Sikandar Raza: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) నేపథ్యంలో టీమిండియా పరిస్థితి దారుణంగా తయారైంది. సూపర్ 8 లో దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా ( India vs South Africa ) మధ్య మ్యాచ్ జరగగా, సూర్య కుమార్ యాదవ్ సేన దారుణంగా ఓటమిపాలైంది. దీనికి తోడు నిన్న జరిగిన జింబాబ్వే మ్యాచ్ లో వెస్టిండీస్ పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ దెబ్బకు వెస్టిండీస్ పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి వెళ్ళింది. మూడో స్థానానికి టీమిండియా పరిమితమైంది. ఇక ఈ సూపర్ 8 లో భాగంగా ఫిబ్రవరి 26 వ తేదీన జింబాబ్వేతో టీమిండియా ( India vs Zimbabwe) మ్యాచ్ జరగనుంది. ఇలాంటి నేపథ్యంలో జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రాజా ( ZIM Captain sikandar raza) సంచలన వ్యాఖ్యలు చేశారు. టీమిండియా అయితే భయపడాలా, సెంటర్ ఏదైనా, ప్లేస్ ఎక్కడైనా టీమిండియాను చిత్తు చిత్తుగా ఓడిస్తామని వార్నింగ్ ఇచ్చాడు. కచ్చితంగా గెలవాల్సిన ఈ మ్యాచ్ లో టీమిండియాను లేపి అవతల పడేస్తామని హెచ్చరించారు.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా తన తదుపరి మ్యాచ్ జింబాబ్వేతో ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ రెండు దాంట్లో మధ్య ఫిబ్రవరి 26వ తేదీన చెన్నై వేదికగా మ్యాచ్ జరగనుంది. రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రాజా. తమ జట్టు వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడిపోయిందని గుర్తు చేసిన సికిందర్ రాజా… టీమిండియా కూడా దక్షిణాఫ్రికా ( South Africa) చేతిలో ఓడిపోయి ఒత్తిడిలో ఉందని వెల్లడించారు. కాబట్టి తమ రెండు జట్లలో… ఎవరికి కూడా అడ్వాంటేజ్ లేదని వివరించారు.
ఈ క్షణంలో చెన్నై వేదికగా టీం ఇండియాను దెబ్బ కొడతామని వార్నింగ్ ఇచ్చారు సికిందర్ రాజా ( ZIM Captain sikandar raza). ఎదురుగా ఉన్న ఇండియాను చూసి అస్సలు భయపడబోము.. టీమిండియా వీక్నెస్ పాయింట్లపై దెబ్బ కొడతామని హెచ్చరించాడు. వెస్టిండీస్ జట్టుతో ఆడిన సమయంలో చేసిన మిస్టేక్స్ నుంచి బయటకు వస్తామని పేర్కొన్నారు. ఇండియా పై మంచి ఫైట్ ఇచ్చి వాళ్ళని ఓడిస్తామని హెచ్చరించాడు. దీంతో సికిందర్ రాజా వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయిన టీమిండియా, జింబాబ్వే అలాగే వెస్టిండీస్ జట్లపై ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవేళ ఒక్క మ్యాచ్ లో కూడా టీమిండియా ఓడిపోయినా, ఇంటిదారి పట్టాల్సిందే.
🚨 BIG STATEMENT BY SIKANDAR RAZA ON TEAM INDIA 🚨
Sikandar said – “Both us and India have lost a game each, so there’s plenty to prove in the next game. We’ll take lessons from tonight and try to beat India in Chennai”.
What's your take 🤔 pic.twitter.com/gDEP1fuJZm
— Richard Kettleborough (@RichKettle07) February 24, 2026