E-Paper
Advertisement

Old Toothbrush: పాత టూత్ బ్రష్ పడేసే కన్నా ఎన్ని రకాలుగా వాడవచ్చో తెలుసా?

Old Toothbrush: పాత టూత్ బ్రష్ పడేసే కన్నా ఎన్ని రకాలుగా వాడవచ్చో తెలుసా?
Advertisement

ఇంట్లో రోజూ ఉపయోగించే టూత్‌బ్రష్ కొద్ది నెలలు వాడిన తర్వాత పనికిరాదని పడేస్తారు. బ్రిసిల్స్ వంకరగా మారడం, మృదుత్వం తగ్గడం వల్ల దంతాలు శుభ్రం చేయడానికి ఇది అనువుగా ఉండదు. అయితే పాత టూత్‌బ్రష్ పూర్తిగా పనికిరాదని అనుకోకండి. ఇంట్లో అనేక చిన్నచిన్న పనుల్లో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. టూత్‌బ్రష్‌ను సాధారణంగా రెండు నుంచి మూడు నెలలకు ఒకసారి మార్చడం మంచిది. ఎందుకంటే పాత బ్రష్‌తో పళ్ళపై ప్లాక్ పూర్తిగా తొలగకపోవచ్చు. అయితే ఆ బ్రష్‌ను పడేయకుండా వేరే పనులకు ఉపయోగించడం మంచి అలవాటు. ముఖ్యంగా చిన్న గ్యాప్‌లు ఉన్న ప్రదేశాలను శుభ్రం చేయడంలో టూత్‌బ్రష్‌ అద్భుతంగా పనిచేస్తుంది.

పాతదైన టూత్ బ్రష్ ను బాత్‌రూమ్ క్లీనింగ్ కు వాడవచ్చు. బాత్‌రూమ్ టైల్స్ మధ్య ఉన్న గ్యాప్‌లు, ట్యాప్ మూలలు, షవర్ ప్రాంతాల్లో మురికి పేరుకుపోతుంది. పెద్ద బ్రష్‌తో శుభ్రం చేయడం కష్టం. ఈ సమయంలో పాత టూత్‌బ్రష్‌తో సబ్బు నీరు లేదా క్లీనింగ్ లిక్విడ్ వేసి రుద్దితే మురికి సులభంగా తొలగిపోతుంది. చిన్న బ్రిసిల్స్ మూలల్లోకి చేరి శుభ్రతను అందిస్తాయి. అందుకే చాలా మంది హౌస్‌కీపింగ్ నిపుణులు కూడా ఈ పద్ధతినే పాటిస్తారు.

Advertisement

టూత్ బ్రష్ తో క్లీనింగ్
కిచెన్‌లో కూడా టూత్‌బ్రష్ మంచిగా ఉపయోగపడుతుంది. ప్రెషర్ కుక్కర్ మూత గ్యాప్‌లు, స్టవ్ బర్నర్ చుట్టూ పేరుకున్న ఆయిల్ మురికి, గ్రేటర్ వంటి పరికరాల్లో చిక్కుకున్న ఆహార అవశేషాలు తొలగించడంలో ఇది ఉపయోగపడుతుంది. పాత్రలను గట్టిగా రుద్దకుండా, సున్నితంగా శుభ్రం చేయడం వల్ల అవి ఎక్కువకాలం మన్నుతాయి. చిన్న పనులకు వేరే ప్రత్యేక బ్రష్ కొనాల్సిన అవసరం కూడా తగ్గుతుంది. ఇంటి శుభ్రతతో పాటు వ్యక్తిగత వస్తువుల సంరక్షణలో కూడా పాత టూత్‌బ్రష్ ఉపయోగపడుతుంది. చెయిన్‌లు, ఉంగరాలు, చెవిపోగులు వంటి ఆభరణాలపై దుమ్ము చేరినప్పుడు సబ్బు నీటిలో టూత్‌బ్రష్‌తో మృదువుగా రుద్దితే మెరుపు తిరిగి వస్తుంది. ఇది ఆభరణాలకు గీతలు పడకుండా శుభ్రం అవుతాయి. అలాగే గడియారాల స్ట్రాప్‌లు, బెల్ట్ బకిల్స్ వంటి చిన్న భాగాలను కూడా ఈ విధంగా శుభ్రం చేయవచ్చు.

Also read: Dog and Cancer: వాసన చూసి క్యాన్సర్ కనిపెట్టిన పెంపుడు కుక్క, దంపతుల ప్రాణాలు దక్కాయి

Advertisement

గాడ్లెట్ల మురికి పోతుంది
డిజిటల్ యుగంలో గాడ్జెట్లు కూడా ఎక్కువగా వాడుతున్నాం. కంప్యూటర్ కీబోర్డ్, టీవీ రిమోట్, మొబైల్ కవర్లలో చిన్న గ్యాప్‌ల మధ్య దుమ్ము చేరడం సహజం. క్లాత్ తో శుభ్రం చేసినా పూర్తిగా తొలగదు. పాత టూత్‌బ్రష్‌తో మెల్లగా రుద్దితే దుమ్ము బయటకు వస్తుంది. దీంతో గాడ్జెట్లు కూడా శుభ్రంగా ఉండటంతో పాటు పనితీరు మెరుగుపడుతుంది. పాత టూత్‌బ్రష్‌ను షూస్ శుభ్రం చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. షూ సోల్స్ మధ్య చిక్కుకున్న మట్టి, ధూళిని తొలగించడానికి ఇది సరైన సాధనం. ముఖ్యంగా స్పోర్ట్స్ షూస్ లేదా వైట్ షూస్ క్లీనింగ్‌లో ఇది బాగా పనిచేస్తుంది. అలాగే చిన్న మొక్కల కుండీలపై ఉన్న మురికి తొలగించడానికి, గోడల మూలల్లో ఉన్న మురికిని తీసేయడానికి కూడా ఉపయోగించవచ్చు.

బ్యూటీ, గ్రూమింగ్ పనుల్లో కూడా టూత్‌బ్రష్ ఉపయోగపడుతుంది. ఇంట్లో హెయిర్ కలర్ వేసేటప్పుడు చిన్న భాగాలకు అప్లై చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. కనుబొమ్మల ఆకృతి సెట్ చేయడం, చిన్న హెయిర్ స్ట్రాండ్స్ సర్దుకోవడం వంటి పనుల్లో కూడా ఉపయోగించవచ్చు. అయితే ఈ పనుల కోసం వాడే బ్రష్‌ను శుభ్రంగా ఉంచడం అవసరం. అయితే పాత టూత్‌బ్రష్ వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముందుగా సబ్బు నీటితో బాగా కడిగి, అవసరమైతే వేడి నీటిలో కొద్దిసేపు ఉంచి శుభ్రం చేయాలి. ఒకసారి ఇతర పనులకు వాడిన తర్వాత మళ్లీ పళ్ళు తోమడానికి ఉపయోగించకూడదు. చిన్న వస్తువే అయిన టూత్‌బ్రష్ కూడా సరైన విధంగా ఉపయోగిస్తే మల్టీపర్పస్ టూల్‌గా మారుతుంది. కాబట్టి ఇకపై టూత్‌బ్రష్ మార్చినప్పుడు వెంటనే డస్ట్‌బిన్‌లో వేయకుండా, ఇంట్లో పైన చెప్పిన పనులకు ఉపయోగించడం మంచిది.

Related News

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్ని ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

Big Stories

Advertisement
×