E-Paper
Advertisement

Dog and Cancer: వాసన చూసి క్యాన్సర్ కనిపెట్టిన పెంపుడు కుక్క, దంపతుల ప్రాణాలు దక్కాయి

Dog and Cancer: వాసన చూసి క్యాన్సర్ కనిపెట్టిన పెంపుడు కుక్క, దంపతుల ప్రాణాలు దక్కాయి
Advertisement

పెంపుడు కుక్కల తమ యజమానులకు చాలా విశ్వాసంగా ఉంటాయి. వారిని నిత్యం వాసన చూస్తూనే ఉంటాయి. వారి నుంచి వచ్చే వాసనలో ఏదైనా తేడా వచ్చిందంటే ఆ విషయాన్ని వారికి తెలియజేసేందుకు ప్రయత్నిస్తాయి. ఇలాంటా అరుదైన ఘటన అమెరికాలో జరిగింది. ఒక పెంపుడు కుక్క తన యజమానుల ప్రవర్తనలో వచ్చిన మార్పులను గమనించి, వారికి క్యాన్సర్ ఉందని ముందుగానే గుర్తించింది. కుక్క అసాధారణ ప్రవర్తనను అర్థం చేసుకున్న వారు పరీక్షలు చేయించుకుంటే ఇద్దరికీ క్యాన్సర్ వ్యాధి ఉన్నట్టు తేలింది.

ఎలా కనిపెట్టింది?
ఇక్కడ మనం చెప్పుకోబోయే కుక్క పేరు సీటో. చాలా ప్రేమగా, ప్రశాంతంగా ఉండే ఈ కుక్క ఒక్కసారిగా తన యజమానురాలి చుట్టూ తిరుగుతూ ఆందోళనగా ప్రవర్తించడం ప్రారంభించింది. ముఖ్యంగా ఆమె ఛాతీ భాగాన్ని ముక్కుతో తాకుతూ, అక్కడే ఎక్కువగా తాకేందుకు ప్రయత్నించింది. దీంతో యజమానురాలికి ఆశ్చర్యంగా అనిపించింది. మొదట దీనిని సాధారణంగా తీసుకున్నా, అదే ప్రవర్తన పలుమార్లు కనిపించడంతో ఆమె తన ఆరోగ్యం గురించి అనుమానం వచ్చింది. తర్వాత ఆమె స్వయంగా పరీక్షించుకోవడంతో ఛాతీలో చిన్న గడ్డ కనిపించింది. దీంతో వెంటనే వైద్యులను సంప్రదించింది. మొదట వైద్యులు పెద్దగా సమస్య ఉండకపోవచ్చని భావించినా పరీక్షలు చేశారు. అనంతరం మామోగ్రామ్, అల్ట్రాసౌండ్, బయాప్సీ వంటి పరీక్షలు చేయగా ఆమెకు ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. ఇది వేగంగా వ్యాపించే ప్రమాదకర రకం. దీంతో వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించారు.

Advertisement

వైద్యుల ప్రకారం సమయానికి గుర్తించడం వల్లే చికిత్స విజయవంతమైందని తెలిపారు. కెమోథెరపీ, రేడియేషన్, శస్త్రచికిత్స వంటి చికిత్సలతో వ్యాధిని నియంత్రించగలిగారు. కొద్దికాలం ఆలస్యమైతే పరిస్థితి తీవ్రమయ్యేదని వైద్యులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కుక్క ప్రవర్తనే తన ప్రాణాలను కాపాడిందని మహిళ భావోద్వేగంతో తెలిపింది.

Also read: Love Marriage: సీక్రెట్‌గా రిజిస్టర్ పెళ్లిచేసుకోవానుకునే ప్రేమికులకు బిగ్ షాక్, తల్లిదండ్రులకు చెప్పాల్సిందే

Advertisement

కోలన్ క్యాన్సర్ కనిపెట్టింది
ఇదే కుక్క గతంలో ఆ మహిళ భర్తను కూడా కాపాడింది. =అప్పట్లో కూడా అతని చుట్టూ తిరుగుతూ అసాధారణంగా ప్రవర్తించింది. కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో అతను పరీక్షలు చేయించుకోగా, కోలన్ క్యాన్సర్ ఉన్నట్టు బయటపడింది. ఆ సమయంలో కూడా వ్యాధి ప్రారంభ దశలోనే గుర్తించడంతో చికిత్స సులభమైంది. దీంతో కుటుంబ సభ్యులకు ఈ కుక్కపై చాలా ప్రేమ పెరిగింది. శాస్త్రవేత్తలు చెబుతున్న ప్రకారం కుక్కలకు గ్రహణ శక్తి మనుషుల కంటే వేల రెట్లు ఎక్కువగా ఉంటుంది. మన శరీరంలో వ్యాధులు వచ్చినప్పుడు కణాల్లో రసాయన మార్పులు జరుగుతాయి. ఆ మార్పుల వల్ల ప్రత్యేకమైన వాసనలు ఉత్పత్తి అవుతాయి. ఈ వాసనలను కుక్కలు గుర్తించగలవు. అందుకే ప్రపంచవ్యాప్తంగా కొన్ని పరిశోధనల్లో శిక్షణ పొందిన కుక్కలను క్యాన్సర్ ముందస్తు గుర్తింపుకు ఉపయోగిస్తున్నారు. కొన్ని అధ్యయనాల్లో కుక్కలు అధిక ఖచ్చితత్వంతో క్యాన్సర్‌ను గుర్తించగలవని కూడా వెల్లడైంది.

శరీరంలో చిన్న మార్పు కనిపించినా నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గడ్డలు, నొప్పి, అలసట, ఆకలి తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని చెబుతున్నారు. అలాగే కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా పెంపుడు జంతువులు ప్రవర్తనలో మార్పులు చూపినా వాటిని గమనించడం అవసరమని సూచిస్తున్నారు.
పెంపుడు కుక్కను పెంచుతునన మహిళ మాట్లాడుతూ తన పెంపుడు కుక్కను కుటుంబ సభ్యుడిగా భావిస్తానని, అది తన జీవితాన్ని కాపాడిందని భావోద్వేగంతో చెప్పింది.

ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవడంతో వేలాది మంది ఈ కుక్కను ప్రశంసిస్తున్నారు. పెంపుడు జంతువులు మనుషుల భావోద్వేగాలను మాత్రమే కాదు, కొన్నిసార్లు ఆరోగ్య సమస్యలను కూడా గుర్తించగలవని ఈ సంఘటన నిరూపించిందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఒక చిన్న జాగ్రత్త ప్రాణాలను కాపాడగలదని ఈ ఘటన చెబుతోంది. ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండటం, శరీరం పంపే సంకేతాలను గుర్తించడం, అవసరమైతే వెంటనే పరీక్షలు చేయించుకోవడం చాల ముఖ్యం.

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×