E-Paper
Advertisement

Lord Shani: పేదలను హింసించే.. వారికి శని శిక్ష తప్పదట!

Lord Shani: పేదలను హింసించే.. వారికి శని శిక్ష తప్పదట!
Advertisement

Lord Shani: జ్యోతిష్యశాస్త్రంలో శని దేవుడిని ‘న్యాయాధిపతి’, ‘కర్మఫల ప్రదాత’ అని పిలుస్తారు. ఆయన ఎవరికీ అన్యాయం చేయరు. కేవలం మనం చేసిన పనులకు (కర్మలకు) తగిన ఫలితాన్ని మాత్రమే ఇస్తారు. శని దేవుడు శిక్షించేది మనల్ని కాదు, మనలోని చెడు గుణాలను. ముఖ్యంగా ఐదు రకాల వ్యక్తులపై శని ప్రభావం కఠినంగా ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. ఆ ఐదు రకాల వ్యక్తులు ఎవరు, వారు చేసే తప్పులేమిటో వివరంగా తెలుసుకుందాం.

హిందూ ధర్మంలో శని దేవుడు అంటే చాలా మందికి భయం ఉంటుంది. కానీ నిజానికి శని దేవుడు క్రూరుడు కాదు, ఆయన క్రమశిక్షణకు మారుపేరు. మనం చేసే ప్రతి పనిని ఆయన గమనిస్తుంటారు. మంచి చేసిన వారికి శుభ ఫలితాలను, చెడు చేసిన వారికి కఠినమైన శిక్షలను అమలు చేస్తారు. అందుకే ఆయనను ‘కర్మఫల ప్రదాత’ అంటారు. ఏ వ్యక్తి అయితే తన అధికారాన్ని, బలాన్ని అడ్డుపెట్టుకుని ఇతరులను ఇబ్బంది పెడతాడో.. అలాంటి వారికి శని దశలో తప్పకుండా గుణపాఠం లభిస్తుంది.

Advertisement

శని దేవుడు శిక్షించే 5 రకాల వ్యక్తులు:
శని దేవుడు క్రమశిక్షణ లేని వారిని, అధర్మాన్ని అనుసరించే వారిని అస్సలు సహించడు. ముఖ్యంగా ఈ కింది ఐదు వర్గాల వారు శని దృష్టిలో కఠిన శిక్షకు అర్హులు.

1. పేదలను , కార్మికులను వేధించేవారు:
శని దేవుడు కష్టపడి పని చేసే శ్రామికులకు ప్రతినిధి. ఎవరైతే తమ కింద పని చేసే కార్మికులకు సరైన సమయానికి వేతనం ఇవ్వరో, వారిని గౌరవించరో లేదా శారీరకంగా, మానసికగా హింసిస్తారో అటువంటి వారిపై శని ఆగ్రహం ఉంటుంది. పేదల కన్నీరు శని దేవుడికి కోపాన్ని తెప్పిస్తుంది. అలాంటి వ్యక్తులు ఎంత సంపాదించినా, శని దశలో అంతా కోల్పోవాల్సి వస్తుంది.

Advertisement

2. మహిళలను అవమానించేవారు:
స్త్రీలను గౌరవించని చోట లక్ష్మీదేవి ఉండదు, అలాగే శని దేవుడు కూడా అక్కడ తన ప్రతాపాన్ని చూపిస్తాడు. ఆడవారిని మోసం చేయడం, వారిపై అత్యాచారాలు చేయడం లేదా వారిని కించపరిచేలా మాట్లాడే వ్యక్తులకు శని దేవుడు అత్యంత కఠినమైన శిక్షలు విధిస్తాడు. సామాజికంగా గౌరవం కోల్పోవడం, తీరని అనారోగ్య పాలవ్వడం వంటివి వీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

3. జంతువులను హింసించేవారు:
మూగ జీవాలను హింసించే వారిని శని దేవుడు ఎన్నటికీ క్షమించడు. ముఖ్యంగా కుక్కలను కొట్టే వారికి లేదా చంపే వారికి శని దోషం బలంగా చుట్టుకుంటుంది. ఎందుకంటే.. నల్ల కుక్క శని దేవుని వాహనంగాచెబుతారు. అలాగే పచ్చని చెట్లను అనవసరంగా నరికే వారికి, పర్యావరణాన్ని కలుషితం చేసే వారికి కూడా శని దేవుడు తనదైన శైలిలో శిక్షలను ఇస్తాడు.

4. అబద్ధాలు చెప్పి మోసం చేసేవారు:
న్యాయానికి ప్రతీక అయిన శని దేవుడు, అసత్యం పలికే వారిని ద్వేషిస్తారు. తప్పుడు సాక్ష్యాలు చెప్పడం, ఇతరుల ఆస్తులను కబ్జా చేయడం, నమ్మిన వారిని వెన్నుపోటు పొడవటం వంటి పనులు చేసే వారు శని దృష్టిలో నేరస్తులే. ఇలాంటి వారు తాత్కాలికంగా సుఖపడినా, శని దేవుని ఏల్నాటి శని కాలంలో వారు చేసిన ప్రతి మోసానికి భారీ మూల్యం చెల్లించుకుంటారు.

Also Read: పరమాత్మ ప్రేమకు పాత్రులు ఎవరు? ఇంతకీ భగవద్గీత ఏం చెబుతోంది ?

5. దానధర్మాలు చేయని వారు:
డబ్బు, అధికారం ఉందనే అహంకారంతో గర్వంగా ప్రవర్తించే వారిని శని దేవుడు అణచివేస్తాడు. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయకుండా.. ఉన్నదంతా తనకే కావాలని ఆశపడే పిసినారి వ్యక్తులకు శని పాఠాలు నేర్పుతాడు. మనిషిలో గర్వం పెరిగినప్పుడు, శని దేవుడు అతడిని సున్నా స్థాయికి తీసుకువచ్చి, జీవితం అంటే ఏమిటో అర్థమయ్యేలా చేస్తారు.

శని దేవుడు మన శత్రువు కాదు, ఆయన ఒక గురువు వంటి వారు. మనల్ని సరైన మార్గంలో పెట్టడానికి ఆయన కష్టాలను ఇస్తారు. మనం చేసే పనులు ధర్మబద్ధంగా ఉంటే.. శని దేవుడు అత్యంత వైభోగవంతమైన జీవితాన్ని ప్రసాదిస్తారు. “కాయకమే కైలాసం” అని నమ్మి, ఇతరులకు హాని చేయకుండా బతికే వారికి శని దేవుడు ఎప్పుడూ రక్షణ కవచంలా నిలుస్తారు.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×