Vijay Deverakonda:క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి.. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). నాని (Nani) నటించిన ఈ సినిమా ద్వారా క్లైమాక్స్లో అందరి హృదయాలను దోచుకొని నటుడిగా గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఈ సినిమా తరువాత ‘పెళ్లిచూపులు’ సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన.. సందీప్ రెడ్డివంగా (Sandeep Reddy vanga) దర్శకత్వంలో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత చేసిన గీతాగోవిందం మరో మంచి విజయాన్ని అందించింది . అయితే కథల ఎంపిక విషయంలో కాస్త తడబడిన విజయ్ దేవరకొండ సరైన సక్సెస్ ను మాత్రం అందుకోలేదు.
గత కొన్ని సంవత్సరాలుగా పాన్ ఇండియా రేంజ్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు ..కానీ ఆ తరహా గుర్తింపు అయితే లభించలేదు అనడంలో సందేహం లేదు. ఇకపోతే ఇప్పుడు నేషనల్ క్రిష్ రష్మిక మందన్న (Rashmika mandanna) తో ఏడడుగులు వేసి నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. అయితే అలాంటి ఈయనకు పెళ్లి అంటే ఇష్టం లేదని.. కానీ ఆమె వల్లే తనను తాను మార్చుకొని.. ఇప్పుడు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు అంటూ విజయ్ గురించి ఎన్నో తెలియని విషయాలను ప్రముఖ నిర్మాత పంచుకున్నారు.
అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ నిర్మాత, విజయ్ దేవరకొండ మేనమామ యష్ రంగినేని (Yash Rangineni) మాట్లాడుతూ.. “ఒకప్పుడు విజయ్ ఆలోచనలు చాలా భిన్నంగా ఉండేవి. అసలు పెళ్లి అవసరమా? కెరియర్ మీద దృష్టి పెట్టకుండా.. ఈ బంధాలు ఏంటి? అని వాదించేవాడు. ఒక రకంగా చెప్పాలి అంటే విజయ్ మ్యారేజ్ హేటర్. కానీ రష్మిక తన జీవితంలోకి వచ్చిన తర్వాత అన్నీ మారిపోయాయి. రష్మిక.. విజయ్ ని ఒక బాధ్యత కలిగిన వ్యక్తిలా మార్చేసింది” అంటూ అటు విజయ్ గురించి కామెంట్లు చేస్తూనే.. రష్మిక మందన్న పై ప్రశంసలు కురిపించారు యష్ రంగినేని.. వాళ్ళిద్దరిని చూస్తుంటే ముచ్చటేస్తోంది ” అంటూ ఆయన కామెంట్లు చేశారు ప్రస్తుతం యష్ రంగినేని చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఆయన మాటలు విన్న అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఒకరు మన జీవితంలోకి వచ్చాకే మనలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ALSO READ:Anshu Ambani: 40 ఏళ్ల ప్రాయం.. రీ ఎంట్రీలో స్ట్రాంగ్ పిల్లర్ అతనే.. నాగార్జున హీరోయిన్ ఎమోషనల్!
విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న రిలేషన్షిప్ విషయానికి వస్తే గీతాగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల తర్వాత వీరి పరిచయం ప్రేమగా మారింది. ఇక అప్పటినుంచి ఎనిమిది సంవత్సరాల పాటు రహస్యంగా తమ బంధాన్ని మెయింటెన్ చేశారు. గతేదాడి రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. ఈ ఏడాది ఫిబ్రవరి 26న వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఇక ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో రణబాలి సినిమా వస్తుండగా.. మే 12వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది . ఈ చిత్రానికి రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించనున్నారు