E-Paper
Advertisement

Kidney Health: నిద్రపోయే ముందు చేసే ఈ తప్పులు.. కిడ్నీలను పాడు చేస్తాయ్ జాగ్రత్త !

Kidney Health: నిద్రపోయే ముందు చేసే ఈ తప్పులు.. కిడ్నీలను పాడు చేస్తాయ్ జాగ్రత్త !
Advertisement

Kidney Health: మానవ శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసి, వ్యర్థాలను బయటకు పంపే కీలకమైన అవయవాలు కిడ్నీలు. చాలా మంది పగటి పూట తీసుకునే ఆహారం, నీటి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు కానీ, రాత్రి పూట తాము చేసే కొన్ని పొరపాట్లు కిడ్నీలపై ఎంతటి తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తాయో గమనించరు. నిద్ర పోయే ముందు మనం అనుసరించే లైఫ్ స్టైల్ అలవాట్లు దీర్ఘ కాలంలో కిడ్నీ వ్యాధులకు, రక్తపోటుకు, ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. మీ కిడ్నీల పని తీరును దెబ్బతీసే అలవాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కిడ్నీలను ఒత్తిడికి గురిచేసే 6 అలవాట్లు:

Advertisement

1. నిద్ర లేమి:
నిద్ర అనేది కేవలం విశ్రాంతి మాత్రమే కాదు, శరీరం తనను తాను మరమ్మతు చేసుకునే సమయం. రాత్రి సరిగ్గా నిద్రపోకపోతే, కిడ్నీ కణజాలం వేగంగా దెబ్బతింటుంది. పరిశోధనల ప్రకారం.. తక్కువ నిద్రపోయే వారిలో కిడ్నీ పనితీరు వేగంగా క్షీణించే అవకాశం ఉంది.

2. నిద్రపోయే ముందు అధికంగా ఉప్పు తీసుకోవడం:
రాత్రి భోజనంలో ఉప్పు ఎక్కువగా ఉంటే.. అది శరీరంలో నీటి శాతాన్ని పెంచి రక్తపోటును పెంచుతుంది. అధిక రక్తపోటు అనేది కిడ్నీ వ్యాధులకు ప్రధాన కారణం. రాత్రి పూట కిడ్నీలు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో.. అధిక ఉప్పును బయటకు పంపడానికి కిడ్నీలు తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది.

Advertisement

3. ఆలస్యంగా భోజనం చేయడం:
రాత్రి ఆలస్యంగా..ముఖ్యంగా నాన్ వెజ్ వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం కిడ్నీలపై భారాన్ని పెంచుతుంది. ప్రోటీన్ జీర్ణక్రియ సమయంలో విడుదలయ్యే అమ్మోనియా వంటి వ్యర్థాలను వడపోయడానికి కిడ్నీలు రాత్రంతా కష్టపడాలి. ఇది మెటబాలిక్ ఒత్తిడికి దారి తీస్తుంది.

4. యూరిన్ ఆపుకోవడం:
చాలా మంది నిద్రలో ఉన్నప్పుడు బద్ధకం వల్ల లేదా నిద్ర చెడిపోతుందనే భయంతో మూత్రాన్ని ఆపుకుంటారు. ఇలా చేయడం వల్ల మూత్రాశయంలో ఒత్తిడి పెరిగి, అది తిరిగి కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. ఇది కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి, ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది.

5. పడుకునే ముందు పెయిన్ కిల్లర్స్ వాడటం:
ఒళ్లు నొప్పులు లేదా తలనొప్పి అని రాత్రిపూట డాక్టర్ సలహా లేకుండా పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం చాలా ప్రమాదకరం. ఇవి కిడ్నీలకు రక్త ప్రసరణను తగ్గిస్తాయి. దీర్ఘకాలంలో ఈ అలవాటు కిడ్నీలు పూర్తిగా పాడైపోవడానికి కారణమవుతుంది.

Also Read: విటమిన్-డి ట్యాబ్లెట్లు వాడుతున్నారా ? అయితే ఈ తప్పులు చేయకండి!

6. అధికంగా నీరు తాగడం లేదా అసలు తాగకపోవడం:
అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లు, పడుకునే ముందు లీటర్ల కొద్దీ నీరు తాగడం వల్ల రాత్రి పదే పదే లేవాల్సి వస్తుంది. ఇది నిద్రను పాడు చేస్తుంది. అలాగే.. రోజంతా తక్కువ నీరు తాగి రాత్రి కూడా నిర్లక్ష్యం చేస్తే, కిడ్నీల్లో వ్యర్థాలు పేరుకుపోతాయి. పడుకునే గంట ముందు తగినంత నీరు తాగడం ఉత్తమం.

కిడ్నీ వ్యాధులు ప్రారంభంలో ఎలాంటి లక్షణాలను చూపవు, అందుకే వీటిని ‘సైలెంట్ కిల్లర్స్’ అంటారు. పైన పేర్కొన్న చిన్న చిన్న మార్పులను మీ రాత్రి లైఫ్ స్టైల్ లో చేసుకోవడం ద్వారా మీ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. సరైన నిద్ర, మిత ఆహారం, ఆరోగ్యకరమైన అలవాట్లే కిడ్నీలకు అసలైన రక్షణ.

Related News

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

Big Stories

Advertisement
×