ఉన్నాయి. ఛార్జింగ్, ఎక్స్‌టర్నల్ డిస్‌ప్లే కనెక్ట్ చేయవచ్చు. 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉంది. Wi-Fi 6E, బ్లూటూత్ 6 సపోర్ట్ చేస్తుంది. 36.5Wh లిథియం పాలిమర్ బ్యాటరీ ఉంది. వీడియో స్ట్రీమింగ్‌లో 16 గంటలు, వైర్‌లెస్ వెబ్ బ్రౌజింగ్‌లో 11 గంటలు బ్యాకప్ ఇస్తుంది. 20W USB-C పవర్ అడాప్టర్‌తో వస్తుంది.

Also Read: రూ.10 లక్షల స్టూడియోకి నిప్పంటించిన యుట్యూబర్.. సబ్‌స్క్రైబర్స్ పెరగడంలేదని కోపం.. కానీ

మ్యాక్‌బుక్ నియో తక్కువ ధరలో ఫ్లాగ్‌షిప్ లెవల్ పెర్ఫామెన్స్ ఇస్తోంది. A18 ప్రో చిప్, లిక్విడ్ రెటినా డిస్‌ప్లే, 16 గంటల బ్యాటరీతో రోజువారీ ఉపయోగానికి చాలా మంచిది. సైలెంట్ ఆపరేషన్, ప్రీమియం డిజైన్ హైలైట్స్. ఇండియాలో మార్చి 11 నుంచి సేల్స్ ప్రారంభమవుతాయి.

Related News

టీచర్లు, ఆన్‌లైన్ ట్యూటర్ల పని సులువు చేసే టాప్-5 AI టూల్స్ ఇవే!

ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లను హ్యాకర్లు ఎలా దొంగిలిస్తున్నారో తెలుసా?

ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఆఫర్.. రూపాయి ఖర్చు లేకుండా ‘నెట్‌ఫ్లిక్స్’ ఉచితం!

50MP కెమెరా, 6,500mAh బ్యాటరీతో Motorola Edge 70 Pro+ లాంచ్.. ధర వింటే షాకే!

డిజైన్ అదిరింది.. 5x పెరిస్కోప్ కెమెరాతో Xiaomi 17T లాంచ్, సేల్స్ ఎప్పటి నుంచంటే?

Physical SIM vs eSIM: ఆండ్రాయిడ్ ఫోన్లలో ఏ సిమ్ బెస్ట్? ఏది వాడితే ఎక్కువ లాభం?

గంటల తరబడి హెడ్‌ఫోన్స్ పెట్టుకుంటున్నారా? ఈ 60/60 రూల్ తెలియకపోతే డేంజర్లో పడ్డట్టే!

అమెజాన్ బంపరాఫర్.. మోటో ఎడ్జ్ 50పై రూ.5 వేలకు పైగా తగ్గింపు.. ఫోన్ ప్రత్యేకతలు ఇవే!

Big Stories

×