E-Paper
Advertisement

Peddapalli Crime: గోదావరి ఖనిలో కత్తిపోట్ల కలకలం.. కత్తులతో కుటుంబసభ్యుల దాడులు

Peddapalli Crime: గోదావరి ఖనిలో కత్తిపోట్ల కలకలం.. కత్తులతో కుటుంబసభ్యుల దాడులు
Advertisement

Peddapalli Crime: ఫ్యామిలీలో చిన్న చిన్న సమస్యలు అగాధం రేపాయి.  ఫలితంగా కత్తులతో ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. వారిలో పలువురు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సంచలనం రేపిన ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో వెలుగు చూసింది. అసలేం జరిగింది.

పెద్దపల్లి జిల్లా మార్కండేయ కాలనీలో ఓ ఫ్యామిలీ ఉంటోంది. అయితే ఆ కుటుంబంలో ఏం జరిగిందో తెలీదు. ఒక్కసారిగా కత్తులతో దాడులు చేసుకోవడం సంచలనం రేపింది. కుటుంబ సభ్యుల మధ్య జరిగిన గొడవతో రామ్ దూత్ అనే వ్యక్తి కొబ్బరికాయలు కొట్టే కత్తితో కుటుంబ సభ్యులపై దాడి చేశాడు. సుమిత్ర, ప్రణయ్, కొమురమ్మలపై దాడికి దిగాడు.

Advertisement

ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే బాధితులను చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందులో ప్రణయ్ పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేస్తున్నారు. ఈ విషయం తెలియగానే సంఘటన స్థలాన్ని గోదావరి ఖని వన్ టౌన్ పోలీసులు చేసుకున్నారు.

కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు మొదలుపెట్టారు. ఘటన ఎలా జరిగింది? ఎందుకు కుటుంబసభ్యుల మధ్య గొడవలు జరిగాయి? దీని వెనుక ఎవరైనా ఉన్నారా? అనేదానిపై పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. బాబాయ్ కొడుకు.. సొంతం చిన్నమ్మపై విచక్షణారహితంగా దాడికి దిగినట్టు తెలుస్తోంది. సిగరెట్ షాప్ నిర్వహణ విషయంలో గొడవ తలెత్తినట్టు స్థానికులు చెబుతున్నారు.

Advertisement

 

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×