Anti Cancer Foods| భారతీయ వంటకాల్లో ఉండే సాధారణ ఆహారాలు చాలా ఆరోగ్యకరం. వీటిలోని పోషకాలు ఇవ్వడంతోపాటు, వాపు తగ్గించే, బ్యాక్టీరియా నిరోధక లక్షణాలు కలిగి ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ, రక్తంలో షుగర్ కంట్రోల్ చేయడానికి సహాయాపడతాయి. కొన్ని ఆహారాలు క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని కూడా నిరోధిస్తాయి. ప్రతి రోజూ తినడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుందని నిపుణలు అభిప్రాయపడుతున్నారు.
దాదాపు ప్రతి భారతీయ కుటుంబంలో రోజువారీ ఆహారంలో పప్పు ఉంటుంది. ఇందులో ప్రోటీన్, ఫైబర్‌తో అవసరమైన పోషకాలు మెండుగా ఉన్నాయి. యూకే డాక్టర్ డా. కరణ్ రాజన్ సోషల్ మీడియాలో దాల్ (పప్పు) ప్రయోజనాలను వివరించారు. గుండె ఆరోగ్యానికి, పేగుల పనితీరుకు పప్పులోని పోషకాలు సహాయపడుతాయని చెప్పారు. ఇంకా దీనికి క్యాన్సర్‌ను నిరోధించే లక్షణాలు కూడా ఉన్నాయని తెలిపారు. రోజూ దాల్ తినడం వల్ల ఆరోగ్యంలో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి.
రోజూ దాల్ తినడం వల్ల వచ్చే మూడు ప్రధాన ప్రయోజనాలను డాక్టర్ రాజన్ వివరించారు.
ఈ ప్రయోజనాలతో పాటు ఈ పప్పు లాంటి సూపర్ ఫుడ్ తినడం వల్ల శరీరంలో కండరాలకు కూడా బలం చూకూరుతుంది. ఇక్కడ పప్పు అంటే కేవలం కందిపప్పు మాత్రమే కాదు అన్ని రకాల పప్పులు. (కంది పప్పు, మూంగ్ దాల్, మసూర్ దాల్, మిన పప్పు)
పప్పులో రెసిస్టెంట్ స్టార్చ్, కరిగే ఫైబర్ ఉంటాయి. ఈ పోషకాలు కొన్ని గంటల పాటు ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తాయి. ఉదయం లేదా మధ్యాహ్నం పప్పు తింటే రక్తంలో చక్కెర స్థిరంగా ఉంటుంది. ఈ ప్రభావం భోజనం తర్వాత కూడా కొనసాగుతుంది. ఒక్కసారిగా షుగర్ లెవెల్స్ పెరిగిపోవడం, పడిపోవడం వంటి ప్రమాదాలు నివారిస్తుంది. డయాబెటిస్ ప్రమాదం ఉన్నవారికి పప్పు ఉపయోగపడుతుంది.
పప్పులో క్రమంగా కరిగే ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ పేగు అంతటా ప్రయాణిస్తుంది. ఇతర ఆహారాల్లో లభించే ఫైబర్ పేగు మొదటి భాగంలోనే త్వరగా కరిగిపోతాయి. కానీ పప్పులో ఉండే ఫైబర్ పేగు లోతైన భాగాలకు మెల్లగా చేరుతుంది. ఇది జీర్ణక్రియకు, పేగు దీర్ఘకాలిక బ్యాలెన్స్‌కు మంచి ప్రయోజనాలు ఇస్తుంది.
పప్పులో గాలాక్టోఒలిగోసాకరైడ్స్ అనే ప్రత్యేక ఫైబర్ ఉంటుంది. ఇది పెద్ద పేగు చివరి భాగం వరకు చేరిన తరువాతే కరుగుతుంది. ఈ ఫైబర్‌తో పేగులో ఉండే మంచి బ్యాక్టిరియా (బిఫిడోబాక్టీరియం)కు ఆహారం ఇస్తుంది. ఈ బ్యాక్టీరియా జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, హానికరమైన వాపును తగ్గిస్తాయి.
Also Read: డాన్స్ చేసే సమయంలో గుండెపోటు.. పెరుగుతున్న కేసుల సంఖ్య.. ఇలా నివారించండి
కొలన్ క్యాన్సర్ అంటే పేగు క్యాన్సర్. ఈ ప్రమాదకర క్యాన్సర్ సాధారణంగా పెద్ద పేగు చివరి భాగంలో మొదలవుతుంది. పప్పులో ఉండే ఫైబర్ ఆ ప్రాంతానికి చేరి మంచి బ్యాక్టీరియాను పోషిస్తుంది. ఫైబర్ కరిగేటప్పుడు అక్కడ బ్యూటిరేట్ బ్యాక్టీరియా ఏర్పడుతుంది. బ్యూటిరేట్ పేగు కణాలకు శక్తి ఇస్తుంది, వాపును తగ్గిస్తుంది. ఇది శరీరంలో బలమైన యాంటీ-క్యాన్సర్ లక్షణాలు చూపిస్తుంది. ఈ ప్రక్రియ.. పేగులకు హానికరమైన క్యాన్సర్ కారకాల నుంచి రక్షిస్తుంది.
ముఖ్య గమనిక: పై తెలిపిన వివరాలు.. ప్రముఖ బ్రిటన్ డాక్టర్ కరణ్ రాజన్ అభిప్రాయాలు. ఇందులో ఏవైనా తప్పిాదాలకు ‘బిగ్‌టీవీ’ బాధ్యత వహించదు. ఈ వివరాలు కేవలం పాఠకుల అవగాహన కోసమే. నిజ నిర్ధారణ కోసం పాఠకులు వ్యక్తిగతంగా వైద్య నిపుణులను సంప్రదించాలని సూచన.